• facebook
  • whatsapp
  • telegram

ఇంట‌ర్మీడియ‌ట్‌లో చేరేముందు

విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరేముందు సొంతంగా గ్రూపును ఎంచుకునేందుకు కొన్ని పరిమితులున్నాయి. అవి..

పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థుల్లో చాలామందికి ఇంటర్లో ఉండే గ్రూపుల గురించి సరైన అవగాహన ఉండదు. ఏ గ్రూపులో ఏయే సబ్జెక్టులు ఉంటాయో, భవిష్యత్తులో వాటికి ఉన్న ఉపాధి అవకాశాలేమిటో చాలామందికి సరిగ్గా తెలియకపోవచ్చు.

గ్రూపుల గురించి తెలుసుకున్నా, ఏ గ్రూపులో రాణించగలరనే విషయంలో వారికి ఒక స్పష్టత ఉండకపోవచ్చు.

సొంతంగా నిర్ణయం తీసుకునేంత వయసు, అనుభవం లేకపోవడంతో తల్లిదండ్రులు, స్నేహితులు ఇచ్చే సలహాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.

ఇలా అయోమయ పరిస్థితుల్లో ఏదో ఒక గ్రూపును ఎంచుకుంటే తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నింటికీ మించి విలువైన కాలం వృథా అవుతుంది.

ఈ పరిమితులను అధిగమించి, సరైన నిర్ణయం తీసుకోవాలంటే, విద్యార్థి ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు ముందే కొంత పరిజ్ఞానం సంపాదించాలి. అంతకంటే ముందు తన బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని గ్రూపును ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి అభిరుచి, సామర్థ్యం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు కూడా ఏ గ్రూపులో చేరాలనే విషయమై అతడికి సలహా ఇవ్వాలి.

Posted Date: 20-10-2020


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌