• facebook
  • whatsapp
  • telegram

హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీలో డిప్లొమా

* పదో తరగతి మార్కులతో ఎంపిక

   

తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ కేంద్రం మూడేళ్ల వ్యవధి ఉన్న ‘డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ’ కోర్సును అందిస్తోంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 

కోర్సు పూర్తయిన తర్వాత టెక్స్‌టెల్స్‌ తయారీ కంపెనీల్లో ఉద్యోగాలుంటాయి. ఇక్కడ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.వెయ్యి, రెండో సంవత్సరం రూ.1100, మూడో ఏడాది రూ.1200 ఉపకార వేతనం అందిస్తారు. బాలురకు వసతి గృహం అందుబాటులో ఉంది.

   

శిక్షణ ఇలా.. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆరు కేంద్ర సంస్థలు కాగా నాలుగు రాష్ట్రస్థాయివి. వెంకటగిరిలోని ఈ సంస్థ రాష్ట్ర స్థాయిది. చేనేతకు సంబంధించి పరిశోధన, ప్రయోగాలు చేసి నాణ్యమైన ఉత్పత్తులు అందించడానికి వీటిని నెలకొల్పారు. ఈ సంస్థలన్నీ మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టెల్స్‌ ఆధ్వర్యంలో ఉంటాయి. మూడేళ్ల డిప్లొమాలో స్పిన్నింగ్, డైయింగ్, ప్రింటింగ్, ఫినిషింగ్, డిజైన్, క్వాలిటీ పరీక్షలు, మార్కెటింగ్‌ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. మూడో సంవత్సరం కోర్సులో అదనంగా అపారెల్‌ అండ్‌ గార్మెంట్‌ మేకింగ్‌ టెక్నాలజీ శిక్షణ ఇస్తున్నారు. వివిధ రకాల వస్త్రాల తయారీలో మెలకువలు నేర్పుతారు. బ్యాగులు, ఇతర వస్తువుల తయారీలోనూ తర్పీదు అందిస్తారు. 

ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు చేనేత, జౌళి రంగ పరిశ్రమల్లో కొలువులు సాధిస్తున్నారు. కోర్సు పూర్తికాగానే కళాశాల ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కొంత మంది విద్యార్థులు అనుభవంతో విదేశాల్లోనూ అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. ఇంకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన జౌళి, చేనేత విభాగాలు, సహకార సంఘాలలో వీరికి ఉపాధి లభిస్తుంది.. 

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత

వయసు: జులై 1, 2023 నాటికి బీసీ, జనరల్‌ కేటగిరీలకు 15 నుంచి 23 సంవత్సరాలు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు. 

దరఖాస్తు: వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని నింపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 26, 2023

వెబ్‌సైట్‌: www.iihtvgr.com

   

మరింత సమాచారం... మీ కోసం!

‣ 8,612 ఉద్యోగాలకు ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌

‣ ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు

‣ డిగ్రీ, బీటెక్‌తో వాయుసేనలో ఉన్నతోద్యోగం

‣ ఇంటర్‌తో ఆర్మీలో చదువు.. ఆపై ఉద్యోగం

    - శ్యామ్, న్యూస్‌టుడే, వెంకటగిరి 
 

Posted Date: 08-06-2023


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌