• facebook
  • whatsapp
  • telegram

మినీ ఎంబీఏ

ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ విద్యకు ఆదరణ పెరుగుతోంది. హార్వర్డ్‌, ఎంఐటీ వంటి విశ్వవిద్యాలయాలు కూడా వారి కోర్సులను అంతర్జాల వేదికగా అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మనదేశంలో మై బీస్కూల్‌ డాట్‌కామ్‌ అందిస్తున్న ఎంబీఏ ప్రోగ్రామ్‌ కూడా ఇదే తరహా! దేశంలో భారీ బహుళజాతి సంస్థలు, పెరుగుతున్నపని అవకాశాలకు తగ్గట్టుగా ప్రముఖ బీ స్కూళ్లు తగినంతమంది మేనేజర్లను అందించలేకపోతున్నాయి. అందుకని మరింతమంది నిపుణులను తయారు చేయాలనే ఉద్దేశంతో వారి కోర్సులను ఆన్‌లైన్‌లో అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

వృత్తిపరంగా పురోగతి సాధించడానికి యువ నిపుణులకు మేనేజ్‌మెంట్‌ డిగ్రీ చేతిలో ఉండడం నేడు ప్రాథమిక అవసరంగా మారింది. బిజినెస్‌ స్కూళ్లలో ఫుల్‌టైం ఎంబీఏ చేయడానికే విద్యార్థులు మొగ్గు చూపుతారు. కానీ వాటిల్లో నిర్ణీత సంఖ్యలో మాత్రమే సీట్లుంటాయి. వాటి కోసం వేచివుంటే కెరియర్‌లో బ్రేక్‌ ఏర్పడుతుంది. కాబట్టి విద్యార్థులు దూరవిద్యపై మొగ్గు చూపుతున్నారు. దీంతో పరిమిత సీట్లు, తమ విద్యార్థులకున్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బీ స్కూళ్లు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ రూపంలో విద్య ప్రముఖ విధానంగా పేరు పొందుతోంది. మనదేశంలో రెగ్యులర్‌ కోర్సులు ఖరీదవ్వడంతోపాటు పోటీ కూడా పెరిగింది. దీంతో దూరవిద్య, ఆన్‌లైన్‌ విద్యలు అద్భుతమైన కోర్సులుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ-లెర్నింగ్‌ నిలకడతో కూడుకుని ఉంటుంది. నేర్చుకోవడం విద్యార్థి వేగం, సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌ కోర్సులు తక్కువ ఖర్చుతో ఉన్నత చదువులు చదవడానికి దోహదపడతాయి. 3జీ, బ్రాడ్‌బాండ్‌, తక్కువ ఖర్చుతో లభించే టాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లు ద్వారా చిన్న పట్టణాలకు చెందిన వారైనా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫాకల్టీ, ఆయా రంగాల నిపుణుల ప్రసంగాలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చు.

దృశ్య శ్రవణ పాఠాలు

myBskool.com అభివృద్ధి చేసిన వేదిక ఆడియో పాఠాలు, వీడియో లెక్చర్లు, అనేక కేస్‌స్టడీ చర్చలు, స్కిల్‌ బిల్డర్స్‌ను అందిస్తోంది. ఇవన్నీ దేశంలోని ప్రముఖ సంస్థలకు చెందిన ప్రఖ్యాత ఫ్యాకల్టీ, ఇతరులకు సాధారణంగా అందుబాటులో లేని మేనేజర్లుగా ప్రాక్టీసు చేస్తున్నవారు చెప్పినవే. ఉన్నత సాంకేతికతను ఉపయోగించి ఈ వీడియోలను జీరో బఫరింగ్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌తో నడిచేలా రూపొందించారు.

తాజాగా అందిస్తున్న 3 స్క్రీన్‌ ఫ్లాట్‌ఫాం (పీసీ- టాబ్లెట్‌- స్మార్ట్‌ఫోన్‌) కాలవ్యవధి, దూరంతో సంబంధం లేకుండా అతి తక్కువ ఖర్చుతో ప్రఖ్యాత మేనేజ్‌మెంట్‌ విద్యను అందించే కోర్సుగా.. 'పోర్టబుల్‌ క్లాస్‌రూం' విధానానికి వాస్తవ రూపంగా చెప్పుకోవచ్చు.

వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని myBskool.com మినీ ఎంబీఏ ప్రోగ్రామ్‌ను ఉచితంగా అందిస్తోందని సంస్థ సీఈఓ స్వామినాథన్‌ తెలిపారు. బిజినెస్‌ ఫండమెంటల్స్‌లో అనుభవపూర్వక జ్ఞానంతోపాటు, శిక్షణ నియమావళిని అందించడమే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. మేనేజ్‌మెంట్‌లోని ముఖ్య కార్యకలాపాలను గ్రహించేటట్లు చేయడంతోపాటు సరైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేలా ఈ ప్రోగ్రాం ఉపకరిస్తుంది. ఈ ఎంబీఏను నిపుణులు తమ శక్తి సామర్థ్యాలకు, నైపుణ్యాలకు ఆధారంగా ఎంచుకోవచ్చు. ఇది అభ్యర్థులు తాము చేస్తున్న కంపెనీల్లో ఉన్నతస్థానాన్ని పొందడానికీ ఉపకరిస్తుంది. ఎంబీఏలో చేరాలనుకునే అభ్యర్థులు ఏ విభాగాన్ని ఎంచుకోవాలో తెలుసుకోవడానికీ, ఉద్యోగస్థులైన వారికి తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికీ, వారి మేనేజీరియల్‌ పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవడానికీ ఇదో అవకాశం.

తరగతులకు హాజరు కావాలంటే ఉద్యోగస్థులు తమ కెరియర్‌కు కొంత విరామం ప్రకటించాల్సి వస్తుంది. ఇలాంటివారికి ఉన్నత విద్యను చదవడం ఒక సవాలని చెప్పవచ్చు. myBskool.com మినీ ఎంబీఏను ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తూ కాలం, దూరం వంటి సమస్యలను అధిగమించేలా చేస్తుంది.

ఆర్థికశాస్త్రం ప్రాథమిక భావనలు, అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ మౌలికాంశాలు, మార్కెటింగ్‌ ప్రాథమికాంశాలు, బిజినెస్‌ కమ్యూనికేషన్‌ అత్యావశ్యకాలు అనే 4 సబ్జెక్టులపై ఆన్‌లైన్‌ వీడియో లెక్చర్లు, కేస్‌స్టడీలు అందిస్తారు. వ్యాపారజ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటున్న నిపుణులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులు, విద్యార్థులు దీన్ని ఎంచుకోవచ్చు.

ఆసక్తి ఉన్నవారు వివరాల కోసం www.mybskool.com  సందర్శించవచ్చు

Posted Date: 21-10-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌