• facebook
  • whatsapp
  • telegram

పర్యటక రంగంలో పెరుగుతున్న అవకాశాలు

పుస్తక పఠనం విజ్ఞానాన్ని పెంపొందింపజేస్తే, పర్యటనల వల్ల మనో వికాసం పెరుగుతుంది. పుస్తకాల్లో చదివిన విషయాలను ప్రత్యక్షంగా చూసినప్పుడు కలిగే అనుభూతే వేరు. ఏ పుస్తకాల్లో రాయని అంశాలను కూడా తెలుసుకునే అవకాశం పర్యటనల వల్ల కలుగుతుంది. వివిధ భాషలు, మతాలు, ప్రాంతాలకు చెందిన ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లను తెలుసుకోవడానికి పర్యటనలకు మించిన సాధనం లేదు. అందువల్లే పర్యటక రంగానికి నానాటికీ ఆదరణ పెరుగుతోంది. ఫలితంగా ఈ రంగంలో అవకాశాలూ అధికమవుతున్నాయి. విజ్ఞానంతోపాటు ఆహ్లాదాన్నీ అందించే ఈ రంగంలోకి ప్రవేశించడానికి కావాల్సిన నైపుణ్యాలు, లభించే అవకాశాల గురించి తెలుసుకుందాం..


   పర్యటక రంగానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇంటర్నెట్ ద్వారా మెరుగైన ప్రచారం లభించడం, ప్రభుత్వాలు దీని ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రోత్సహించడంతో ఈ రంగం సరికొత్త ఆర్థిక వనరుగా అవతరించింది. కేవలం పర్యటక రంగంపై వచ్చే ఆదాయంతోనే మనుగడ సాగించే దేశాలూ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.  ఈ రంగంలో భారతదేశానికి కూడా మంచి గుర్తింపు ఉంది.
   మనోహరమైన, ఎత్తయిన పర్వతాలు, మానసికోల్లాసాన్ని కలిగించే అందమైన సముద్ర తీర ప్రాంతాలు, చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే పురాతన కట్టడాలు, స్తూపాలు, ప్రముఖ దేవాలయాలు ఉండటం వల్ల భారతదేశానికి ఏటా పర్యటకుల సంఖ్య పెరుగుతోంది. టూరిజం డెవలప్‌మెంట్ కింద హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిస్టు కాంప్లెక్సులు, ట్రావెల్ ఏజెన్సీలు, టూరిస్టు ఆపరేటర్స్, రవాణా, ఎమ్యూజ్‌మెంట్ పార్కులు, స్పోర్ట్స్ యూనిట్లతో పాటు సాంస్కృతిక కళారంగాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఆయా విభాగాలన్నీ టూరిస్టులను ఆకర్షించడానికి విధిగా తమ పనులు నిర్వహిస్తున్నాయి.

 

   డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో నడిచే టూరిజం డిపార్టుమెంటు జాతీయ విధానాలు, కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. ఈ శాఖకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కార్యాలయాలున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో ఉండే టూరిజం శాఖలన్నీ పర్యటక ప్రదేశాల ప్రచారాన్ని నిర్వహిస్తాయి. అంతేకాకుండా టూరిజం సంబంధిత పరిశ్రమలను స్థాపించే వారికి, టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.
 

ట్రావెల్ ఏజెన్సీలు
   టూరిస్టులకు కావాల్సిన సకల సౌకర్యాలను ట్రావెల్ ఏజెన్సీలు ఏర్పాటుచేస్తాయి. ఇవి వివిధ పర్యటక కేంద్రాలకు సంబంధించిన హోటళ్లు, రవాణా సర్వీసుల వివరాలను అందించడంతోపాటు పర్యటకులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తాయి. పర్యటక కేంద్రాల్లో గైడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
 

ఉద్యోగావకాశాలు
   ట్రావెల్ ఏజెన్సీలు తమ పరిధిలో చాలా మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. టూరిజంలో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఈ ఏజెన్సీల్లో ఉద్యోగాలను పొందవచ్చు. ఎక్కువగా ప్రయాణాలు చేసే అలవాటు ఉండి, వాక్చాతుర్యం ఉన్నవారు ఈ శాఖల్లో లైసెన్స్‌డ్ గైడ్లుగా ఉపాధి పొందడానికి అవకాశాలున్నాయి. అలా ఎంపికైన లైసెన్స్‌డ్ గైడ్లందరికీ టూరిజం డిపార్టుమెంటు, ఆయా రాష్ట్ర శాఖా కార్యాలయాల్లో శిక్షణను అందిస్తోంది.
 

హోటళ్లలో..
   టూరిజం డిపార్టుమెంటు, హోటళ్లకి అవినాభావ సంబంధం ఉండటం వల్ల ఆయా పర్యటక కేంద్రాల్లో ఉండే హోటళ్లు, రెస్టారెంట్లు వివిధ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీల్లో డిగ్రీ, డిప్లొమా చేసినవారు ఇలాంటి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు. భారతదేశంలో ఉన్న 20 హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థలకి సంబంధించి ఒకేసారి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ప్రవేశపరీక్షలో అర్హత సాధించినవారు మూడేళ్ల డిప్లొమా కోర్సులకి అర్హులవుతారు. సాధారణంగా హోటల్ మేనేజ్‌మెంట్‌లో హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, ఫుడ్ అండ్ బేవరేజ్, పి.ఆర్. మార్కెటింగ్ విభాగాలుంటాయి.
 

ట్రాన్సుపోర్టు సర్వీసుల్లో..
   టూరిజం రంగంలో రవాణా సర్వీసులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పర్యటకులను ఆకర్షించే నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ ప్రత్యేక స్కీములను ప్రవేశపెడుతున్నాయి. విదేశీ టూరిస్టులను ఆకర్షించడానికి భారతీయ రైల్వేలు లగ్జరీ రైళ్లను నడుపుతున్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సైతం టూరిస్టుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది.


కావాల్సిన నైపుణ్యాలు
* మంచి భావవ్యక్తీకరణ నైపుణ్యాలుండాలి. ఈమెయిళ్లు, ఫోన్ కాల్స్‌కు ఆకట్టుకునేవిధంగా వివరణలివ్వగలిగే నైపుణ్యం ఉండాలి.
* వివిధ భాషల్లో ప్రవేశం ఉండటంతోపాటు అనువాదం చేయగలిగే సామర్థ్యం ఉండాలి.
* చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక అంశాలపట్ల లోతైన అవగాహన ఉండాలి.
* వైవిధ్య ప్రదేశాల గురించి తెలుసుకునే ఆసక్తి ఉండాలి.
* పర్యటక రంగానికి చెందిన వివిధ విభాగాలను సయన్వయం చేసుకొని పనిచేసే నైపుణ్యం ఉండాలి.
* సృజనాత్మకత ఉండాలి. పర్యటక ప్రదేశాలకు సంబంధించిన వివరాలను సమర్థంగా ప్రచారం చేసే నైపుణ్యం ఉండాలి.

 

శిక్షణా సదుపాయాలు
   టూరిజం శాఖలో నిపుణులను పెంచే ఉద్దేశంతో 'ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్' (ఐఐటీటీఎం) ప్రత్యేక శిక్షణా సదుపాయాలను ఏర్పాటుచేస్తోంది.  ఈ సంస్థ భువనేశ్వర్, గ్వాలియర్ శాఖల్లో 14 నెలల డిప్లొమా కోర్సును నిర్వహిస్తోంది.
   ఇదే కోర్సును బిలాస్‌పూర్‌లో ఉన్న గురుఘాసిదాస్ విశ్వవిద్యాలయం(www.ggu.ac.in) కూడా అందుబాటులోకి తెచ్చింది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, 28 సంవత్సరాల్లోపు ఉన్న వారంతా ఈ కోర్సు చేయడానికి అర్హులు. ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ కోర్సుతోపాటు డిప్లొమా ఇన్ డెస్టినేషన్ మేనేజ్‌మెంట్, వైల్డ్ లైఫ్ టూరిజం మేనేజ్‌మెంట్, టూరిజం ఆపరేషన్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్ కోర్సులను ఆయా సంస్థలు అందిస్తున్నాయి. ఢిల్లీ, లక్నో, తిరువనంతపురంలోని శాఖల్లో మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాములను కూడా ఐఐటీటీఎం నిర్వహిస్తోంది. ఈ డెవలప్‌మెంట్ ప్రోగ్రాముల కింద ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు..
* టూరిజం, ట్రావెల్ ఏజెన్సీల్లో కంప్యూటర్ అప్లికేషన్లలో బేసిక్ కోర్సు
* ఎయిర్ ట్రావెల్ ఫేర్స్, టికెటింగ్‌ల్లో బేసిక్ కోర్సు
* ఫారెన్ లాంగ్వేజెస్ కోర్సులు

అర్హత: పై మూడు కోర్సులకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఫారెన్ లాంగ్వేజెస్ కోర్సులకి మాత్రం ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు టూరిజంలో బీఏ, ఎంఏ డిగ్రీలను అందిస్తున్నాయి. టూరిజంలో బీఏ డిగ్రీ చేయాలనుకునేవారు ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.
 

టూరిజం డిగ్రీ కోర్సును అందిస్తున్న సంస్థలు:
 

ఆంధ్రప్రదేశ్‌లో..
 

1) విక్రమ సింహపురి యూనివర్సిటీ - నెల్లూరు
వెబ్‌సైట్: www.simhapuriuniv.in
 

2) పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ - హైదరాబాద్
వెబ్‌సైట్: www.teluguuniversity.ac.in
 

3) ఆదికవి నన్నయ యూనివర్సిటీ - రాజమండ్రి
వెబ్‌సైట్: www.nannayauniversity.info
 

4) ఫ్త్లెయింగ్ కాట్స్ - విశాఖపట్నం
వెబ్‌సైట్: www.flyingcatsvizag.com
 

5) ఫ్రాంక్‌ఫిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ - విశాఖపట్నం
వెబ్‌సైట్: www.frankfinn.com
 

6) బ్లూమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఖీ కేటరింగ్ టెక్నాలజీ - హైదరాబాద్
వెబ్‌సైట్: www.bloomscollege.org  

7) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ - హైదరాబాద్
వెబ్‌సైట్: www.nithm.ac.in
 

8) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్త్లెడ్ న్యూట్రిషన్ - హైదరాబాద్
వెబ్‌సైట్: www.ihmhyd.org
 

9) ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ టూరిజం - విశాఖపట్నం
వెబ్‌సైట్: www.indoamericanin.org
 

10) అల్లియన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఖీ హోటల్ మేనేజ్‌మెంట్ - హైదరాబాద్
వెబ్‌సైట్: http://alliancemgt.org
 

11) శ్రీ శక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ - హైదరాబాద్
వెబ్‌సైట్: www.sschm.com
 

12) క్యోని అకాడమీ - హైదరాబాద్
వెబ్‌సైట్: http://kuoniacademy.co.in
 

13) మహాత్మా గాంధీ కాలేజ్ - గుంటూరు
వెబ్‌సైట్: www.mahatmagandhicollege.com
 

14) కాకతీయ యూనివర్సిటీ - వరంగల్
వెబ్‌సైట్: www.kakatiya.ac.in
 

15) ద్రవిడియన్ యూనివర్సిటీ - చిత్తూరు
వెబ్‌సైట్: www.dravidianuniversity.ac.in
 

16) ఆంధ్రా యూనివర్సిటీ - విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 

17) ఆచార్య నాగార్జున యూనివర్సిటీ - గుంటూరు
వెబ్‌సైట్: www.anu.ac.in
 

భారతదేశంలో..
* ఉత్కళ్ యూనివర్సిటీ - భువనేశ్వర్
వెబ్‌సైట్: www.utkaluniv.ac.in
* యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా
వెబ్‌సైట్: www.caluniv.ac.in
* యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
వెబ్‌సైట్: www.du.ac.in
* కురుక్షేత్ర యూనివర్సిటీ - హర్యానా
వెబ్‌సైట్: www.kuk.ac.in
* మహర్షి దయానంద్ యూనివర్సిటీ - రోహ్‌తక్
వెబ్‌సైట్: www.mdurohtak.ac.in
* హిమాచల్‌ప్రదేశ్ యూనివర్సిటీ - సిమ్లా
వెబ్‌సైట్: www.hpuniv.nic.in
* డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ - ఆగ్రా
వెబ్‌సైట్: www.dbrau.ac.in
* బెనారస్ హిందూ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.bhu.ac.in
* యూనివర్సిటీ ఆఫ్ ముంబయి
వెబ్‌సైట్: www.mu.ac.in
* యూనివర్సిటీ ఆఫ్ పుణే
వెబ్‌సైట్: www.unipune.ac.in
* బెంగళూరు యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.bangaloreuniversity.ac.in
* యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
వెబ్‌సైట్: www.unom.ac.in
* యూనివర్సిటీ ఆఫ్ కాలికట్
వెబ్‌సైట్: www.universityofcalicut.info
   కురుక్షేత్ర యూనివర్సిటీ, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, గ్వాలియర్‌లోని శివాజీ యూనివర్సిటీ, ఔరంగాబాద్‌లోని మరట్వాడా యూనివర్సిటీ, పాండిచ్చేరిలోని పాండిచ్చేరి యూనివర్సిటీ, సిమ్లాలోని హెచ్‌పి యూనివర్సిటీ, ఇండోర్‌లోని దేవి అహల్య యూనివర్సిటీ, లక్నో యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ టూరిజంలో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీని అందిస్తున్నాయి.
   టూరిజం మేనేజ్‌మెంట్‌లోనూ అనేక సంస్థలు పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీని అందిస్తున్నాయి. టూరిజం పరిధిలోకి వచ్చే వాటర్ స్పోర్ట్స్‌ను కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ ఈ విభాగంలో శిక్షణనిస్తుంది. దీంట్లో భాగంగా సెయిలింగ్, వాటర్ స్కైయింగ్, లైఫ్ సేలింగ్‌లతో పాటు వాటర్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లోనూ శిక్షణనిస్తున్నాయి.
   ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల్లో టూరిజం, ట్రావెల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ కోర్సును అందిస్తున్నాయి. మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ కోర్సులను కూడా ఆంధ్రా యూనివర్సిటీ అందిస్తోంది. ఇది పార్ట్‌టైమ్ కోర్సు, దీని కాల పరిమితి రెండేళ్లు.

 

రెగ్యులర్ కోర్సుల వివరాలు
1) డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హైదరాబాద్
కోర్సు: ఎంబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ)
అర్హత: ఏదైనా డిగ్రీ
ఎంపిక: CAT/ XAT/ MAT/ ICET అర్హత ఆధారంగా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: www.nitham.ac.in

 

2) ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు
కోర్సు: మాస్టర్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్
అర్హత: ఏదైనా డిగ్రీ
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in

 

3) kuoni academy, Hyderabad    
కోర్సు: ఎంబీఏ (ట్రావెల్ అండ్ టూరిజం)
అర్హత: ఏదైనా డిగ్రీ
వెబ్‌సైట్: www.kuoniacademy.co.in
 

4) కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్
కోర్సు: ఎంబీఏ (ట్రావెల్ అండ్ టూరిజం)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
ఎంపిక: క్యాట్ స్కోర్ ఆధారంగా
వెబ్‌సైట్: www.cusat.nic.in

 

5) కేరళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ స్టడీస్, కేరళ
కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ట్రావెల్ అండ్ టూరిజం)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ
ఎంపిక: మ్యాట్ స్కోర్ ఆధారంగా
వెబ్‌సైట్: www.kittstour.org

 

6) ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, ఢిల్లీ
కోర్సు: మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (టూరిజం మేనేజ్‌మెంట్ దూరవిద్య ద్వారా)
అర్హత: BTS/ BHM/ BA (టూరిజం)
ఎంపిక: ఏదైనా డిగ్రీ, టూరిజం డిప్లొమాతో
వెబ్‌సైట్: www.ignou.ac.in

 

7) ఆమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం, ఆమిటీ యూనివర్సిటీ, నొయిడా
కోర్సులు: 1) బ్యాచిలర్ ఆఫ్ టూరిజం అడ్మినిస్ట్రేషన్ (మూడేళ్లు)
అర్హత: 10+2
2) మాస్టర్ ఆఫ్ టూరిజం అడ్మినిస్ట్రేషన్ (రెండేళ్లు)
అర్హత: ఏదైనా డిగ్రీ

3) ఎంబీఏ టూరిజం (రెండేళ్లు)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (ఏదైనా) + మూడేళ్ల అనుభవం
వెబ్‌సైట్: http://amity.edu

 

8) యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, చెన్నై
కోర్సులు: డిప్లొమా కోర్సు ఇన్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ ఇన్ డిస్టెన్స్ మోడ్
అర్హత: ఏదైనా డిగ్రీ
వెబ్‌సైట్: www.unom.ac.in

 

9) ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ ఇన్ డిస్టెన్స్ మోడ్
అర్హత: ఏదైనా డిగ్రీ
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

 

పర్యటక రంగంలో దూరవిద్యా కోర్సులు
   కొన్ని విశ్వవిద్యాలయాలు దూరవిద్యా విధానంలోనూ పర్యటక రంగానికి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. బీఏ, బీఎస్సీ, బీటీఎస్, ఎంబీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్, పీహెచ్‌డీ తదితర కోర్సులు వీటిలో ఉన్నాయి.
 

బీఏ కోర్సులు..
1) అన్నామలై యూనివర్సిటీ
వెబ్‌సైట్: http://annamalai.ac.in

 

2) కాకతీయ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.kakatiya.ac.in

 

3) నలంద యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.nalandauniv.edu.in

 

4) ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.ignou.ac.in

 

బీఎస్సీ కోర్సులు..
1) కామరాజ్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.mkuniversity.ac.in

 

2) యశ్వంత్‌రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.ycmou.digitaluniversity.ac

 

పీజీ కోర్సులు..
1) అలగప్ప యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.alagappauniversity.ac.in

 

2) ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.ignou.ac.in

 

3) అన్నామలై యూనివర్సిటీ
వెబ్‌సైట్: http://annamalai.ac.in

 

4) కామరాజ్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.mkuniversity.org

 

5) యశ్వంత్‌రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.ycmou.digitaluniversity.ac

 

డిప్లొమా కోర్సులు..
1) మద్రాస్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.unom.ac.in

 

2) వినాయక మిషన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.vinayakamission.com

 

3) వర్థమాన్ మహావీర్ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.vmou.ac.in

 

4) ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.ignou.ac.in

 

5) ఉత్తరప్రదేశ్ రాజర్షి టాండన్ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.uprtou.ac.in

 

సర్టిఫికెట్ కోర్సులు..
1) వినాయక మిషన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.vinayakamission.com

 

2) ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.ignou.ac.in

 

3) వర్థమాన్ మహావీర్ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.vmou.ac.in

 

4) డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.baou.org

 

5) మధ్యప్రదేశ్ భోజ్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.bhojuniversity.com

 

6) రాజర్షి టాండన్ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.uprtou.ac.in

 

పీజీ డిప్లొమా కోర్సులు..
* ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.anu.ac.in

 

* ఆంధ్రా యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

 

* కామరాజ్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.mkuniversity.org

 

* వినాయక మిషన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.vinayakamisson.com

 

* మణిపాల్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.manipal.edu

 

* వర్థమాన్ మహావీర్ ఓపెన్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.vmou.ac.in

 

* కువెంపు యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.kuvempu.ac.in

 

పీహెచ్‌డీ కోర్సులు..
* ఆంధ్రా యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

 

* ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in

 

* పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.teluguuniversity.ac.in

 

* మణిపాల్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.manipal.edu

Posted Date: 20-09-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌