• facebook
  • whatsapp
  • telegram

యానిమేషన్ రంగం

   ఉన్నత చదువులు చదవడం కొందరి లక్ష్యమైతే అభిరుచి ఉన్న రంగంలో ముందుకెళ్లడం మరి కొందరి లక్ష్యం. అభిరుచికి తగ్గ రంగంలో నిలదొక్కుకోవాలంటే కుటుంబం నుంచి సహాయ సహకారాలు ఎంతో అవసరం. అంతేకాక ఆయా రంగం నుంచి కూడా అంతే ప్రోత్సాహం ఉండాలి. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగిన వారిదే విజయం. ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో సరైన ఉపాధిని ఎంచుకోవడం ఓ రకంగా సవాలే. ఏ రంగంలో ప్రవేశించాలన్నా విపరీతమైన పోటీతోపాటు అపరిమితమైన విద్యార్హతలు, నైపుణ్యం అంటూ అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో కొద్దిపాటి చదువుతో భవిష్యత్‌లో ఉపాధికి భరోసా ఇచ్చేది... యానిమేషన్ రంగమే.

కోర్సు గురించి...

   ఆధునిక తరం విద్యార్థులను ఆకర్షిస్తున్న కెరియర్లలో యానిమేషన్ ఒకటి. ఈ రంగంలో భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలనుకునే వారికి ఆకాశమే హద్దు. దీనిలోకి ప్రవేశించాలంటే డిగ్రీలు పూర్తిచేయాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో రకరకాల యానిమేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అమెరికా, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే దీని హవా కొనసాగుతోంది. భారత్‌లో మెల్లగా తన సత్తా చూపుతున్న ఈ రంగం రానున్న రెండు మూడేళ్లలో వేగంగా విస్తరించే అవకాశముందన్నది నిపుణుల అంచనా. కాస్త ఊహాశక్తి, చక్కగా బొమ్మలు గీసే సామర్థ్యం, చెప్పింది అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉంటే చాలు. మీరు భవిష్యత్‌లో మంచి యానిమేషన్ రంగ నిపుణులుగా స్థిర పడవచ్చు. ప్రస్తుతం యానిమేషన్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన ఎన్నో విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయి. కొంతకాలం క్రితం వరకు కేవలం వినోద రంగంలో ఓ భాగంగా ఉన్న యానిమేషన్ ప్రస్తుతం అన్ని విభాగాలకు వేగంగా విస్తరిస్తోంది.
 

ఎలాంటి లక్షణాలుండాలంటే...

   ఈ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి డ్రాయింగ్, స్కెచింగ్ నైపుణ్యాలు అవసరం. కంప్యూటర్‌పై కనీస అవగాహన ఉండాలి. ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉంటే మంచిది. సృజనాత్మకత, ఊహాశక్తి, పరిశీలన లక్షణాలు ఉన్నవారు మంచి యానిమేటర్లుగా రాణించగలుగుతారు. యానిమేషన్ రంగంలో డిప్లొమా చేయాలంటే ఇంటర్మీడియట్ కనీస విద్యార్హతగా ఉండాలి. ఇంటర్ అర్హతతో యానిమేషన్‌లో డిగ్రీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ పూర్తిచేసిన వారికి యానిమేషన్‌లో పీజీ కోర్సులు కూడా చేసే అవకాశముంది. స్వల్పకాలిక కోర్సులు చేస్తే ఎంట్రీస్థాయి ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. కానీ ఈ రంగంలో కెరియర్ తీర్చిదిద్దుకోవాలంటే లాంగ్‌టర్మ్ కోర్సులు చేయడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. యానిమేషన్ రంగంలో మంచి అనుభవం ఉన్న నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చే సంస్థల్లో యానిమేషన్ కోర్సును అభ్యసించగలిగితే ఈ రంగంలో ఎన్నో ఉద్యోగావకాశాలు ఎదురుచూస్తున్నాయి.
 

భవిష్యత్తులో డిమాండ్ ఎక్కువే..!

   నిపుణుల అంచనా ప్రకారం యానిమేషన్ రంగంలో నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడనుంది. ఓ మోస్తరు చదువు, తక్కువ ఖర్చుతో భవిష్యత్‌లో మంచి ఉపాధిలో స్థిరపడాలనుకునేవారు యానిమేషన్ కోర్సులను ఎంచుకోవ‌చ్చు. ఒకప్పుడు వినోద రంగానికే పరిమితమైన యానిమేషన్ ఫీచర్లు నేడు అన్నిరంగాల్లోనూ దర్శనమిస్తున్నాయి. ఆటోమొబైల్, ఏరోస్పేస్, సివిల్, ఆర్కిటెక్చర్, విద్య, వైద్యం, మందుల తయారీ, వాణిజ్య ప్రకటనలు మొదలైన ఎన్నో రంగాల్లో యానిమేషన్ ఉపయోగపడుతోంది. సృజన, సాంకేతిక పరిజ్ఞానాల సమ్మేళనంగా యానిమేషన్ రంగం విస్తరిస్తోంది.
 

ఉద్యోగావ‌కాశాలు..?

   వెబ్ యానిమేషన్, ఫీచర్ సినిమాలు, వీడియో గేమ్స్, స్పెషల్ ఎఫెక్టులకు రూపకల్పన చేసేది యానిమేటర్లే. ఇందులో మోడలర్, బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్, లేఅవుట్ ఆర్టిస్ట్, స్కానర్ ఆపరేటర్, 3డి యానిమేటర్, రిగ్గింగ్ ఆర్టిస్ట్, టెక్చర్ ఆర్టిస్ట్, 2డి యానిమేటర్ తదితర విభాగాలున్నాయి. ఆసక్తిని, ఉద్యోగావకాశాలను బట్టి ఆయా విభాగాల్లో స్థిర పడవచ్చు. కొన్ని సంస్థలు స్వయంగా పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శిక్షణనిచ్చి వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.
 

యానిమేషన్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీల్లో కొన్ని...

* టాంజ్‌యానిమేషన్

* ఇండియా పెంటామీడియా గ్రాఫిక్స్

* మాయా ఎంటర్‌టైన్‌మెంట్

* యూటీవీ టాంజ్‌చ హార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్

* పద్మాలయ టెలీఫిల్మ్స్

* నిపుణ సర్వీస్ లిమిటెడ్

* జాడో వర్క్స్

* క్రెస్ట్ కమ్యూనికేషన్

* సిల్వర్‌టూన్ స్టూడియో

   వీటన్నింటితో పాటు ఎన్నో కంపెనీలు యానిమేషన్ రంగంలో నిపుణుల కోసం ఎదురుచూస్తున్నాయి.
 

విద్యా సంస్థల ఎంపిక ఎలా...?

       దేశంలో యానిమేషన్ కోర్సులను వివిధ సంస్థలు అందిస్తున్నాయి. మంచి శిక్షణ సంస్థను ఏ రకంగా ఎంచుకోవాలనేది విద్యార్థులకు తరచూ వచ్చే సందేహం. తాము చేరాలనుకున్న సంస్థల కార్యాలయాలకు వెళ్లి అక్కడ విద్యార్థులకు శిక్షణ ఏ రకంగా లభిస్తోందో తెలుసుకోవాలి. సంస్థ గత చరిత్ర, మౌలిక సదుపాయాలు పరిశీలించాలి. ఆ సంస్థలో చదివే విద్యార్థుల్లో ఎంత మందికి ఉద్యోగాలు లభించాయో తెలుసుకోవాలి. పూర్వ విద్యార్థుల అభిప్రాయాలు సేకరించాలి. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న అనంతరం నిర్ణయం తీసుకోవడం మంచిది.
 

యానిమేషన్ కోర్సు అందిస్తున్న విద్యాసంస్థలు/శిక్షణ సంస్థలు:

       కొన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు శిక్షణలో చేరే విద్యార్థులకు పరీక్ష నిర్వహించి దానిలోని ప్రతిభ ఆధారంగా సీటు కేటాయిస్తున్నాయి. 
 

1. జవహార్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్.కోర్సు: బీఎఫ్ఏ

అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత

ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా

వెబ్‌సైట్: http://www.jnafau.ac.in/
 

2. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్, హైదరాబాద్.కోర్సు: యానిమేషన్‌లో డిగ్రీ, ఎమ్మెస్సీ (మల్టీమీడియా)

అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన ఆర్హత

ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా

వెబ్‌సైట్: www.iacg.co.in 
 

3. అన్నపూర్ణ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా, హైదరాబాద్.కోర్సు: యానిమేషన్‌లో డిగ్రీ, వీఎఫ్ఎక్స్

అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత

ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా

వెబ్‌సైట్: http://www.aisfm.edu.in 
 

4. పికాసో యానిమేషన్ కాలేజ్, బంజారా హిల్స్, హైదరాబాద్.

కోర్సు: బీఎస్సీ (యానిమేషన్ అండ్ మల్టీమీడియా), ఎమ్మెస్సీ (మల్టీ మీడియా)

అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత. ఏ విభాగంలోనైనా డిగ్రీ పొంది ఉండాలి.

ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా.

వెబ్‌సైట్: www.picasso.co.in 
 

5. ఐక్యాట్‌డిజైన్ అండ్ మీడియా కాలేజ్, హైదరాబాద్.

కోర్సు: బీఏ (హానర్స్)ఇన్ కమ్యూనికేషన్ డిజైన్, ఎంఏ (మల్టీమీడియా)

అర్హత: 10+2, ఏదైనా డిగ్రీ

ప్రవేశం: ప్రవేశ ప్రరీక్షలో ప్రతిభ ఆధారంగా

వెబ్‌సైట్: http://www.icat.ac.in
 

6. అన్నా విశ్వవిద్యాలయం, చెన్నై.

కోర్సు: ఎంఈ (మల్టీమీడియా టెక్నాలజీ)

అర్హత: బీఈ/బీటెక్ (సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ)

ప్రవేశం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

వెబ్‌సైట్: www.annauniv.edu 

7. బిట్స్, నోయిడా.

కోర్సు: బీఎస్సీ (యానిమేషన్ అండ్ మల్టీమీడియా)

అర్హత: పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులు, 10+2లో సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులు

ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా

వెబ్‌సైట్: www.bitmesra.ac.in 
 

8. సెయింట్ జోసఫ్ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్, కేరళ.కోర్సు: బీఏ (యానిమేషన్ అండ్ గ్రాఫిక్ డిజైన్), ఎంఏ (యానిమేషన్)

అర్హత: 10+2, ఏదైనా డిగ్రీ

ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా

వెబ్‌సైట్: http://www.sjcc.co.in/
 

9. ఏజేకే మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్, న్యూఢిల్లీ.కోర్సు: ఎంఏ (విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్)

అర్హత: ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులు

ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా

వెబ్‌సైట్: http://www.ajkmcrc.org
 

10. ఎరీనా మ‌ల్టీమీడియా, హైద‌రాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, ముంబ‌యి.కోర్సు: డిగ్రీ( వెబ్ అండ్ గ్రాఫిక్‌, ఫిల్మ్‌మేకింగ్, విజువ‌ల్ ఎడిటింగ్‌)

వెబ్‌సైట్: http://www.arena-multimedia.com/

11. గ్లోబ‌ల్ స్కూల్ ఆఫ్ యానిమేష‌న్‌, న్యూఢిల్లీ, చెన్నై

కోర్సు: డిగ్రీ( యానిమేష‌న్ డిజైన్‌)

వెబ్‌సైట్: http://www.giga.ac.in/ 
 

12. మాయా అకాడెమీ ఆఫ్ అడ్వాన్స్‌డ్‌ సినిమాటిక్‌(మాక్‌), ఢిల్లీ, ముంబ‌యి, పుణె.కోర్సు: 3డి యానిమేష‌న్‌, మ‌ల్టీ మీడియా, వెబ్ గ్రాఫిక్ డిజైన్‌

వెబ్‌సైట్: http://www.maacindia.com/
 

13. టెక్నోపాయింట్ మ‌ల్టీ మీడియా, ముంబ‌యి, బెంగళూరు.

కోర్సు: ఫ్లాష్‌, హెచ్‌టీఎంల్‌, డ్రీమ్ వ్యూవ‌ర్‌,

వెబ్‌సైట్: http://teknopoint.in/ 
 

14. పికాసో యానిమేష‌న్ కాలేజ్‌, కెన‌డా.కోర్సు: డిగ్రీ (డిజిట‌ల్ ఫిల్మ్ మేకింగ్‌), పీజీ (మ‌ల్టీ మీడియా)
వెబ్‌సైట్: http://www.picasso.co.in/ 

15. జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్‌, మహారాష్ట్ర

కోర్సు: యానిమేష‌న్ విజువ‌ల్ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్ అండ్ విజువ‌ల్ కమ్యూనికేష‌న్‌.

వెబ్‌సైట్: http://www.zica.org/ 

16. టోంజ్‌వేబుల్ అకాడమీ, కోల్‌క‌తా.

కోర్సు: డిప్లొమా( 2డి,3డి)

వెబ్‌సైట్: http://www.toonzacademy.com/ 
 

17. విస్టిలింగ్ వుడ్ ఇంట‌ర్నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్‌, ఆస్ట్రేలియా

కోర్సు: పీజీ( మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్‌)

వెబ్‌సైట్: http://www.whistlingwoods.net/
 

18. అపీజ‌య్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌, ముంబ‌యి, నోయిడా, బెంగళూరు.

కోర్సు: డిగ్రీ( వెబ్ అండ్ గ్రాఫిక్ డిజైన్‌), ఫిల్మ్ మేకింగ్‌, ఆడియో విజువ‌ల్ ఎడిటింగ్‌.

వెబ్‌సైట్: http://www.apeejay.edu/aid/
 

19. ఫ్రేమ్ బాక్స్ యానిమేష‌న్ అండ్ విజువ‌ల్ అఫెక్ట్స్‌, మ‌హారాష్ట్ర.

కోర్సు: డిప్లొమా( 3డి యానిమేష‌న్‌), విజువ‌ల్ ఎడిటింగ్‌

వెబ్‌సైట్: http://www.htcampus.com/ 

20. ఏషియ‌న్ అకాడ‌మీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్‌, నోయిడా

కోర్సు: టీవీ గ్రాఫిక్స్ అండ్ యానిమేష‌న్‌

వెబ్‌సైట్: http://aaft.com/

Posted Date: 01-01-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌