• facebook
  • whatsapp
  • telegram

యానిమేషన్‌లో హ్యాకథాన్‌

ఫోసీ ప్రాజెక్టు, ఐఐటీ బాంబేలు వెజ్లింగ్‌ వుడ్స్‌ ఇంటర్నేషనల్‌తో కలిసి 2డి యానిమేషన్‌ హ్యాకథాన్‌ పోటీలను నిర్వహిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారెవరైనా వీటిలో పాల్గొనవచ్చు. ఇందుకోసం ఎలాంటి రుసుమూ చెల్లించనవసరం లేదు. నవంబరు 16లోగా వివరాలు నమోదు చేసుకోవాల‌ని సూచించారు. విడిగా లేదా నలుగురు కలిసి బృందంగా ఇందులో పోటీ పడవచ్చు. 

హ్యాకథాన్‌ థీమ్, ఇతర వివరాలు నవంబరు 17న ప్ర‌క‌టించారు. నవంబరు 19 నుంచి డిసెంబరు 20 వరకు ఈ పోటీలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. హైస్కూల్‌ విద్యార్థులు, వృత్తి నిపుణులు ఇలా ఎవరైనా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. వీటిలో పాల్గొన్నవారు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్, పరిమిత వనరులు ఉపయోగించి 2డీ యానిమేషన్‌లో తమ మెలకువలను ప్రదర్శించుకోవచ్చు. గ్రాఫిక్, డిజైన్, యానిమేషన్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. విజేతలకు  సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. పూర్తి వివరాలకు https://hackathon.fossee.in/synfig/ చూడవచ్చు. 

ఈ యానిమేషన్‌ కోసం సిన్‌ఫిగ్‌ స్టూడియో ఉచిత ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించడం తప్పనిసరి. దీని సాయంతో 2 నిమిషాల వ్యవధితో 2డీ యానిమేషన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ తీయాలి. నిడివి గరిష్ఠంగా అయిదు నిమిషాలకు మించరాదు. కథనం తెలుగులోనూ ఉండవచ్చు. ఒకవేళ నలుగురు సభ్యులు బృందంగా ఏర్పడితే అందులో సిన్‌ఫిగ్‌ స్టూడియో యూజర్‌/ యానిమేటర్‌/ గ్రాఫిక్‌ డిజైనర్‌/ స్టోరీ నారేటర్‌/ వీడియో ఎడిటర్‌ ఈ కాంబినేషన్‌ ఉండేలా చూసుకుంటే పని తేలికవుతుంది. సిన్‌ఫిగ్‌ స్టూడియోపై అవగాహన లేనివారికి స్పోకన్‌ ట్యుటోరియల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఫ్యాకల్టీ సభ్యులు, గ్రాఫిక్‌ డిజైనర్లు కూడా ఈ పోటీకి అర్హులే. ఒక వ్యక్తి ఒక బృందం తరఫున మాత్రమే ప్రాతినిథ్యం వహించే వీలు ఉంటుంది. ఎక్కువ బృందాల్లో ఉంటే సభ్యత్వం రద్దవుతుంది. యానిమేషన్‌ నిమిత్తం సిన్‌ఫిగ్‌ ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ మాత్రమే ఉపయోగించాలి. అందులో గ్రాఫిక్స్‌ కోసం ఎలాంటి ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌నైనా వాడుకోవచ్చు.    
 

Posted Date: 14-12-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌