• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రతిష్ఠాత్మక కోర్సులు

ఇంజినీరింగ్‌తోపాటు మేనేజ్‌మెంట్, మెడిసిన్, లా... కోర్సులను ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఎన్నాళ్ల నుంచో నడుపుతోంది. ఈ సంస్థ అందించే ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ప్రతిష్ఠాత్మకమైనవిగా గుర్తింపు పొందాయి. వీటిని పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ వేతనాలతో క్యాంపస్‌ నియామకాల్లో ఎంపికవుతున్నారు. తాజాగా వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.

ఎల్‌ఎల్‌బీ

ఎల్‌ఎల్‌బీలో ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ మూడేళ్ల లా కోర్సును రెసిడెన్షియల్‌ విధానంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌ అందిస్తోంది. మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి. ఈ కోర్సులో చేరినవారికి న్యాయవిద్యతో పాటు సైన్స్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ అంశాల్లోనూ ప్రావీణ్యం కల్పిస్తారు. 

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంజినీరింగ్‌ / మెడిసిన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా పీజీలో ప్రథమ శ్రేణి మార్కులతో సైన్స్‌ / ఫార్మసీ డిగ్రీ లేదా ప్రథమ శ్రేణి మార్కులతో ఎంబీఏతోపాటు.. ఇంజినీరింగ్‌ / మెడిసిన్‌లో యూజీ లేదా సైన్స్‌/ ఫార్మసీలో పీజీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు, పర్సనల్‌ ఇంటర్వ్యూలతో 

పరీక్ష ఇలా: మొత్తం ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే వస్తాయి. ఇందులో రెండు పార్ట్‌లు ఉన్నాయి. పార్ట్‌ 1లో మ్యాథ్స్‌ 15, సైన్స్‌ (కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ) 35 మార్కులకు ఉంటాయి. పార్ట్‌ 2లో ఇంగ్లిష్‌ 60, లాజికల్‌ రీజనింగ్‌ 20, లీగల్‌ ఆప్టిట్యూడ్‌ 70 మార్కులకు ఉంటాయి. పరీక్షలో అర్హత సాధించడానికి ఒక్కో విభాగంలోనూ 35 శాతం మార్కులు తప్పనిసరి. ఇలా అర్హులైనవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్‌ ప్రకారం అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఈ విభాగానికి 30 మార్కులు కేటాయించారు. తుది ఎంపికలో సీబీటీకి 70, పీఐకి 30 శాతం వెయిటేజీ ఉంటుంది. 

ఎల్‌ఎల్‌ఎం

కార్పొరేట్‌ లా, కాంపిటీషన్‌ లా, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ, కాన్‌స్టిట్యూషనల్‌ లా, ట్యాక్సేషన్, క్రిమినల్‌ లా అండ్‌ జస్టిస్, ఇంటర్నేషనల్‌ లా స్పెషలైజేషన్లు ఉన్నాయి. 

అర్హత: మూడేళ్లు లేదా అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌లో ప్రథమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు, పర్సనల్‌ ఇంటర్వ్యూలతో

పరీక్షలో: ఎల్‌ఎల్‌బీ సిలబస్‌ నుంచి మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. పరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దీనికి 30 మార్కులు కేటాయించారు. తుది ఎంపికలో సీబీటీకి 70, పీఐకి 30 శాతం వెయిటేజీ ఉంటుంది. 

ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం రెండు ఇంటర్వ్యూల్లోనూ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు 10, సంబంధిత కోర్సుపై ఉన్న ఆసక్తి తెలుసుకోవడానికి 10, లీగల్‌ ఆప్టిట్యూడ్‌కు 10 మార్కులు కేటాయించారు. 

దరఖాస్తులు ఎలా?

ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం రెండు కోర్సులకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15

పరీక్ష తేదీ: మార్చి 27

ఇంటర్వ్యూ తేదీ: తర్వాత ప్రకటిస్తారు

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్‌

వెబ్‌సైట్‌: https://gateoffice.iitkgp.ac.in/law/index.php

ఎంహెచ్‌ఆర్‌ఎం

మాస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంహెచ్‌ఆర్‌ఎం) కోర్సు ఖరగ్‌పూర్‌ ఐఐటీ హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ అందిస్తోంది. ఇంజినీరింగ్, టెక్నాలజీ సంస్థలకు అవసరమయ్యే మానవ వనరుల విభాగం నిపుణులను అందించడానికి ఈ కోర్సు రూపొందించారు. కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో చేరినవాళ్లు ప్రముఖ సంస్థల్లో మానవవనరుల విభాగం (హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌)లో ఉన్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. 

ఎంపిక విధానం: అకడమిక్‌ ప్రొఫైల్, క్యాట్‌ స్కోరు, ఇంటర్వ్యూలతో

అర్హత: ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా ఏదైనా పీజీలో జనరల్, ఓబీసీ అభ్యర్థులు 60 శాతం; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. క్యాట్‌ 2021 స్కోర్‌ తప్పనిసరి. షార్ట్‌లిస్టు చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 7

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు: మార్చి రెండోవారంలో.

వెబ్‌సైట్‌: http://www.iitkgp.ac.in/mhrm
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష తుది సన్నద్ధత ఎలా?

‣ నచ్చని సబ్జెక్టుపై మక్కువ పెరగాలంటే?

‣ నానోలో అవకాశాలు ఎన్నో!

‣ మానసిక ఆరోగ్యం... మరవొద్దు!

‣ కోర్సులు.. కొలువులపై సలహాలే వృత్తిగా..!

‣ ఆసాంతం స్ఫూర్తితో అలాగే సాగాలంటే?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 02-02-2022


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌