• facebook
  • whatsapp
  • telegram

సకల కోర్సులకూ.. సార్వత్రిక వేదిక! 

జులై సెషన్‌కు ‘ఇగ్నో’ ప్రవేశ ప్రకటన

విద్యార్థులూ, ఉద్యోగులూ అందరికీ సుపరిచితమైన విద్యా సంస్థ- ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో). కోర్సుల్లో వైవిధ్యం, స్టడీ సెంటర్ల అందుబాటు, నాణ్యమైన స్టడీ మెటీరియల్, ఆన్‌లైన్‌లో నేర్చుకునే సౌలభ్యం, కాంటాక్ట్‌ తరగతులు, సర్టిఫికెట్‌కు ఆదరణ... తదితర కారణాలతో ఎక్కువమంది ఈ విశ్వవిద్యాలయం అందించే కోర్సుల్లో చేరుతున్నారు. రెగ్యులర్‌ విధానంలో లేని చదువులను సైతం అందించడం ఇగ్నో ప్రత్యేకత. తక్కువ విద్యార్హతలు ఉన్నవారికీ, వృత్తి నిపుణులకూ, ఉన్నత విద్యను కోరుకునేవారికీ, స్వయం ఉపాధి ఆశించేవారికీ...ఇలా అందరి అవసరాలూ తీరేలా విభిన్న కోర్సులను ఈ విశ్వవిద్యాలయం అందిస్తోంది. ఏడాదికి రెండు సార్లు జనవరి, జులైల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తోంది. తాజాగా జులై సెషన్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు!

ఇగ్నో సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో వివిధ విభాగాల్లో కోర్సులు నడుపుతోంది. ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్, సోషల్‌ సైన్సెస్‌లే కాకుండా మెడిసిన్, న్యూట్రిషన్, నర్సింగ్, అగ్రికల్చర్, లా- ఇలా రంగాలు, వృత్తులవారీ విస్తృత కోర్సులు ఈ సంస్థ ప్రత్యేకత. స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నవారికి దారిచూపే చదువులను ఈ యూనివర్సిటీ బోధిస్తోంది. పౌల్ట్రీ, డెయిరీ ఫార్మింగ్‌ కోర్సులను తెలుగు మాధ్యమంలోనూ అందిస్తున్నారు. ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, మార్కెటింగ్‌ నిపుణులు, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్, టూర్‌ ప్లానర్స్, అకౌంటెంట్స్‌...ఇలా ఏ వృత్తి, రంగాలకైనా ఉపయోగపడే కోర్సులు వివిధ స్థాయుల్లో అందుబాటులో ఉన్నాయి.

ఇవీ కోర్సులు

ఎంఏ: రూరల్‌ డెవలప్‌మెంట్, ఇంగ్లిష్, హిందీ, ఫిలాసఫీ, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్, సైకాలజీ, ఆంత్రోపాలజీ, డెవలప్‌మెంట్‌ స్టడీస్, జండర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌. మాస్టర్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్, మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (కౌన్సెలింగ్‌), మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్, మాస్టర్‌ ఆఫ్‌ కామర్స్‌ 

బీఏ: టూరిజం స్టడీస్, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీఎల్‌ఐఎస్, ప్రిపరేటరీ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ ఒకేషనల్‌ స్టడీస్‌ (టూరిజం మేనేజ్‌మెంట్‌) కోర్సులను ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌) విధానంలో ఈ సంస్థ అందిస్తోంది. సీబీసీఎస్‌ ఆనర్స్‌ విధానంలో బీఏ: ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఇంగ్లిష్, కోర్సులను ఎంచుకోవచ్చు. ఆనర్స్‌ విధానంలో బీఎస్‌సీ బయో కెమిస్ట్రీ కోర్సు చదువుకోవచ్చు. బీబీఏ రిటైలింగ్‌ కోర్సు ఇక్కడ అందుబాటులో ఉంది. 

పీజీ డిప్లొమా: లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్, రూరల్‌ డెవలప్‌మెంట్, ట్రాన్స్‌లేషన్, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ ఆపరేషన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, ఆడియో ప్రోగ్రాం ప్రొడక్షన్, హయ్యర్‌ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ, స్కూల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఫార్మాస్యూటికల్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్, క్రిమినల్‌ జస్టిస్, అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ఫోక్‌లోర్‌ అండ్‌ కల్చర్‌ స్టడీస్, సస్టెయినబిలిటీ సైన్స్, సోషల్‌ వర్క్‌ కౌన్సెలింగ్, డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కోర్సులు ఉన్నాయి.

డిప్లొమా: ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్, పంచాయత్‌ లెవెల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్, టూరిజం స్టడీస్, ఆక్వాకల్చర్, క్రియేటివ్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లిష్, ఉర్దూ, హెచ్‌ఐవీ అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌ - ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్, విమెన్స్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్, పారా లీగల్‌ ప్రాక్టీస్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌. ఈ కోర్సుల్లో నచ్చినవాటిలో చేరవచ్చు.

పీజీ సర్టిఫికెట్‌: అడల్ట్‌ ఎడ్యుకేషన్, సైబర్‌ లా, పేటెంట్‌ ప్రాక్టీస్, బెంగాల్‌ - హిందీ ట్రాన్స్‌లేషన్, మలయాళం - హిందీ ట్రాన్స్‌లేషన్, అగ్రికల్చర్‌ పాలసీ, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ అసిస్టివ్‌ టెక్నాలజీస్, జియో ఇన్ఫర్మాటిక్స్, క్లైమెట్‌ చేేంజ్, మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ ఉన్నాయి.

అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికెట్‌: పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ కోర్సులు సైతం అందిస్తోంది.

ఫార్మాస్యూటికల్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్‌: ఫార్మా రంగంలో ముఖ్యంగా మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా రాణించాలని ఆశించేవారికి ఫార్మాస్యూటికల్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు బాగా ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్‌లో సైన్స్‌ కోర్సు చదివి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఇందులో చేరవచ్చు. రెండేళ్ల పని అనుభవం ఉన్న నాన్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్లు కూడా ఇందులో చేరడానికి అర్హులే. ఆంగ్ల మాధ్యమంలో సిలబస్‌ ఉంటుంది. కోర్సు వ్యవధి ఏడాది. ఫీజు రూ.7400.

పౌల్ట్రీ, డెయిరీ కోర్సులు: చాలా మంది ఔత్సాహికులు, నిరుద్యోగులు స్వయం ఉపాధిపై దృష్టిసారించడం మనకు తెలిసిందే. అయితే ఏమి చేయాలనుకున్నా ఆ రంగంలో ప్రాథమికావగాహన తప్పనిసరి. ఇందుకోసం తెలుగు మాధ్యమంలో ఇగ్నో పౌల్ట్రీ ఫార్మింగ్‌ కోర్సు అందిస్తోంది. ఏడాది పొడువునా చేతికి ఆదాయం అందించడం పౌల్ట్రీ ప్రత్యేకత. అయితే ఈ రంగంలో సిరులు కురవాలంటే కోళ్ల పెంపకం, వాటి పోషణ, ఫారాల నిర్వహణపై శాస్త్రీయ అవగాహన తప్పనిసరి. ఆ దిశగా ఈ కోర్సు ఉపయోగపడుతుంది. కోర్సు వ్యవధి 6 నెలలు. ఫీజు రూ.3600. ఎనిమిదో తరగతి విద్యార్హతతో ఇందులో చేరవచ్చు. ఇదే విద్యార్హతతో తేనె తయారీ కోసం బీ కీపింగ్‌ కోర్సు సైతం ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. 6 నెలల వ్యవధి గల ఈ కోర్సు ఫీజు రూ.1400. డెయిరీ ఫార్మింగ్‌ అవేర్‌నెస్‌ కోర్సును తెలుగు మాధ్యమంలో అందిస్తున్నారు. పాడిపరిశ్రమపై ఆసక్తి ఉన్నవారు ఇందులో చేరవచ్చు. జంతువుల పెంపకం, రోగాల బారినుంచి వాటిని సంరక్షించడం, పాల దిగుబడి పెంచడం, దాణా ఎంచుకోవడం..తదితరాలు ఇందులో నేర్పుతారు. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి విద్యార్హతలూ అవసరం లేదు. కోర్సు వ్యవధి 2 నెలలు. ఫీజు రూ.1100.

ఆర్గానిక్‌ ఫార్మింగ్‌: వ్యవసాయంలో రసాయనాలు, ఎరువుల వినియోగం బాగా పెరుగుతోంది. ఈ పరిణామాలు ఆరోగ్యం, పర్యావరణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వ్యవసాయదారుల్లో సేంద్రియ సాగుపై అవగాహన కల్పించడం, ఆ విధానంలో పండించిన ఉత్పత్తులకు గుర్తింపు (సర్టిఫికేషన్‌) తెచ్చుకోవడంపై అవగాహన కల్పించేలా కోర్సు రూపొందించారు. కోర్సు వ్యవధి 6 నెలలు. ఇంటర్‌ ఉత్తీర్ణులు చేరవచ్చు. ఫీజు రూ.4800.

బీపీవో: యాక్సెంచర్‌ సంస్థతో కలిసి ఇగ్నో బిజినెెస్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌లో డిప్లొమా కోర్సు అందిస్తోంది. విద్యార్థులు బీపీవో పరిశ్రమలో ఉద్యోగావకాశాలు సొంతం చేసుకునేలా కోర్సు రూపొందించారు. ఇది పూర్తిచేసుకున్నవారికి ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, బీపీవో రెండు విభాగాల్లోనూ అవకాశాలు లభిస్తాయి. 50 శాతం మార్కులతో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారూ అర్హులే. కోర్సు వ్యవధి ఏడాది. ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. ఫీజు రూ.19,200.

సర్టిఫికెట్‌: పెయింటింగ్, అప్లయిడ్‌ ఆర్ట్, థియేటర్‌ ఆర్ట్స్, హిందూస్థానీ మ్యూజిక్, కర్ణాటక్‌ మ్యూజిక్, భరతనాట్యం, అరబిక్‌ లాంగ్వేజ్, ఫ్రెంచ్‌ లాంగ్వేజ్, రష్యన్‌ లాంగ్వేజ్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, ఎన్జీవో మేనేజ్‌మెంట్, బిజినెస్‌ స్కిల్స్, టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ సెకండ్‌ లాంగ్వేజ్, ఫంక్షనల్‌ ఇంగ్లిష్, ఉర్దూ లాంగ్వేజ్, హెచ్‌ఐవీ అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, సోషల్‌ వర్క్‌ అండ్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్, సోషల్‌ వర్క్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, న్యూ బోర్న్‌ అండ్‌ ఇన్‌ఫాంట్‌ నర్సింగ్, మాటర్నల్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్, హోం బేస్డ్‌ హెల్త్‌కేర్, కమ్యూనిటీ రేడియో, టూరిజం స్టడీస్, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్, న్యూట్రిషన్‌ అండ్‌ చైల్డ్‌కేర్, రూరల్‌ డెవలప్‌మెంట్, సెరీ కల్చర్, ఆర్గానిక్‌ ఫార్మింగ్, వాటర్‌ హార్వెస్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, పౌల్ట్రీ ఫార్మింగ్, బీ కీపింగ్, హ్యూమన్‌ రైట్స్, కన్జూమర్‌ ప్రొటెక్షన్, కోపరేషన్, కోపరేటివ్‌ లా అండ్‌ బిజినెస్‌ లాస్, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్, ఇంటర్నేషనల్‌ హ్యుమానిటేరియన్‌ లా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, గైడెన్స్, కమ్యూనికేషన్‌ అండ్‌ ఐటీ స్కిల్స్, లేబొరేటరీ టెక్నిక్స్, వాల్యూ ఎడ్యుకేషన్, ఎనర్జీ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్, కాంపిటెన్సీ ఇన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, లైఫ్‌ అండ్‌ థాట్‌ ఆఫ్‌ డా.బి.ఆర్‌.అంబేడ్కర్, ఫస్ట్‌ ఎయిడ్, ట్రైబల్‌ స్టడీస్, కొరియన్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కల్చర్, స్పానిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కల్చర్, జర్మన్‌ లాంగ్వేజ్, ఫ్యాషన్‌ డిజైన్, జనరల్‌ డ్యూటీ అసిస్టెన్స్, జెరియాట్రిక్‌ కేర్‌ అసిస్టెన్స్, ఫ్లబోటమీ అసిస్టెన్స్, హోం హెల్త్‌ అసిస్టెన్స్, కమ్యూనిటీ హెల్త్, పర్షియన్‌ లాంగ్వేజ్, యోగ, పీస్‌ స్టడీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్‌.. వీటిలో ఆసక్తి ఉన్నదానిలో చేరవచ్చు. 

అప్రిసియేషన్‌ కోర్సులు: ఎన్విరాన్‌మెంట్, పాపులేషన్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌; అవేర్‌నెస్‌ ప్రోగ్రాం: వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ ఫ్రం ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్, డెయిరీ ఫార్మింగ్, గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌. 

తాజా సెషన్‌ ప్రత్యేకం

ఇగ్నోలో ఎక్కువ కోర్సులు జనవరి, జులై రెండు సెషన్లలోనూ అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని కోర్సులు మాత్రం జనవరి లేదా జులై సెషన్లకు మాత్రమే ప్రత్యేకం. జులై సెషన్‌లో లభించే కోర్సుల్లో..

ఎమ్మెస్సీ: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్, కౌన్సెలింగ్‌ అండ్‌ ఫ్యామిలీ థెరపీ; ఎంఏ: అడల్ట్‌ ఎడ్యుకేషన్, ఉమెన్‌ అండ్‌ జండర్‌ స్టడీస్‌; పీజీ డిప్లొమా: కౌన్సెలింగ్‌ అండ్‌ ఫ్యామిలీ థెరపీ, అడల్ట్‌ ఎడ్యుకేషన్, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్, ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్, బుక్‌ పబ్లిషింగ్, ఉమెన్‌ అండ్‌ జండర్‌ స్టడీస్, మెంటల్‌ హెల్త్‌; డిప్లొమా: వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ ఫ్రం ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్, డెయిరీ టెక్నాలజీ, మీట్‌ టెక్నాలజీ, ప్రొడక్షన్‌ ఆఫ్‌ వాల్యూ యాడెడ్‌ ప్రొడక్ట్స్‌ ఫ్రం సిరీల్స్, పల్సెస్‌ అండ్‌ ఆయిల్‌ సీడ్స్, ఫిష్‌ ప్రొడక్ట్స్‌ టెక్నాలజీ, వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్, రిటైలింగ్‌; సర్టిఫికెట్‌: టీచింగ్‌ ఆఫ్‌ ప్రైమరీ స్కూల్‌ మ్యాథమెటిక్స్, జపనీస్‌ లాంగ్వేజ్‌ ఉన్నాయి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: జులై 15 

తెలుగు రాష్ట్రాల్లో ఇగ్నో ప్రాంతీయ కేంద్రాలు: హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం
 

వెబ్‌సైట్‌: http://ignou.ac.in/

Posted Date: 30-06-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌