• facebook
  • whatsapp
  • telegram

రిటైల్ మేనేజ్‌మెంట్‌

ఈ రంగంలో స్థిరపడాలనుకునేవారు రిటైల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా డిగ్రీ చేయాల్సి ఉంటుంది. చాలా సంస్థలు రిటైల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ అందిస్తున్నాయి. ఎంబీఏ ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. హైస్కూల్ విద్య పూర్తి చేసినవారు సర్టిఫికెట్ కోర్సు, ఇంటర్ పాసైనవారు డిప్లొమా కోర్సు చేయవచ్చు. 
 


 

రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సులో ఉన్న రిటైలింగ్, ప్రాక్టికల్ అంశాలు భవిష్యత్తులో వృత్తి బాధ్యతలు సమర్థంగా నిర్వహించడానికి ఉపయోగపడతాయి. మార్కెటింగ్ వ్యూహాలు, అకౌంటింగ్, బిజినెస్ మ్యాథమేటిక్స్, ఎథిక్స్, లా, కస్టమర్ రిలేషన్, విజువల్ మర్చండైజింగ్, మర్చండైజింగ్, రిటైల్ కమ్యూనికేషన్, (షాపింగ్)మాల్ మేనేజ్‌మెంట్, రిటైల్ బయ్యింగ్ ఆపరేషన్స్ అంశాలు రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సులో ఉంటాయి. మర్చండైజింగ్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్ రిటైల్, సప్త్లె చైన్ మేనేజ్‌మెంట్ అంశాలపై అవగాహన కల్పిస్తారు. 

భారత సంస్థలు రిటైల్ మేనేజ్‌మెంట్‌లో అందిస్తున్న వివిధ కోర్సులు/ ప్రోగ్రాములు: 

బీఎస్సీ ఇన్ ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్ (బీఎస్సీ- ఎఫ్.ఎం.ఆర్.ఎం.)

ఎంఎస్సీ ఇన్ ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్ (ఎంఎస్సీ- ఎఫ్.ఎం.ఆర్.ఎం.)

ఎంబీఏ- రిటైల్ మేనేజ్‌మెంట్

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ రిటైల్ మేనేజ్‌మెంట్

పోస్ట్‌గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్ (పి.జి.సి.ఆర్.ఎం.)

పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్ (పి.జి.డి.ఎం.ఆర్.ఎం.)

పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్ (పి.జి.డి.ఆర్.ఎం.)

పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ ఫ్యాషన్ రిటైల్ మేనేజ్‌మెంట్ 

వ్యక్తిగత నైపుణ్యాలు అవసరం 

రిటైల్ వ్యాపారానికి ప్రతిభతో పాటు అంకితభావం, వివిధ నైపుణ్యాలు అవసరం. ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి అకడమిక్ సర్టిఫికెట్ల కంటే వ్యక్తిగత నైపుణ్యాలు ముఖ్యం. పాజిటివ్ దృక్పథం, విశ్లేషణా సామర్థ్యం కలిగి ఉండాలి. మంచి నాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు సమస్య సాధన నైపుణ్యం, ప్రజలను ఒప్పించడం, వివిధ రకాల వారితో కలిసేగుణం ఈ రంగంలో ఉన్నవారికి తప్పనిసరి. ఆత్మవిశ్వాసంతో పాటు రిటైల్ మార్కెటింగ్‌లో వస్తున్న ధోరణులను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకోవాలి. మర్చండైజింగ్, అడ్వర్టయిజింగ్ అంశాల్లో పరిజ్ఞానం ఉండాలి. ఉత్సాహం, నేర్చుకోవాలనే కోరిక, సృజనాత్మకత ఈ రంగంలో ఉన్నవారికి తప్పనిసరి. అన్నిటికంటే ముఖ్యంగా ఓపిక, సేల్స్‌వర్క్ పట్ల అభిరుచి ఉండాలి. ఆకర్షణీయ రూపం, బాగా సంభాషించే నైపుణ్యం ఉండాలి. 

రిటైల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్లు 

రిటైల్ మేనేజ్‌మెంట్‌లో చాలా ఆన్‌లైన్ కోర్సులు దేశ విదేశాల్లో ఉన్నాయి. ప్రస్తుతం చాలా బిజినెస్ స్కూళ్లు, ప్రభుత్వ సంస్థలు రిటైల్ మేనేజ్‌మెంట్ సబ్జెక్టును స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) సహకారంతో ఇగ్నో సర్టిఫికెట్, డిప్లొమా ప్రోగ్రాములను అందిస్తుంది. మనదేశంలోని రిటైలర్లకు ఆర్ఏఐ స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తోంది. చాలా సంస్థలు కోర్సుతో పాటు పారిశ్రామిక శిక్షణ ఇప్పిస్తున్నాయి. ఈ సమయంలో స్టయిపెండ్ కూడా చెల్లిస్తున్నారు. 

ఎఫ్‌డీడీఐ అందించే రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సులు 

రిటైలింగ్, ఫ్యాషన్ రంగంలో వివిధ స్థాయుల్లో నిపుణుల కొరతను తీర్చడానికి ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) కృషి చేస్తోంది. ఎఫ్‌డీడీఐ ఆధ్వర్యంలోని సీఆర్ఎం (సెంటర్ ఫర్ రిటైల్ మేనేజ్‌మెంట్) రిటైల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ, యూజీ కోర్సులను అందిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ అందించే కోర్సులకు మంచి గుర్తింపు ఉంది. భావి రిటైల్ మేనేజర్లగా తయారవ్వడానికి అవసరమయ్యే అన్ని నైపుణ్యాలు కోర్సులో భాగంగా అందిస్తారు. వాల్‌మార్ట్, టాటా, రిలయన్స్, పాంటలూన్స్, రహేజా... లాంటి బహుళజాతి కంపెనీలతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. మంచి ప్రతిభ కనబరచిన అభ్యర్థులు స్టాక్ కంట్రోల్, షాప్ ఫ్లోర్, సేల్స్, మర్చండైజింగ్, అడ్మినిస్ట్రేషన్, పర్చేజింగ్, బ్రాండ్‌మేనేజ్‌మెంట్ విభాగాల్లో ట్రెయినీ మేనేజర్‌గా చేరవచ్చు. 

వివిధ ఉద్యోగాలు

కస్టమర్ సేల్స్ అసోసియేట్: రిటైల్ వ్యాపారంలో దీన్ని ఎంట్రీ లెవెల్ ఉద్యోగంగా చెప్పుకోవచ్చు. వినియోగదారులను ఒప్పించి వస్తుసేవలు అందించడంలో వీరే కీలకం. మంచి సేల్స్ పర్సన్‌గా రాణించాలంటే షాపులోని ఉత్పత్తులపై అవగాహన ఉండాలి. వినియోగదారులను తమ మాటతీరుతో ఆకట్టుకోవాలి.
 

డిపార్ట్‌మెంట్ మేనేజర్/ ఫ్లోర్ మేనేజర్/ కేటగిరీ మేనేజర్: వీరు స్టోర్ బాగోగులు చూస్తారు.
 

స్టోర్ మేనేజర్: ఆయా సంస్థలను బట్టి వీరిని జనరల్ మేనేజర్/ స్టోర్ డైరెక్టర్‌గా పిలుస్తారు. ఒక స్టోర్‌కు పూర్తి బాధ్యత వహించడంతో పాటు రోజువారీ కార్యకలాపాలను నియంత్రిస్తారు. స్టోర్‌లోని ఉద్యోగులందరి బాగోగులు చూస్తూ వ్యక్తిగతంగా ఏరియా మేనేజర్ లేదా స్టోర్ యజమానికి బాధ్యత వహిస్తారు.
 

రిటైల్ ఆపరేషన్ మేనేజర్: స్టోర్ కార్యకలాపాలకు ప్రణాళికలువేయడం, వాటిని సమన్వయం చేయడం వీరి ప్రధాన విధి. మర్చండైజ్ లేఅవుట్, రిటైల్ ఆర్డర్స్, సరకు నిల్వను పరిశీలించడం, సరఫరాను విశ్లేషించడం వంటి బాధ్యతలు వీరు చూస్తారు. మాస్టర్ డిగ్రీ ఉన్నవారు నేరుగా రిటైల్ మేనేజర్లగా చేరవచ్చు.
 

రిటైల్ కొనుగోలుదారులు, మర్చండైజర్లు: వినియోగదారుడి అభిరుచులు కనిపెడుతూ వారి అవసరాలకు తగ్గ వస్తువులను రిటైల్ షాప్‌కు కొనుగోలు చేయడం వీరి ప్రధాన విధి. మారుతున్న మార్కెట్ ధోరణులు పరిశీలిస్తూ ఉండాలి. ఉత్సాహం, పనిచేయాలన్న తపన ఉండాలి.
 

విజువల్ మర్చండైజర్లు: వస్తువులకు బ్రాండ్ విలువ తీసుకొచ్చి వినియోగదారులను ఆకర్షించేలా చేయడం వీరి ప్రధాన విధి. సంస్థ ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేయడంలో వీరు కీలక పాత్ర వహిస్తారు. బ్రాండ్ తీసుకొచ్చే క్రమంలో టెక్నికల్ డిజైనర్, ప్రొడక్ట్ డెవలపర్, స్టోర్ ప్లానర్ గానూ వ్యవహరించాల్సి ఉంటుంది.

మరిన్ని ఉద్యోగ అవకాశాలు:

మేనేజర్, బ్యాక్ఎండ్ ఆపరేషన్లు

లాజిస్టిక్స్, వేర్‌హౌస్ మేనేజర్లు (వ్యూహరచన, గిడ్డంగి మేనేజర్లు):

రిటైల్ కమ్యూనికేషన్ మేనేజర్

మేనేజర్, ప్రైవేట్ లేబుల్ బ్రాండ్స్

టైల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్

ప్రతిభతో పాటు శిక్షణ పొందిన మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. విదేశాల్లో పనిచేసే అవకాశం పొందవచ్చు. పేరుపొందిన ప్రముఖ సంస్థలు నగరాలు, చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో తమ శాఖలను విస్తరిస్తున్నాయి. దీంతో చాలా ఉపాధి అవకాశాలు మన ముందు ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, వినియోగదారులను ఒప్పించే గుణం ఉన్నవాళ్లకి రిటైల్ కంపెనీలు పట్టం కడుతున్నాయి. బహుళజాతి కంపెనీలు వీరికి స్టోర్ మేనేజర్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్, మర్చండైజ్ ఆఫీసర్స్, పబ్లిక్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్స్... వంటి అవకాశాలు కల్పిస్తున్నాయి.

వేతనాలు 

పనిచేసే చోటు, కంపెనీ, పని స్వభావాలను బట్టి రిటైల్ రంగంలో వేతనాలు ఆధారపడి ఉంటాయి. సేల్స్‌పర్సన్ ప్రారంభ వేతనం ఇంచుమించు రూ.5,500 ఉంటుంది. పోస్టులను బట్టి రూ.6,000 నుంచి రూ.22,000 దాకా ఉంటాయి. ప్రత్యేక ప్యాకేజీలు, బోనస్, ప్రోత్సాహకాలు పొందవచ్చు. విదేశాల్లో పనిచేసే వారికి సంస్థ అమ్మే ఉత్పత్తులు, వాళ్లు పనిచేసే షాపులు, ప్రాంతాలను బట్టి వేతనం ఆధారపడి ఉంటుంది. 

కోర్సులను అందిస్తున్న సంస్థలు /యూనివర్శిటీలు

ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్,నోయిడా, ఉత్తరప్రదేశ్ 

కోర్సులు: ఎ) ఎంఎస్సీ ఇన్ ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్

               బి) ఎంఎస్సీ ఇన్ విజువల్ మర్చండైజింగ్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్

అర్హత: ఏదైనా డిగ్రీ

కాల వ్యవధి: రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు)

               సి) బీఎస్సీ ఇన్ ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్

అర్హత: ఇంటర్ లేదా తత్సమానం

చిరునామా: ఎఫ్‌డీడీఐ హెడ్‌క్వార్టర్స్

                  ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్

                  ఎ - 10 / ఎ, సెక్టార్ - 24, నోయిడా-201301,

                  గౌతమబుద్ధనగర్,

                  ఉత్తరప్రదేశ్, ఇండియా

                  ఫోన్: 120 - 4500100 

రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ), ముంబయి. 

కోర్సు: బీబీఏ ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్

అర్హత: ఇంటర్ లేదా తత్సమానం

చిరునామా: రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ)

          111 / 112, ఆస్కాట్ సెంటర్,

         హోటల్ ఐటీసీ మరాఠా దగ్గర, సాహర్ రోడ్, సాహర్.

         అంధేరి (తూ), ముంబయి - 400099.

ఫోన్:  +91 22 28269527.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్,నవీ ముంబయి. 

కోర్సు: డిప్లొమా ఇన్ రిటైల్ సప్త్లె చైన్ మేనేజ్‌మెంట్

అర్హత: గ్రాడ్యుయేషన్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

చిరునామా: నేషనల్ హెడ్ క్వార్టర్స్,

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్,

ప్లాట్ నెంబర్లు 102, 104 ; సెక్టార్ - 15, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా,

సీబీడీ బేలాపూర్, నవీ ముంబయి - 4600614.

ఫోన్: (022) 27565741.

వాగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (యూనివర్శిటీ ఆఫ్ బెంగళూరు అనుబంధ సంస్థ) 

కోర్సు: గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్

కోర్సు కాలవ్యవధి: సంవత్సరం

అర్హత:  ఇంటర్ / 10 + 2

ఫోన్: 91-80-25304332 (కౌన్సెలర్)

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిటైల్ మేనేజ్‌మెంట్,బెంగళూరు 

కోర్సులు: ఎ) మాస్టర్స్ ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్

  బి) మాస్టర్స్ ఇన్ రిటైల్ సప్త్లె చైన్ మేనేజ్‌మెంట్

అర్హత: ఏదైనా డిగ్రీ

చిరునామా: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిటైల్ మేనేజ్‌మెంట్,

   సెకండ్ ఫ్లోర్, హౌస్ నెం. 1678, ఎ, 60 ఫీట్ నెహ్రూ రోడ్,

   కమనహల్లి పోలీస్ స్టేషన్ దగ్గర, కమనహల్లి,

   బెంగళూరు - 560084.

ఫోన్ : 080-40442550

దూరవిద్యలో రిటైల్ మేనేజ్‌మెంట్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ

కోర్సు: డిప్లొమా ఇన్ రిటైలింగ్

అర్హత: ఇంటర్ లేదా తత్సమానం

ఎంపిక పద్ధతి: ఇంటర్వ్యూ ద్వారా 

చిరునామా: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ,

   మైదాన్ గరి, న్యూఢిల్లీ- 110068, ఇండియా.

ఫోన్ : 29535714, 29533129 (ఫ్యాక్స్).  

సింబయాసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్, పుణె

కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్

అర్హత:  గ్రాడ్యుయేషన్     

చిరునామా: సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్,

 సింబయాసిస్ నాలెడ్జ్ విలేజ్

 లావలె గ్రామం,

 ముల్షీ (తాలూకా)

 పుణే జిల్లా - 412115.

 ఫోన్: 020 - 39116000 

Posted Date: 11-01-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌