• facebook
  • whatsapp
  • telegram

మేటి సంస్థల్లో థెరపీ కోర్సులు

ఇంటర్‌ విద్యార్హతతో దరఖాస్తులు


చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయసులవారూ ఏదో ఒక వైకల్యం, నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఫిజియో థెరపీతో కొంత వరకు ఉపశమనం లభిస్తోంది. అందువల్ల ఈ థెరపీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు సులువుగానే ఉపాధి పొందుతున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జాతీయ స్థాయిలో మేటి సంస్థలు అందించే బీపీటీ, బీపీవో, బీవోటీ, బీఏఎస్‌ఎల్‌పీ కోర్సులను పూర్తిచేసు కోవచ్చు. ఈ సంస్థలన్నీ ఉమ్మడి పరీక్షతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇటీవలే వెలువడిన ఈ ప్రకటనకు ఇంటర్‌ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులందించే సంస్థలు కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్‌ సోషనల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అందువల్ల మేటి బోధనతోపాటు మెరుగైన వసతులు ఆశించవచ్చు. కోర్సు చివరిలో ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాన్నీ పొందవచ్చు. 


ఇవీ సంస్థలు..

స్వామీ వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌), కటక్‌ 

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటివ్‌ డిజేబిలిటీస్‌ (ఎన్‌ఐఎల్‌డీ), కోల్‌కతా 

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజేబిలిటీస్‌ (ఎన్‌ఐఈపీఎండీ), చెన్నై 

పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఫిజికల్‌ డిజేబిలిటీస్, న్యూదిల్లీ 

అలీ యవర్‌ జంగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ డిజేబిలిటీస్, ముంబై 

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ విజువల్‌ డిజేబిలిటీస్, దేహ్రాదూన్‌ 

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజేబిలిటీస్, సికింద్రాబాద్‌ 

ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్, న్యూదిల్లీ 

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ రిహాబిలిటేషన్, సెహోర్‌


కోర్సులివీ...

1. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ)

2. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ (బీవోటీ)

3. బ్యాచిలర్‌ ఇన్‌ ప్రోస్థటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ (బీపీవో)    

4. బ్యాచిలర్‌ ఇన్‌ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ (బీఏఎస్‌ఎల్‌పీ)


బీఏఎస్‌ఎల్‌పీ కోర్సు ఇంటర్న్‌షిప్‌తో కలిపి నాలుగేళ్లు. మిగతా కోర్సుల వ్యవధీ నాలుగేళ్లే. అదనంగా మరో ఆరు నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్‌ చెల్లిస్తారు. పరీక్షను ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్, కటక్‌ నిర్వహిస్తుంది. 


పరీక్ష ఎలా?

పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒకటి చొప్పున వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రంలో 4 విభాగాలు ఉంటాయి. పార్ట్‌ ఏలో జనరల్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగం నుంచి పది ప్రశ్నలు అడుగుతారు. పార్ట్‌-బీ ఫిజిక్స్‌ 30, పార్ట్‌-సీ కెమిస్ట్రీ 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-డీలో బయాలజీ/మ్యాథ్స్‌ 30 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అన్ని సబ్జెక్టు ప్రశ్నలూ ఇంటర్మీడియట్‌ సిలబస్‌ నుంచే వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు.  

అర్హతలు: అన్ని కోర్సులకూ బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు. కొన్ని సంస్థలు ఎంపీసీ విద్యార్థులకూ అవకాశం కల్పిస్తున్నాయి. బీఏఎస్‌ఎల్‌పీ కోర్సుకు బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కోర్సు, ఏ సంస్థకైనా జనరల్, ఓబీసీ విభాగాలవారు 50 శాతం మార్కులు సాధించాలి. వయసు: డిసెంబరు 31, 2024 నాటికి 17 ఏళ్లు నిండాలి. గరిష్ఠ వయసు నిబంధన లేదు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 20 వరకు, దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.800. మిగిలిన అందరికీ రూ.1000.  పరీక్ష తేదీ: జూన్‌ 23 

పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విజయవాడ 

వెబ్‌సైట్‌: https://admission.svnirtar.nic.inndex/institute_index/ins/NIRTAR#


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్‌గా..!

‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!

‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

Posted Date: 24-04-2024


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌