• facebook
  • whatsapp
  • telegram

మేటి భవితకు మల్టీ డిసిప్లినరీ కోర్సు

‣ ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్లానింగ్‌ ఇంజినీరింగ్‌ 

 

 

ఇంటర్మీడియట్‌ తర్వాత ఉపాధి అవకాశాలుండే కోర్సుల గురించి అన్వేషిస్తున్నారా? అయితే మల్టీ డిసిప్లినరీ కోర్సుల్లో ఒకటైన బీటెక్‌ ఇన్‌ ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్లానింగ్‌ గురించి తెలుసుకోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ యూనివర్సిటీ, కడపలోని డా.వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయంలో ఈ కోర్సును అందిస్తున్నాయి! ఎంసెట్‌ ఉత్తీర్ణత ఆధారంగా దీనిలో ప్రవేశాలుంటాయి.

 

ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాలతో కలిసివున్న మల్టీ డిసిప్లినరీ కోర్సు...ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్లానింగ్‌. రానున్న పోటీ ప్రపంచంలో  స్థిరపడాలంటే ఒకటి మించిన అంశాలున్న కోర్సులకు విలువ ఎక్కువ. అలాంటి కోర్సుల్లో ఇదొకటి. ఈ కోర్సులో భవన నిర్మాణం, అందులోని సౌకర్యాల కల్పన, సౌకర్యాల నిర్వహణ ప్రధానాంశాలు. ఈ కోర్సులోని కొన్ని ముఖ్యమైన విషయాలు: రెన్యూవబుల్‌ ఎనర్జీ, ఎనర్జీ ఆడిట్, ల్యాండ్‌ స్కేప్‌ డిజైన్,  ఫైర్‌ ఫైటింగ్, సేఫ్టీ అండ్‌ సర్వీసెస్, క్లీన్‌ ఎన్విరాన్‌మెంట్, వాటర్‌ సప్లై అండ్‌ సివేజ్, హెచ్‌వీఏసీ, ఆటోమేషన్, సస్టెయినబిలిటీ. ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్లానింగ్‌ కోర్సు ద్వారా మెకానికల్, విద్యుత్తు, నీటి సరఫరా సేవలే కాకుండా... బిల్డింగ్‌ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో కూడిన భద్రత, నిఘా వ్యవస్థలు, గ్రీన్, సస్టెయినబుల్‌ భవన రూపకల్పన సేవలు లభిస్తాయి.

 

ఉద్యోగావకాశాలు

ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్లానింగ్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు వేతనం సాధారణంగా ఏడాదికి సుమారు రూ.5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అనుభవాన్ని బట్టి జీతాలు పొందవచ్చు. బిల్డింగ్‌   సర్వీసెస్‌ ఇంజినీర్లకు చాలా డిమాండ్‌ ఉంది. ఈ కోర్సు చదివిన వారికి దేశ, విదేశాల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు డిజైన్‌ ఇంజినీరింగ్, ప్లానర్‌లుగా కెరియర్‌ను ప్రారంభించవచ్చు. 

 

అర్హత, అడ్మిషన్‌ ప్రక్రియ: ఇంటర్మీడియట్‌ ఎంపీసీ లేదా డిప్లొమా 10+3లో ఉత్తీర్ణత సాధించాలి. ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించి, తర్వాత జరిగే కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఆప్షన్‌  ఇవ్వాలి. కోర్సు కాలవ్యవధి - 4 సంవత్సరాలు. కడపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయంలో రెండు కళాశాలలున్నాయి. స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లోనూ, హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంకులోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో ఈ కోర్సును అందిస్తున్నారు.  

 

ఉన్నత విద్యావకాశాలు

ఈ కోర్సు తర్వాత వివిధ అంశాల్లో కింది మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌ కోర్సులు చేయవచ్చు.  

‣ ఎన్విరాన్‌మెంటల్‌ డిజైన్‌ అండ్‌ ఇంజినీరింగ్, 

‣ హెచ్‌వీఏసీ 

‣ ఎనర్జీ సిస్టమ్స్‌ 

‣ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ 

‣ ఎలక్ట్రిక్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ 

‣ రెన్యూవబుల్‌ ఎనర్జీ 

‣  పవర్‌ అండ్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ 

‣ ఎనర్జీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ 

‣  స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ 

‣ అర్బన్‌ ప్లానింగ్‌ 

 

 

ఏం నేర్పుతారంటే...

బిల్డింగ్‌ డిజైన్‌ ఆధునికమైన సాఫ్ట్‌వేర్‌లు (ఆటోక్యాడ్, రెవిట్‌ నేవిస్‌ వర్క్స్, ఈక్వెస్ట్‌ బిమ్‌) లాంటి అంశాలు ఈ కోర్సు ప్రత్యేకత. నిర్మాణ రంగంలో సాంకేతికత, పర్యావరణానుకూల నిర్మాణం, ఎనర్జీ ఆడిట్‌ లాంటి అంశాలు నేర్చుకుని విద్యార్థులు జీవితంలో స్థిరపడొచ్చు.

- దేశాయ్‌ సత్యనారాయణరావు,

ఫ్యాకల్టీ, బీటీఎస్‌ డిపార్ట్‌మెంట్‌

 

డిమాండ్‌ ఎక్కువ

సుస్థిర, పర్యావరణ అనుకూల భవనాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ, ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ లాంటి అంశాలు ఈ కోర్సులో ఉన్నాయి. నిర్మాణ రంగం రోజురోజుకూ అభివృద్ధి చెందే రంగం. ఈ రంగంలో సేవలు అందించడానికి ఫెసిలిటీస్‌ ప్లానర్‌లు మనదేశంలో ఉన్నది చాలా తక్కువమంది. వీరికి మంచి డిమాండ్‌ ఉంది. ఈ కోర్సు పూర్తికాగానే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మంచి అవకాశాలున్నాయి.

- షైక్‌ ముహమ్మద్‌ అన్సారీ, ఫ్యాకల్టీ, బీటీఎస్‌ డిపార్ట్‌మెంట్‌

Posted Date: 20-09-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌