• facebook
  • whatsapp
  • telegram

లాభదాయక కెరియర్‌.. బిజినెస్‌ ఇంజెలిజెన్స్‌

సంస్థ భవిష్యత్తు నిర్ణయాల్లో కీలకం

లక్షల కోట్ల టర్నోవర్లు కలిగిన బహుళజాతి కంపెనీల దగ్గర్నుంచి.. అప్పుడప్పుడే ఉనికి చాటుకునే స్టార్టప్‌ సంస్థల వరకూ.. అందరికీ తమ వ్యాపారం అభివృద్ధిలోకి రావడమే కావాలి. ఇందుకోసం ఎన్నో విధాలైన పద్ధతులు, విధానాలు, విశ్లేషణలు అవసరమవుతుంటాయి. అలా సంస్థల భవిష్యత్తును నిర్ణయించే కీలక నిర్ణయాల్లో బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌/ అనలిటిక్స్‌ది చాలా ముఖ్యమైన పాత్ర.. అందుకే ఇప్పుడు ఇదొక లాభదాయకమైన కెరియర్‌గా రూపుదిద్దుకుంటోంది. మరి ఇందులో విద్యార్థులకు ఎటువంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, ఏ విధమైన ఉద్యోగాలు దొరుకుతున్నాయి, మొదలైన వివరాల్లోకి వెళితే..

వ్యాపారం ఉందీ అంటే దాన్ని నడిపించే సమర్థ వ్యవస్థ, మెరికల్లాంటి నిపుణులు కూడా ఉండాలి. అందుకే బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌/ అనలిటిక్స్‌కు గత కొన్నేళ్లుగా ఆదరణ పెరుగుతోంది. గతంలో కంపెనీల్లో  ఏళ్లతరబడి అనుభవం ఉన్న సీనియర్లు మాత్రమే ఈ విధమైన విధులు నిర్వర్తించేవారు. కానీ ఇప్పుడు దీనికి తగిన కోర్సులు, అధ్యయనం చేసే అవకాశాలు అందుబాటులోకి రావడం వల్ల తాజాగా చదువులు పూర్తిచేసిన వారు కూడా కొలువుల్లోకి వెళ్తున్నారు.

‣ డేటా అనలిటిక్స్, మైనింగ్, విజువలైజేషన్, టూల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌.. వంటి వివిధ అంశాలన్నీ కలగలిసిందే బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌. సమాచారాన్ని సద్వినియోగం చేసుకుంటూ, టెక్నాలజీ - మానవ వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు చేకూరేలా చేయడమే దీని అంతిమ ధ్యేయం.

బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ఉద్యోగాలు సాధారణంగా మూడు విధాలుగా ఉంటుంటాయి.. అవి అనలిటిక్స్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్‌. ఇవన్నీ ప్రధానంగా సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పనిచేసేవే. ఈ కొలువుల్లో ఉన్నవారు సృష్టించే ఇన్‌సైట్స్‌కు చాలా విలువ ఉంటుంది. ఇవి కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి, లాభాలు పెంచుకోవడానికి, పోటీని తట్టుకునేందుకు.. ఇలా చాలా విధాలుగా ఉపయోగపడతాయి. అసలు ఒక సంస్థ విజయవంతమవుతుందా లేదా అనేది ఈ విభాగపు నిపుణుల మీద ఆధారపడి ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

కోర్సులు

ఆఫ్‌లైన్‌లో ఐఐటీ రూర్కీ, ఐఐఎం రోహ్‌తక్, ఐఐఎం ట్రిచీ, ఐఎస్‌బీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) వంటి చాలా ప్రముఖ సంస్థలు ఇందులో వివిధ కోర్సులు అందిస్తున్నాయి. 

ఆన్‌లైన్‌లో మైక్రోసాఫ్ట్, కోర్సెరా, యుడెమీ, ఎడ్‌ఎక్స్, డేటాక్యాంప్, లింక్డిన్‌ లెర్నింగ్, ఎడ్యురేకా, క్యూబికల్‌ వంటి సంస్థలు అందిస్తున్న బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులకు మంచి డిమాండ్‌ ఉంది. వీటి ద్వారా మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. 

ఇందులో చేరినవారు అసెట్‌ మేనేజ్‌మెంట్, డేటా అనలిస్ట్, క్వాంటిటేటివ్‌ అనలిస్ట్, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ అనలిస్ట్, కస్టమర్‌ ఇన్‌సైట్‌ అనలిస్ట్, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ఇంజినీర్, డెవలపర్, ఆర్కిటెక్ట్, మేనేజర్‌ వంటి ఉద్యోగాలతోపాటు ఇతర ఫైనాన్స్‌ కెరియర్లలోకి  ప్రవేశించగలరు.

అర్హతలు

స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్‌ సైన్స్, ఇంజినీరింగ్, ఎకనమిక్స్, బిజినెస్‌ సంబంధిత చదువులు పూర్తిచేసిన వారికి ఇది అనుకూలమైన రంగం. ఎస్‌క్యూఎల్, టాబ్లూ, క్విక్‌సైట్, పైతాన్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌ ఉపయోగించడంలో ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్స్‌ ఉండటం ఉపకరిస్తుంది. చాలా కంపెనీలు స్టాటిస్టిక్స్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎంబీఏ చేసినవారికి కూడా అవకాశాలున్నాయి.  
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

‣ అవకాశం సులువు.. అధిక మార్కెట్‌ విలువ!

‣ నామ‌మాత్ర ఫీజుతో నాణ్య‌మైన విద్య‌

‣ న్యాయ విద్య క‌ల నెర‌వేరేలా!

‣ ఇగ్నోలో ఉద్యోగాలు

‣ ఈపీఎఫ్‌ఓలో స్టెనో కొలువులు

Posted Date: 11-04-2023


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌