• facebook
  • whatsapp
  • telegram

చక్కెర కోర్సులు చక్కని కొలువులు

వసంత్‌దాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశాలకు ప్రకటన

చెరకు నుంచి పంచదార వస్తుందని అందరికీ తెలుసు. అయితే ఆ ఉత్పత్తి వెనుక సాంకేతికత, నిపుణుల శ్రమ దాగి ఉన్నాయి. అలాగే చెరకు నుంచి ఇతర ఉత్పత్తులూ రూపొందుతున్నాయి. ఈ విభాగంపై ఆసక్తి ఉన్నవాళ్లు రాణించడానికి కొన్ని కోర్సులు  రూపొందించారు. వాటిని పూర్తిచేసుకున్నవారు పంచదార, ఆల్కహాల్‌ తయారీ సంస్థల్లో అవకాశాలు అందుకోవచ్చు. దేశంలో అతి కొద్ది విద్యాసంస్థలు మాత్రమే ఈ తరహా చదువులు అందిస్తున్నాయి. అలాంటి వాటిలో పుణెలోని వసంత్‌దాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒకటి. ఈ సంస్థ సర్టిఫికెట్, పీజీ డిప్లొమా, పీజీ కోర్సులు నడుపుతోంది. వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. 

పంచదార, అనుబంధ పరిశ్రమలకు నైపుణ్యమున్న మానవ వనరులను అందించడానికి వసంత్‌ దాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ 1975లో పుణె దగ్గరలో నెలకొల్పారు. సావిత్రీభాయ్‌ ఫూలే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇక్కడ పలు జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు అందిస్తున్నారు. వీటిని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. దేశంలో పేరొందిన పంచదార పరిశ్రమలు, స్పిరిట్, డిస్టిలరీ, బ్రూవరీలు, బేవరేజ్‌లు, ఇతర సంస్థలు వీరిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. కోర్సులో ప్రవేశానికి వంద మార్కులకు ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఆయా కోర్సును అనుసరించి జనరల్‌ కెమిస్ట్రీ, బయాలజీ, జనరల్‌ ఇంగ్లిష్, మ్యాథ్స్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో ప్రతిభ చూపినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

సర్టిఫికెట్‌

షుగర్‌ బాయిలింగ్‌: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు పంచదార పరిశ్రమలో రెండేళ్ల పని అనుభవం లేదా ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. కోర్సు వ్యవధి 6 నెలలు. సీట్ల సంఖ్య 60.

జ్యూస్‌ సూపర్‌విజన్‌: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు పంచదార పరిశ్రమలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. కోర్సు వ్యవధి 6 నెలలు. సీట్ల సంఖ్య 30.

ఈటీపీ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనన్స్‌: ఇంటర్‌తోపాటు పంచదార పరిశ్రమలో రెండేళ్ల పని అనుభవం అవసరం. కోర్సు వ్యవధి 6 నెలలు. సీట్ల సంఖ్య 30.

ఇవీ కోర్సులు

ఎమ్మెస్సీలో

ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌: మ్యాథ్స్, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ కాకుండా ఏదైనా సబ్జెక్టుతో బీఎస్సీ లేదా బీటెక్‌ సివిల్‌/ కెమికల్‌ లేదా బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివినవారు అర్హులు. కోర్సు వ్యవధి రెండేళ్లు. 24 సీట్లు ఉన్నాయి. 

వైన్, బ్రూవింగ్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ: బీఎస్సీ వైన్‌ టెక్నాలజీ/ బయో టెక్నాలజీ/ మైక్రోబయాలజీ/ కెమిస్ట్రీ/ అగ్రికల్చర్‌/ బోటనీ/ జువాలజీ/ పీజీడీఐఎఫ్‌ఏటీ లేదా బీటెక్‌ కెమికల్‌/ బయో టెక్నాలజీ/ ఫుడ్‌/ అగ్రి బయోటెక్‌ వీటిలో ఏదైనా కోర్సు పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి రెండేళ్లు. 24 సీట్లు ఉన్నాయి.

పీజీ డిప్లొమాలో 

షుగర్‌ టెక్నాలజీ: బీఎస్సీ షుగర్‌ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎంపీసీ లేదా బీటెక్‌ కెమికల్‌/ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు అర్హులు. కోర్సు వ్యవధి రెండున్నరేళ్లు. 50 సీట్లు ఉన్నాయి.

షుగర్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ: ఈ కోర్సు వ్యవధి 18 నెలలు. 15 సీట్లు ఉన్నాయి. బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎల్రక్టానిక్స్‌ కోర్సులు చదివినవారు అర్హులు. బీటెక్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎల్రక్టికల్‌/ ఎల్రక్టానిక్స్‌/ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

షుగర్‌ ఇంజినీరింగ్‌: బీటెక్‌ మెకానికల్‌/ ఎల్రక్టికల్‌/ కెమికల్‌ చదివినవారు అర్హులు. కోర్సు వ్యవధి 18 నెలలు. 15 సీట్లు ఉన్నాయి. 

ఇండస్ట్రియల్‌ ఫర్మెంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ: బీఎస్సీలో కెమిస్ట్రీ/ వైన్‌ టెక్నాలజీ/ బయోటెక్నాలజీ/ మైక్రో బయాలజీ/ ఆల్కహాల్‌ టెక్నాలజీ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి లేదా బీటెక్‌ బయోటెక్నాలజీ/ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివుండాలి. కోర్సు వ్యవధి 22 నెలలు. సీట్లు 120.

పీజీ సర్టిఫికెట్‌

షుగర్‌ ఇంజినీరింగ్‌: మెకానికల్‌/ ఎల్రక్టికల్‌/ కెమికల్‌ డిప్లొమా చదివినవారు అర్హులు. పంచదార మిల్లులో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి. ఈ కోర్సు 12 నెలల వ్యవధితో అందిస్తున్నారు. 15 సీట్లు ఉన్నాయి.

షుగర్‌ మాన్యుఫ్యాక్చర్‌: బీఎస్సీ కెమిస్ట్రీ లేదా షుగర్‌ టెక్నాలజీ కోర్సు చదివినవారు అర్హులు. లేదా షుగర్‌ టెక్నాలజీ/ షుగర్‌ మాన్యుఫ్యాక్చర్‌/ కెమికల్‌ ఇంజినీరింగ్‌ వీటిలో ఏదైనా డిప్లొమా చదివినవారై ఉండాలి. అలాగే రెండేళ్ల పని అనుభవం అవసరం. కోర్సు వ్యవధి ఏడాది. మొత్తం సీట్లు 35.

దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 30

వెబ్‌సైట్‌: https://www.vsisugar.com/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!

‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?

‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?

‣ పీజీలో ప్రవేశాలకు సీపీగెట్‌-2022

‣ ఆలోచనల పరిధి పెంచే ఐఐటీ కోర్సు!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ దివ్యమైన కోర్సులు

Posted Date: 15-06-2022


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌