• facebook
  • whatsapp
  • telegram

అక్కడ రాకపోయినా ఇక్కడ సీటు సిద్ధం!

జేఈఈ మెయిన్‌ ఫలితాలు వెలువడ్డాయి. దాదాపుగా రెండు లక్షల ముప్ఫైవేల మంది అర్హత పొందారు. వీరిలో అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమయ్యేవారు కొందరైతే.. మెయిన్‌ ర్యాంకుతో వివిధ కళాశాలల్లో చేరడానికి ప్రణాళికలు వేసుకుంటున్నవారు మరికొందరు. బీఆర్క్‌ కలగా ఉన్నవారి దారీ సరే! మరి అర్హత పొంది.. పేరుకు ర్యాంకు ఉన్నప్పటికీ ఎన్‌ఐటీల్లో సీటు దక్కించుకోలేనివారు ఏం చేయాలి? వారికి ఎక్కడ సీటు అవకాశాలుంటాయి?
జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు ఈ నెలాఖరోవచ్చే అవకాశముంది. దీని ద్వారా బీఆర్క్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది. ఈ ఏడాది 11,35,004 మంది జేఈఈ మెయిన్‌ పరీక్ష రాస్తే వీరిలో 2,31,024 మంది విద్యార్థులు (అన్ని కేటగిరీలు కలిపి) జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు క్వాలిఫై అయ్యారు. వీరిలోనే ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఎన్‌ఐటీల్లో చేరే అవకాశముంది. వీరిలో 10,000 మంది ఐఐటీలకు వెళితే మిగిలినవారిలో దాదాపు 20,000 వరకూ ఎన్‌ఐటీల్లో చేరతారు.
ఇక్కడ క్వాలిఫై అవడం అంటే ఆ విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి అర్హత సాధించడం. జేఈఈ మెయిన్‌లో ర్యాంకు పొందినవారు వివిధ ఇతర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి అవకాశముంది.

పొరుగు రాష్ట్రాల్లో...
తెలుగు విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఇంజినీరింగ్‌ చేయడానికి ఎక్కువగా వెళుతున్నారు. కాబట్టి అక్కడ జేఈఈ మెయిన్‌ ర్యాంకుకి ప్రాధాన్యమిచ్చే కళాశాలలను తెలుసుకోవడం అవసరం.
‣ తమిళనాడు నుంచి శస్త్ర, పీఎస్‌జీ కోయంబత్తూరు, ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌- కాలేవాక్కం, సత్యభామ, శివనాడార్‌ యూనివర్సిటీ ఉన్నాయి. వీటిల్లో కొన్ని సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకు ఆధారంగా నింపుతున్నారు. కాబట్టి ఈ కళాశాలలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
‣ కర్ణాటకలో బెంగళూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- బెంగళూరు, కేఎల్‌ఈ బెల్గాం, కేఎల్‌ఈ హుబ్లి, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ- బెంగళూరు, బళ్లారి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- బళ్లారి, బసవేశ్వర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌-బాగల్‌ కోట, బీఎల్‌డీఈఏస్‌- బీజాపుర్‌, రాజరాజేశ్వరి ఇంజినీరింగ్‌ కాలేజ్‌- బెంగళూరు. వీటన్నింటినీ విద్యార్థి పరిగణనలోకి తీసుకోవచ్చు.
‣ మహారాష్ట్రలోనూ డా.డీవై పాటిల్‌- పుణె, భారతీ విద్యాపీఠ్‌ లాంటి ప్రముఖ కళాశాలల్లోనూ జేఈఈ మెయిన్‌ ర్యాంకుకు ప్రాధాన్యమిస్తున్నారు.
‣ ఒడిషాలోని భువనేశ్వర్‌లో ఉన్న ప్రముఖ కళాశాలలకూ ప్రాధాన్యమివ్వవచ్చు. దీనిలో విద్యార్థి చూసుకోవాల్సింది ఎన్‌ఏఏసీ ఏ ప్లస్‌ అక్రిడిటేషన్‌, ఫీజు వివరాలు. వాటి మీద అవగాహన ఏర్పరచుకుని విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో....
‣ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బి కేటగిరీ సీట్లు సాధించడానికి జేఈఈ మెయిన్‌ ర్యాంకు చాలా ఉపయోగపడుతుంది. వాటిలో సీట్ల కేటాయింపునకు ప్రాతిపదిక మొదట జేఈఈ మెయిన్‌ ర్యాంకు. తర్వాతే ఎంసెట్‌ ర్యాంకును చూస్తారు.
‣ ఉదాహరణకు- ఒక విద్యార్థికి 4,00,000 జేఈఈ మెయిన్‌ ర్యాంకు వచ్చిందనుకుందాం. వేరొక విద్యార్థికి ఎంసెట్‌లో 40,000 ర్యాంకు. ఈ ఇద్దరూ ఒక ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో కేటగిరీ-బి సీట్లకు పోటీ పడ్డారు. జేఈఈ మెయిన్‌ ర్యాంకు 10 రెట్లు ఎక్కువ అయినప్పటికీ సీటును ఎంసెట్‌ ర్యాంకరుకు కాకుండా జేఈఈ మెయిన్‌ ర్యాంకున్న విద్యార్థికే కేటాయిస్తారు. ఇదీ ఆ ర్యాంకు ప్రాధాన్యం! ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బి కేటగిరీ సీట్లకు ఫీజు నిర్ధారణ అయింది. ఇష్టమున్న ప్రైవేటు కళాశాలల్లో కోరిన బ్రాంచిలో చేరడానికి జేఈఈ మెయిన్‌ ర్యాంకు అదెంత ఎక్కువ అయినప్పటికీ ఎంతో ఉపయోగపడుతుంది.
‣ స్వయం ప్రతిపత్తిగల విశ్వవిద్యాలయాలు.. గీతం, కేఎల్‌ఈ, విజ్ఞాన్‌ల్లో జేఈఈ మెయిన్‌ ర్యాంకు ఆధారంగా కూడా సీటు కేటాయిస్తారు. కోరిన బ్రాంచి కావాలనుకుంటే జేఈఈ మెయిన్‌ ర్యాంకు బాగా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా అన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనూ జేఈఈ మెయిన్‌ ర్యాంకు వల్ల సీటు పొందే అవకాశముంది.
‣ ఈ సంస్థల్లో సీటు సాధించాలంటే అఖిల భారత స్థాయిలో 10,000 ర్యాంకు సాధిస్తే సరిపోతుంది. అంటే జేఈఈ మెయిన్‌లో 360 మార్కులకు 170 కుపైగా మార్కులు సాధించినవారికి ఇక్కడ సీటు లభించే అవకాశముంది.
‣ మిగిలినవారిలో తొలి ఎంపిక ఐఐఐటీ- హైదరాబాద్‌ అవుతోంది. దీనిలో సీట్లు సుమారు 260. ఈ సీట్లలో 210 జేఈఈ మెయిన్‌ ద్వారా, 35 సీట్లను డీఏఎస్‌ఏ (డైరెక్ట్‌ అడ్మిషన్స్‌ ఫర్‌ స్టూడెంట్స్‌ అబ్రాడ్‌) ద్వారా, ఎన్‌టీఎస్‌ఈ, కేవీపీవై సాధించిన విద్యార్థులకు, ఒలింపియాడ్‌ (ఐఓఐ, మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, ఐఓఎల్‌, పీఎల్‌ఓ) సాధించినవారికి మిగతా సీట్లు కేటాయిస్తున్నారు. డీఏఎస్‌ఏ ద్వారా తీసుకునే విద్యార్థులకు వారి శాట్‌-1, శాట్‌-2 స్కోర్ల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తున్నారు. అయితే వారు శాట్‌లో మేథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలు తప్పనిసరిగా రాయాలి. 2400 మార్కులకుగానూ 1440కుపైగా వచ్చిన విద్యార్థులు దాదాపుగా సీటు సాధిస్తున్నారు. అలా ఎస్‌సీఏ (స్పెషల్‌ ఛానెల్‌ ఆఫ్‌ అడ్మిషన్‌) ద్వారా బీటెక్‌లో 20 సీట్లు ఐఐఐటీ- హైదరాబాద్‌లో తీసుకుంటున్నారు.
‣ జేఈఈ మెయిన్‌ ద్వారా ఎన్‌ఐటీల్లోని సీట్లలో 50 శాతం సొంత రాష్ట్ర విద్యార్థులతోనూ, మిగిలిన 50 శాతం ఇతర రాష్ట్ర విద్యార్థులతోనూ నింపుతారు. ఐఐఐటీల్లో ఎలాంటి రిజర్వేషన్‌ ప్రక్రియ లేకుండా సీట్ల భర్తీ జరుగుతుంది. సీఎఫ్‌ఐ (సెంట్రల్లీ ఫండెడ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌)ల్లోని సీట్లు జేఈఈ మెయిన్‌ ర్యాంకు ద్వారానే భర్తీ అవుతాయి.

జేఈఈ మెయిన్‌ స్కోరుతో వీటిలో ప్రవేశాలు
స్వయం ప్రతిపత్తి గల కొన్ని విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌ కళాశాలలు ఈ జేఈఈ మెయిన్‌ ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నాయి. కాబట్టి విద్యార్థి ఎన్‌ఐటీ లేదా ఐఐఐటీల్లో సీటు రాకపోతే ఈ ర్యాంకు ఉపయోగపడదని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ ర్యాంకు ద్వారా కొన్ని ప్రైవేటు కళాశాలల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. జేఈఈ మెయిన్‌ స్కోరు ఆధారంగా ప్రవేశాలు జరిపే ప్రముఖ కళాశాలలు:
‣ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మెస్రా
‣ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌, గుంటూరు
‣ పీఎస్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కోయంబత్తూరు
‣ శస్త్ర యూనివర్సిటీ, తంజావూరు
‣ ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, కాలేవాక్కం
‣ థాపర్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, పటియాల
‣ అమిటీ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, నోయిడా
‣ ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, పుణె
‣ బన్నారీ అమ్మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఈరోడ్‌
‣ బసవేశ్వర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌, బగల్‌కోట్‌
‣ భారతీ విద్యాపీఠ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, పుణె
‣ బీఎస్‌ అబ్దుర్‌ రెహమాన్‌ యూనివర్సిటీ, చెన్నై
‣ సీవీ రామన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, భువనేశ్వర్‌
‣ ధీరూభాయ్‌ అంబానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, గాంధీనగర్‌
‣ ఫాదర్‌ సి రోడ్రిగ్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నవీ ముంబయి
‣ ఫాదర్‌ కొన్సికివో రోడ్రిగ్జ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, ముంబయి
‣ గాంధీఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ టెక్నలాజికల్‌ అడ్వాన్స్‌మెంట్‌, భువనేశ్వర్‌
‣ జీహెచ్‌ రాయ్‌సోనీ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, నాగ్‌పుర్‌
‣ జీహెచ్‌ రాయ్‌సోనీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, నాగ్‌పుర్‌
‣ గీతం యూనివర్సిటీ, విశాఖపట్నం
‣ గ్రాఫిక్‌ ఎరా యూనివర్సిటీ, డెహ్రాడూన్‌
‣ హెరిటేజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కోల్‌కతా
‣ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, కోల్‌కతా
‣ జేపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, నోయిడా
‣ జేపీ యూనివర్సిటీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సోలన్‌
‣ ఎల్‌ఎన్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, జయపుర
‣ మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, పుణె
‣ ఎంఐటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, పుణె
‣ ముకేష్‌ పాటిల్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ముంబయి
‣ నరుల ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, అగర్‌పరా
‣ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బెరహంపూర్‌
‣ నిర్మా యూనివర్సిటీ, అహ్మదాబాద్‌
‣ ప్రవర రూరల్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌, లోని
‣ సత్యభామ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, చెన్నై
‣ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, డెహ్రాడూన్‌
‣ శివ్‌ నాడర్‌ యూనివర్సిటీ, దాద్రి
‣ శ్రీ గోవింద్‌రామ్‌ సెక్‌సారియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, ఇండోర్‌
‣ శ్రీ రామ్‌దేవ్‌ బాబా కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, నాగ్‌పుర్‌
‣ సోనా కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సేలం
‣ విజ్ఞాన్స్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్‌ టెక్నాలజీ అండ్‌ రిసెర్చ్‌, గుంటూరు
‣ విశ్వకర్మ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, పుణె
‣ అకాడమీ ఆఫ్‌ టెక్నాలజీ, హుగ్లి
‣ బెంగళూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, బెంగళూరు
‣ బిలాయ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, దర్గ్‌
‣ బీఎల్‌డీఈఏస్‌ వీసీ డాక్టర్‌ పీజీ హలకట్టి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, బీజాపుర్‌
‣ సీజీసీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, లాండ్రన్‌ క్యాంపస్‌, మొహాలీ
‣ చండీగఢ్‌ యూనివర్సిటీ, చండీగఢ్‌
‣ చిట్కారా యూనివర్సిటీ, హిమాచల్‌ ప్రదేశ్‌
‣ చిట్కారా యూనివర్సిటీ, పటియాల

Posted Date: 20-10-2020


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌