• facebook
  • whatsapp
  • telegram

'జేఎన్‌టీయూఏ'లో ఎం.ఎస్‌సి.

అనంతపురంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీకి చెందిన ఆయిల్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఓటీఆర్‌ఐ) ఫుల్‌ టైమ్‌ ఎం.ఎస్‌.సి. ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. లైఫ్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌ సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల వివరాలు...

1. ఎం.ఎస్‌.సి. ఫుడ్‌ టెక్నాలజీ: ఫుడ్‌ సైన్స్‌ లేదా టెక్నాలజీలో డిగ్రీ, లేదా ఇతర అనుబంధ సబ్జెక్టులు, కెమికల్‌, లైఫ్‌ సైన్సెస్‌లో డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులు.

2. ఎం.ఎస్‌.సి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ: డిగ్రీలో కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ చదివుండాలి.

3. ఎం.ఎస్‌.సి. బయోకెమిస్ట్రీ: డిగ్రీలో లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్టు ఏదైనా ఒకటి చదివుండాలి.

4. ఎం.ఎస్‌.సి. మైక్రోబయాలజీ: ఏదైనా ఒక లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్టుతో డిగ్రీ చదివుండాలి.

5. ఎం.ఎస్‌.సి. బయోటెక్నాలజీ: డిగ్రీలో బయోటెక్నాలజీ లేదా ఒక లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్టు అవసరం.

‣ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. పరీక్షల సిలబస్‌, కౌన్సెలింగ్‌, ప్రవేశ వివరాలను జేఎన్‌టీయూఏ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు.

Posted Date: 23-01-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌