• facebook
  • whatsapp
  • telegram

ఎన్‌ఎస్‌ఐలో షుగర్‌ టెక్నాలజీ కోర్సులు

అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ వివరాలు


ఓ ఉత్పత్తి పూర్తవడం వెనుక ఎన్నో దశలుంటాయి. ఎందరో నిపుణుల సేవలు అవసరమవుతాయి. ఉత్పాదన క్రమంలో అనుబంధంగా మరికొన్ని అదనపు విలువైనవీ దక్కుతాయి. చెరకు నుంచి పంచదార రూపొందడం అలాంటిదే. ఈ ప్రక్రియపై ఆసక్తి ఉన్నవారు షుగర్‌ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి శ్రీకారం చుట్టవచ్చు. ఈ విభాగంలో దేశంలో పేరొందిన నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్, కాన్పూర్‌ - పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఆహ్వానం పలుకుతోంది...


ఈ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలో ప్రతిభ చూపాలి. అవకాశం వచ్చిన వారికి స్కాలర్‌షిప్పులు, స్టైపెండ్‌ అందుతాయి. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం సాధించవచ్చు.


పీజీ డిప్లొమాలు

షుగర్‌  టెక్నాలజీ

అర్హత: బీఎస్సీ ఎంపీసీ లేదా కెమికల్‌ ఇంజినీరింగ్‌

వ్యవధి: రెండున్నరేళ్లు.

సీట్లు: 66.


షుగర్‌  ఇంజినీరింగ్‌

అర్హత: బీటెక్‌ లేదా ఏఎంఐఈలో మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌ విభాగాలు.

వ్యవధి: 18 నెలలు.

సీట్లు: 40.


ఇండస్ట్రియల్‌ ఫర్మెంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ

అర్హత: బీఎస్సీలో కెమిస్ట్రీ/ అప్లయిడ్‌ కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. లేదా బీటెక్‌ బయోటెక్నాలజీ/ కెమికల్‌ ఇంజినీరింగ్‌/ బయో కెమికల్‌ ఇంజినీరింగ్‌.

వ్యవధి: 18 నెలలు.

సీట్లు: 50.


షుగర్‌ కేన్‌ ప్రొడక్టివిటీ అండ్‌ మెచ్యూరిటీ మేనేజ్‌మెంట్‌

అర్హత: బీఎస్సీ లేదా బీఎస్సీ అగ్రికల్చర్‌. 

వ్యవధి: ఏడాది.

సీట్లు: 20. 


ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌

అర్హత: ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్‌...తదితర విభాగాల్లో బీటెక్‌ లేదా ఏఎంఐఈ.

వ్యవధి: ఏడాది.

సీట్లు: 17


క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఎన్వి రాన్‌మెంటల్‌ సైన్స్‌

అర్హత: బీఎస్సీ ఎంపీసీ లేదా బీజడ్‌సీ లేదా బీస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ లేదా బీఎస్సీ/బీటెక్‌ బయో టెక్నాలజీ. 

వ్యవధి: ఏడాది.

సీట్లు: 22.


సర్టిఫికెట్‌ కోర్సులు

షుగర్‌ బాయిలింగ్‌

అర్హత: పదో తరగతి. ఈ విభాగంలో అనుభవం ఉండాలి. 

వ్యవధి: 18 నెలలు. 

సీట్లు: 63 


షుగర్‌ ఇంజినీరింగ్‌

అర్హత: మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో డిప్లొమా. 

వ్యవధి: ఏడాది.

సీట్లు: 17.


క్వాలిటీ కంట్రోల్‌

అర్హత: ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్‌. 

వ్యవధి: 4 నెలలు.

సీట్లు: 30 

ప్రవేశం: పై అన్ని కోర్సులకూ పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. 


ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: ఏప్రిల్‌ 8 నుంచి మే 24 సాయంత్రం 5 గంటల వరకు.

పోస్టుద్వారా ప్రింట్‌ అవుట్‌ స్వీకరణకు గడువు: మే 31 సాయంత్రం 5 గంటలు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.వెయ్యి. ఇతరులకు రూ.1500.

పరీక్ష తేదీ: జూన్‌ 23. 

పరీక్ష కేంద్రాలు: పుణె, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, కాన్పూర్, పట్నా.

వెబ్‌సైట్‌: https://nsi.gov.in/



ఎఫ్‌ఎన్‌ఎస్‌ఐ కోర్సులు

షుగర్‌  టెక్నాలజీ/ షుగర్‌ కెమిస్ట్రీ, షుగర్‌ ఇంజినీరింగ్, ఫెర్మెంటేషన్‌ టెక్నాలజీ... ఇవి ఇండస్ట్రీ స్పాన్సర్‌ చేసే ఫెలోషిప్‌ డిప్లొమా ఆఫ్‌ ద ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌ఎన్‌ఎస్‌ఐ) కోర్సులు. ఇంటర్వ్యూతో ప్రవేశాలుంటాయి.


కోర్సులను పూర్తి చేసుకున్నవారికి పంచదార పరిశ్రమలు అనుబంధ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. చివరి ఏడాది కోర్సులు చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సును బట్టి ప్రవేశ పరీక్ష విధానంలో మార్పులు ఉంటాయి. ఈ సంస్థలో కోర్సులు పూర్తి చేసుకున్న వారికి జాతీయ స్థాయి పరిశ్రమలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలకీ వీలుంది. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Posted Date: 22-03-2024


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌