• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఆహ్లాదకర ప్రాంగణాల్లో.. !

అభ్యర్థుల ఆసక్తి మేరకు విభిన్న కోర్సులు 

బిట్‌శాట్-2021 ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

ఇంట‌ర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు అర్హులు

ఒక కోర్సులోచేరితో ఇష్టం ఉన్నా లేకపోయినా అందులో ఉన్న సబ్జెక్టులు కచ్చితంగా చదవాల్సిందే.  ఆసక్తికి అనువైనవి ఎంచుకునే వీలు ఉండదు. కానీ, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్‌సైన్స్ (బిట్స్‌)లో ఆ అవ‌కాశం ల‌భిస్తుంది. ఫ్లెక్సిబుల్ ల‌ర్నింగ్ ఇక్క‌డి ప్ర‌త్యేక‌త‌. అలాగే ఆహ్లాద‌క‌ర‌మైన ప్రాంగ‌ణాలు, అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలు క‌లిగిన‌ బోధ‌న అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు. ఇంజినీరింగ్, సైన్స్ కోర్సుల్లో చేరి సాంకేతిక నైపుణ్యాలు, ప‌రిశోధ‌న‌కు దోహ‌దం చేసే అంశాల‌ను అభ్య‌సించ‌వ‌చ్చు. 

ఈ విద్యాసంస్థ‌కు పిలానీ (రాజ‌స్థాన్‌), గోవా, హైద‌రాబాద్‌లో మూడు క్యాంప‌స్‌లు ఉన్నాయి. వీటిలో చోటు ద‌క్కాలంటే ఆ సంస్థ నిర్వ‌హించే బిట్స్ అడ్మిష‌న్ టెస్ట్ (బిట్‌శాట్‌)లో అర్హ‌త సాధించాలి. ఈ ఏడాదికి సంబంధించి ప్ర‌వేశ‌ప‌రీక్ష ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 

క్యాంప‌స్‌లు.. అందిస్తున్న కోర్సులు

ఇంట‌ర్ చ‌దివిన వారికి బిట్స్ మూడు ర‌కాల ఫ‌స్ట్ డిగ్రీ కోర్సుల‌ను అందిస్తోంది. ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో చ‌దువుతున్న ప్ర‌ధాన కోర్సుతోపాటు విద్యార్థి ఆస‌క్తి, ప్ర‌తిభ‌ను బట్టి మైన‌ర్ ప్రోగ్రాముల్లో కోర్సులనూ పూర్తి చేయ‌వ‌చ్చు. క్యాంప‌స్‌ల వారీగా కోర్సులు ఇలా..

బిట్స్ పిలానీ (పిలానీ క్యాంప‌స్)

బీఈ: కెమిక‌ల్‌, సివిల్, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేష‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, మెకానికల్‌, మ్యానుఫాక్చ‌రింగ్‌

బీఫార్మ‌సీ

ఎమ్మెస్సీ: బ‌య‌లాజిక‌ల్ సైన్స్‌, కెమిస్ట్రీ, ఎక‌నామిక్స్‌, మ్యాథ‌మేటిక్స్‌, ఫిజిక్స్ అండ్ జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌

కేకే బిర్లా గోవా క్యాంప‌స్‌లో..‌

బీఈ: కెమిక‌ల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేష‌న్‌, మెకానిక‌ల్

ఎమ్మెస్సీ: బ‌య‌లాజిక‌ల్ సైన్స్‌, కెమిస్ట్రీ, ఎక‌నామిక్స్‌, మ్యాథ‌మేటిక్స్‌, ఫిజిక్స్

హైద‌రాబాద్ క్యాంప‌స్‌లో..‌

బీఈ: కెమిక‌ల్‌, సివిల్, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేష‌న్‌, మెకానిక‌ల్

బీఫార్మ‌సీ

ఎమ్మెస్సీ: బ‌య‌లాజిక‌ల్ సైన్స్‌, కెమిస్ట్రీ, ఎక‌నామిక్స్‌, మ్యాథ‌మేటిక్స్‌, ఫిజిక్స్‌

ప్ర‌వేశాల‌కు అర్హ‌త‌?

ఇంజినీరింగ్‌, ఎమ్మెస్సీ కోర్సుల‌కు ఇంట‌ర్‌లో ఎంపీసీ గ్రూపు తప్ప‌నిస‌రి. వాటిలో చేరాల‌నుకునే వారు ఇంట‌ర్మీడియ‌ట్‌లో క‌నీసం 75 శాతం ఉత్తీర్ణ‌త‌సాధించాలి. అలాగే ఫిజిక్స్‌, కెమి‌స్ట్రీ, మ్యాథ‌మేటిక్స్‌/బ‌యాల‌జీ స‌బ్జెక్టుల్లో విడిగా క‌నీసం 60% మార్కుల‌తో పాస‌వ్వాలి. 2021లో ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న‌వారు, 2020లో ఇంట‌ర్ ఉత్తీర్ణులైన వారు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు. బీఫార్మ‌సీ కోర్సుకు బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇంగ్లిష్‌ప్రొఫిషియ‌న్సీ ఉండాలి. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో సెంట్ర‌ల్‌, స్టేట్ బోర్డుల్లో టాప‌ర్లుగా నిలిచిన విద్యార్థులు బిట్‌శాట్ రాయ‌కున్నా ఈ విద్యాసంస్థ నేరుగా వారు కోరుకున్న కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తోంది. 

ప‌రీక్ష విధానం..

బిట్‌శాట్ కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌. ప్ర‌శ్న‌ప‌త్రం ఆంగ్లంలో ఉంటుంది. స‌మ‌యం 3 గంట‌లు ఉంటుంది. ప‌రీక్షను‌4 విభాగాల్లో నిర్వ‌హిస్తారు. వాటిలో పార్ట్‌1 ఫిజిక్స్‌, పార్ట్‌2 కెమిస్ర్టీ, పార్ట్‌3 (ఏ) ఇంగ్లిష్ ప్రొఫిషియ‌న్సీ (బి) లాజిక‌ల్ రీజ‌నింగ్‌, పార్ట్‌4 మ్యాథ‌మేటిక్స్‌/బ‌యాల‌జీ(బీ ఫార్మ‌సీ విద్యార్థుల‌కు) ఉంటాయి. అన్ని ప్ర‌శ్న‌లూ ఆబ్జెక్టివ్ రూపంలో వ‌స్తాయి. ప్ర‌తి స‌రైన స‌మాధానికి 3 మార్కులు ఇస్తారు. త‌ప్పు స‌మాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల‌కు 40 మార్కుల చొప్పున‌, ఇంగ్లిష్ ప్రొఫిషియ‌న్సీకి 15, లాజిక‌ల్ రీజ‌నింగ్‌కు 10, మ్యాథ‌మేటిక్స్‌/బ‌యాల‌జీకి 45 మార్కుల చొప్పున మొత్తం ప‌రీక్ష 150 మార్కుల‌కు నిర్వహిస్తారు. 

బోన‌స్ ప్ర‌శ్నలూ ఇస్తారు!

కేటాయించిన ప‌రీక్ష స‌మ‌యం కంటే ముందే ప్ర‌శ్న‌లన్నింటికీ స‌మాధానాలు గుర్తించిన అభ్య‌ర్థుల‌కు అద‌నంగా 12 ప్ర‌శ్న‌లు ఇస్తారు. వీటికి స‌రైన స‌మాధానాలు గుర్తిస్తే మార్కులూ అద‌నంగా ల‌భిస్తాయి. మ్యాథ్స్‌/బ‌యాల‌జీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ.. ఒక్కో స‌బ్జెక్టు నుంచి నాలుగు చొప్పున ప్ర‌శ్న‌లొస్తాయి. బోన‌స్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానమిస్తూ లేదా చేసిన త‌ర్వాత మొద‌టి ప్ర‌శ్న‌ల‌ను తిరిగి చూసుకోవ‌డానికి గానీ, వాటి స‌మాధానాలను మార్చ‌డానికి గానీ సాధ్యం కాదు. 

గత ఏడాది కటాఫ్‌  

బిట్‌ శాట్‌ -2020 స్కోర్‌తో పిలానీ క్యాంపస్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ కటాఫ్‌ 372. గోవా క్యాంపస్‌ 347, హైదరాబాద్‌ క్యాంపస్‌ 336గా ఉన్నాయి. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఈ మూడు క్యాంపస్‌ల్లోనూ వరుసగా 333, 306, 300గా ఉన్నాయి. ఈసీఈ గోవాలో 320, హైదరాబాద్‌లో 314తో ఆగింది. పిలానీలో ఈ బ్రాంచి ఈ సంవత్సరం నుంచి మొదలవుతుంది. గత ఏడాది ప్రకారం కనీసం 240 మార్కులు సాధించినవారికి ఏదో ఒక ఇంజినీరింగ్‌ బ్రాంచిలో సీటు దక్కుతుంది. కొన్నేళ్లుగా బిర్లా సంసల్లో బీటెక్‌ కెమికల్, సివిల్‌ బ్రాంచీల కంటే ఎమ్మెస్సీ ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో చేరడానికే ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. గత  సంవత్సరం 400, ఆపైన స్కోరును 235 మంది సాధించారు.350, ఆ పైన 1790 మంది పొందారు.  

ద‌ర‌ఖాస్తు ఎలా?

అర్హులైన అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తుల‌కు మే 29, 2021 వ‌ర‌కు గ‌డువు ఉంది. జూన్ 24 నుంచి 30 వ‌ర‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ద‌ర‌ఖాస్తు రుసుము పురుష అభ్య‌ర్థులు రూ.3400, మ‌హిళా అభ్య‌ర్థులు రూ.2900 చెల్లించాలి.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు

బిట్‌శాట్‌2021ను దేశంలో మొత్తం 61 కేంద్రాల్లో నిర్వ‌హిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైద‌రాబాద్ బిట్స్ క్యాంప‌స్‌, హైద‌రాబాద్ సిటీ, విశాఖ‌ప‌ట్నం, విజయ‌వాడ‌, తిరుప‌తి కేంద్రాల్లో నిర్వ‌హిస్తారు.

ఎంపిక ఇలా..

ప్ర‌వేశాలు పొందాల‌నుకునే విద్యార్థులు అర్హ‌త‌లో చెప్పిన విధంగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్‌లో క‌నీస మార్కులు సాధించి ఉండాలి. బిట్‌శాట్ పూర్త‌యిన మ‌రుస‌టి రోజు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్య‌ర్థులు త‌మ‌స్కోరును చూసుకోవ‌చ్చు. ఫ‌లితాల అనంత‌రం సంస్థ స్కోర్ల‌ను బ‌ట్టి మెరిట్ లిస్ట్ త‌యారు చేస్తుంది. దాని ఆధారంగా ప్ర‌వేశాలు క‌ల్పిస్తుంది. 

ప్రిప‌రేష‌న్ ప్ర‌ణాళిక‌

బిట్‌శాట్.. జేఈఈ ప‌రీక్ష స్థాయితో పోలిస్తే కాస్త సుల‌భంగానే ఉంటుంది. అయితే ప్ర‌శ్న‌ల స‌ర‌ళి, స‌బ్జెక్టుల వారీగా తేడా ఉంది. ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌య్యే అభ్య‌ర్థులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బ‌యాల‌జీ స‌బ్జ‌క్టులపై ప‌ట్టు పెంచుకోవాలి. ముందు సుల‌భంగా ఉండే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు గుర్తించి త‌ర్వాత క‌ష్టంగా ఉన్న వాటి జోలికి వెళ్లాలి. ఇంగ్లిష్ ప్రొఫిషియ‌న్సీ, లాజిక‌ల్ రీజ‌నింగ్ కోసం మార్కెట్లో విరివిగా పుస్తకాలు ల‌భ్య‌మ‌వుతాయి. వీలైనంత వ‌ర‌కు న‌మూనా, పాత ప్ర‌శ్నప‌త్రాల‌ను సాధన చేయ‌డం మంచిది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా మాదిరి ప్ర‌శ్న‌ప‌త్రం ల‌భిస్తుంది. ప‌రీక్షలో రుణాత్మ‌క మార్కులున్నాయి కాబ‌ట్టి స‌రైన స‌మాధానం తెలిస్తేనే గుర్తించాలి. లేదంటే న‌ష్ట‌పోతార‌ని గుర్తుంచుకోండి. 

పార్ట్‌1: ఫిజిక్స్‌

ఫిజిక్స్ స‌బ్జెక్టులో యూనిట్స్ & మేజ‌ర్‌మెంట్స్‌, కైన‌మెటిక్స్‌, న్యూట‌న్స్ లా, ఇంప‌ల్స్ అండ్ మోమెంటమ్‌, వ‌ర్క్ అండ్ ఎన‌ర్జీ, రొటేష‌న‌ల్ మోష‌న్‌, గ్రావిటేష‌న్‌, మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ విభాగాల నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. అలాగే వేవ్స్‌, హీట్ అండ్ థ‌ర్‌మోడైన‌మిక్స్‌, ఎల‌క్ట్రోస్టాటిక్స్‌, క‌రెంట్ ఎల‌క్ట్రిసిటీ, మ్యాగ్న‌టిక్ ఎఫెక్ట్ ఆఫ్ క‌రెంట్, ఎల‌క్ట్రోమ్యాగ్నెటిక్ ఇండ‌క్ష‌న్‌, ఆప్టిక్స్‌, మోడ‌ర్న్ ఫిజ‌క్స్, ఎల‌క్ట్రానిక్ డివైజెస్ నుంచీ అడుగుతారు.

పార్ట్‌2: కెమిస్ట్రీ

ఇందులో సీట్స్ ఆఫ్ మ్యాట‌ర్‌, అటోమిక్ స్ట్ర‌క్చ‌ర్‌, థ‌ర్‌మోడైన‌మిక్స్‌, ఫిజిక‌ల్ అండ్ కెమిక‌ల్ ఈక్విలిబ్రియా, ఎల‌క్ట్రోకెమిస్ట్రీ, కెమిక‌ల్ కైన‌టిక్స్‌, హైడ్రోజ‌న్ ఎస్‌బ్లాక్ ఎలెమెంట్స్‌, పి-డి-ఎఫ్ బ్లాక్ ఎలెమెంట్స్ నుంచి ప్ర‌శ్న‌ల‌డుగుతారు. ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బ‌న్స్‌, స్టీరియో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కాంపౌండ్స్ విత్ ఫంక్ష‌న‌ల్ గ్రూప్స్ కంటైనింగ్ ఆక్సిజిన్ అండ్ నైట్రోజన్ త‌దిత‌ర విభాగాల‌పై ప్ర‌శ్న‌లు సంధిస్తారు. 

పార్ట్‌3 (ఏ) ఇంగ్లిష్ ప్రొఫిషియ‌న్సీ

ఇంగ్లిష్ గ్రామ‌ర్‌పై ప‌ట్టు పెంచుకోవాలి. దీని ద్వారా సుల‌భంగా స‌మాధానాలు గుర్తించ‌వ‌చ్చు. అగ్రిమెంట్‌, టైమ్ అండ్ టెన్స్‌, ప్రిపొజిష‌న్స్‌, మోడ‌ల్స్‌, ట్రాన్స్ఫ‌ర్మేష‌న్‌పై దృష్టి సారించాలి. ఒకాబుల‌రీ, రీడింగ్ కాంప్ర‌హెన్సన్, కంపొజిష‌న్ త‌దిత‌ర అంశాల‌పై స‌న్న‌ద్ధం కావాలి. 

(బి) లాజిక‌ల్ రీజ‌నింగ్‌

వెర్బ‌ల్, నాన్ వెర్బ‌ల్ విభాగాల నుంచి ప్ర‌శ్న‌ల‌డుగుతారు. ఇందులో అనాల‌జీ, క్లాసిఫికేష‌న్‌, సిరీస్ కంప్లేష‌న్‌, లాజిక‌ల్ డిడ‌క్ష‌న్‌, చార్ట్ లాజిక్, పాటెర్న్ ప‌ర్సెప్ష‌న్‌, పేప‌ర్ క‌టింగ్ ఇత‌ర అంశాలు ఉంటాయి. వీటిపై శ్ర‌ద్ధ చూపితే సుల‌భంగా మార్కులు సాధించ‌వ‌చ్చు. 

పార్ట్‌4: గ‌ణితం

గ‌ణితంలో స‌మాధానాల‌ను గుర్తించేందుకు కాస్త ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. ముందు విభాగాలు త్వ‌ర‌గా పూర్తి చేసి దీనికి వీలైనంత అధిక స‌మ‌యం కేటాయించాలి. ఇందులో ఆల్‌జీబ్రా, ట్రైగోనోమెట్రి, వెక్ట‌ర్స్‌, స్టాటిస్టిక్స్‌, లైనియ‌ర్ ప్రోగ్రామింగ్, మ్యాథ‌మేటిక‌ల్ మోడ‌లింగ్, ప్రాబ‌బులిటీ, టు-త్రీ డైమెన్ష‌న‌ల్ కోఆర్డినేట్ జామెట్రీ తదిత‌ర విభాగాలకు చెందిన ప్ర‌శ్న‌లుంటాయి. 

పార్ట్‌4: బ‌యాల‌జీ

డైవ‌ర్సిటీ ఇన్ లివింగ్ వ‌ర‌ల్డ్‌, సెల్ స్ట్ర‌క్ష‌ర్ అండ్ ఫంక్ష‌న్‌, జెనెటిక్స్ అండ్ ఎవ‌ల్యూష‌న్‌, ప్లాంట్స్-అనిమ‌ల్స్‌స్ట్ర‌క్ష‌ర్ అండ్ ఫంక్ష‌న్‌, రీప్రొడ‌క్ష‌న్, గ్రోత్ అండ్ మోమెంట్ ఇన్ ప్లాంట్స్‌, రీప్రొడ‌క్ష‌న్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇన్ హ్యూమ‌న్స్ త‌దిత‌ర అంశాల‌కు చెందిన ప్రశ్న‌లు ఈ స‌బ్జెక్టులో అడుగుతారు. వీటిపై క‌స‌ర‌త్తు అవ‌స‌రం.

దరఖాస్తుకు చివరి తేదీ; 29 మే, 2021.

వెబ్ సైట్; https://www.bitsadmission.com/

Posted Date: 16-03-2021


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌