• facebook
  • whatsapp
  • telegram

ప్ర‌త్యేక ప్రావీణ్యానికి...ఒకేష‌న‌ల్ కోర్సులు

పదో తరగతి తర్వాత ఉపాధికి బాటలు వేసేవాటిలో ఒకేషనల్‌ కోర్సులు చెప్పుకోదగ్గవి. చదువు పూర్తయిన వెంటనే నిలదొక్కుకోవడానికి వీలుగా వీటిని రూపొందించారు. ఈ చదువుల్లో ప్రాక్టికల్‌ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఎక్కువ. అందువల్ల కోర్సు పూర్తయిన వెంటనే ఎలాంటి శిక్షణ లేకుండా సంబంధిత విభాగంలో సేవలందిస్తోన్న సంస్థల్లో చేరిపోవచ్చు. అలాగే ఉన్నత విద్యకూ అవకాశం ఉంది. నచ్చిన రంగానికి సంబంధించిన కోర్సులను ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ విధానంలో చదువుకోవచ్చు. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల వ్యవధితో 27 ఒకేషనల్‌ కోర్సులు పది పూర్తయినవారికోసం ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం...

 

ఏదైనా ఒక విభాగంలో ప్రత్యేక ప్రావీణ్యం ఆశించేవారు ఒకేషనల్‌ కోర్సుల్లో చేరవచ్చు. వివిధ సెక్టార్ల అవసరాలను తీర్చి, స్కిల్‌ గ్యాప్‌ పూడ్చడానికి ఒకేషనల్‌ కోర్సులు రూపొందించారు. పనిచేయడం ద్వారా నేర్చుకోవడానికి ఒకేషనల్‌ విద్యలో ప్రాధాన్యమిస్తారు. ఈ చదువుల్లో 40 శాతం థియరీ, 60 శాతం ప్రాక్టికల్‌ అప్రోచ్‌ ఉంటాయి. అంటే తెలుసుకోవడం కంటే సంబంధిత పనిని చేయడం ద్వారా నేర్చుకోవడం, అనువర్తనం (అప్లికేషన్‌)కు అధిక ప్రాధాన్యం లభిస్తుంది. పది పూర్తిచేసుకున్న విద్యార్థులు ఏ తరహా పరిశ్రమలో సేవలు అందించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని సంబంధిత కోర్సులను ఎంచుకోవచ్చు. కోర్సులో ఉన్నప్పుడే ఆ విభాగానికి చెందిన పరిశ్రమలో ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసుకునే అవకాశం వీరికి లభిస్తుంది. దీంతో అదనపు శిక్షణ అవసరం లేకుండా చదువు పూర్తయిన తర్వాత విధులు నిర్వర్తించడానికి వీలవుతుంది. ఏపీ, తెలంగాణల్లో పలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సులు అందిస్తున్నాయి. పదో తరగతి గ్రేడ్‌ పాయింట్ల ప్రకారం ఆయా కోర్సులవారీ సీట్లు కేటాయిస్తారు.

 

ఇవీ కోర్సులు

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 27 ఒకేషనల్‌ కోర్సులు పదో తరగతి తర్వాత రెండేళ్ల వ్యవధితో అందుబాటులో ఉన్నాయి. వీటిని అగ్రికల్చరల్, బిజినెస్‌ అండ్‌ కామర్స్, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, హోమ్‌ సైన్స్, హ్యుమానిటీస్, పారా మెడికల్‌ విభాగాల్లో అందిస్తున్నారు. ఆయా విభాగాలవారీ ఉన్న కోర్సుల వివరాలు

అగ్రికల్చరల్‌: క్రాప్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, డైరీయింగ్, ఫిషరీస్, సెరీకల్చర్‌.

బిజినెస్‌ అండ్‌ కామర్స్‌: అకౌంటింగ్‌ అండ్‌ ట్యాక్సేషన్, మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌మెన్‌షిప్, ఆఫీస్‌ అసిస్టెంట్‌షిప్, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ అండ్‌ మార్కెటింగ్‌.

ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ: ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్, కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, ఎల్రక్టానిక్స్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్, ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ అప్లయన్సెస్‌ సర్వీసింగ్, రూరల్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్, వాటర్‌ సప్లై అండ్‌ శానిటరీ ఇంజినీరింగ్, డీటీపీ అండ్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ.

హోమ్‌ సైన్స్‌ కోర్సులు: కమర్షియల్‌ గార్మెంట్స్‌ డిజైనింగ్‌ అండ్‌ మేకింగ్, ఫ్యాషన్‌ గార్మెంట్‌ మేకింగ్, హోటల్‌ ఆపరేషన్స్, ప్రీ స్కూల్‌ టీచర్‌ ట్రైనింగ్‌.

హ్యుమానిటీస్‌ అండ్‌ అదర్స్‌: కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అండ్‌ యానిమేషన్, టూరిజం అండ్‌ ట్రావెల్‌ టెక్నిక్‌.

పారా మెడికల్‌: మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్, మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్, ఆఫ్తాల్మిక్‌ టెక్నీషియన్, ఫిజియోథెరపీ.

 

ఉన్నత విద్య

ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు డిగ్రీ కళాశాలలు అందిస్తోన్న బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ స్టడీస్‌ కోర్సుల్లో చేరిపోవచ్చు. ఈ విభాగంలో ఉన్నత చదువులకు మాస్టర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ కోర్సులూ ఉన్నాయి. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఒకేషనల్‌ చదువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. వీటిలో చేరుతోన్న విద్యార్థుల సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. ఒకవేళ ఇంటర్‌ ఒకేషనల్‌ చదువులపై ఆసక్తి తగ్గితే బ్రిడ్జ్‌ కోర్సులు పూర్తిచేసుకుని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఎస్సీ తదితర విభాగాల్లోకి వెళ్లిపోవచ్చు. పాలిటెక్నిక్‌లో అయితే నేరుగా ద్వితీయ సంవత్సరం కోర్సులో చేరిపోవచ్చు.

 

ఓపెన్‌ స్కూలింగ్‌తోనూ...

కాలేజీకి వెళ్లి ఒకేషనల్‌ కోర్సులు చదవడం వీలుకానివారు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ అందించే ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్రొగ్రాముల్లో చేరవచ్చు. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వయంప్రతిపత్తి సంస్థ ఇది. పదో తరగతి విద్యార్హతతో ఇక్కడ పలు ఒకేషనల్‌ కోర్సులు ఉన్నాయి. వీటిని సీనియర్‌ సెకెండరీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ స్థాయుల్లో వివిధ విభాగాల్లో అందిస్తున్నారు.

 

సీనియర్‌ సెకెండరీ స్థాయిలో: ఆయుర్వేద అండ్‌ యోగా: ఆయుర్వేద అసిస్టెంట్, పంచకర్మ అసిస్టెంట్, యోగా అసిస్టెంట్‌; ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌: వెబ్‌ డెవలప్‌మెంట్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసెంబ్లీ అండ్‌ మెయింటెనెన్స్, సీఆర్‌ఎం డొమెస్టిక్‌ వాయిస్‌; ప్లాంట్‌ ప్రొటెక్షన్, సాయిల్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఉన్నాయి.

 

సర్టిఫికెట్‌ లేదా డిప్లొమాలో: సెక్రటేరియల్‌ ప్రాక్టీస్, టైప్‌ రైటింగ్, స్టెనోగ్రఫీ, డెస్క్‌టాప్‌ పబ్లిషింగ్, వెబ్‌ డిజైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, డేటా ఎంట్రీ ఆపరేషన్స్, ఐటీ ఎసెన్షియల్స్‌ పీసీ హార్డ్‌వేర్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్, వెబ్‌ డెవలప్‌మెంట్, సీఆర్‌ఎం డొమెస్టిక్‌ వాయిస్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసెంబ్లీ అండ్‌ మెయింటెనెన్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, హౌస్‌ వైరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ అప్ల్లయన్స్‌ రిపేరింగ్, మోటార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ రివైండింగ్, టీవీ రిపేరింగ్, కన్‌స్ట్రక్షన్‌ సూపర్విజన్, ఎలక్ట్ట్రికల్‌ టెక్నీషియన్, రేడియో అండ్‌ టీవీ టెక్నీషియన్, ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్, ఫర్నిచర్‌ అండ్‌ క్యాబినెట్‌ మేకింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, కేర్‌ ఎల్డర్లీ, కమ్యూనిటీ హెల్త్, హోమియోపతిక్‌ డిస్పెన్సింగ్, హౌస్‌ కీపింగ్, క్యాటరింగ్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్, హోటల్‌ ఫ్రంట్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్, ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌ ప్రిజర్వేషన్, ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్, టాయ్‌ మేకింగ్‌ అండ్‌ జాయ్‌ఫుల్‌ లర్నింగ్, లైబ్రరీ సైన్స్, ఫుడ్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ ఆపరేషన్స్, హౌస్‌ కీపింగ్‌ అండ్‌ మెయింటెనెన్స్, ఫ్రంట్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్, బ్యాకరీ అండ్‌ కన్ఫెక్షనరీ... తదితర కోర్సులు ఉన్నాయి.

 

యూజీలో...

మూడేళ్ల ఒకేషనల్‌ కోర్సుల్లో భాగంగా విద్యార్థులు ఆసక్తిని బట్టి ... బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బయో మెడికల్‌ సైన్సెస్, ఇండస్ట్రియల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఐటీ, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అండ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, మోడర్న్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ప్రింటింగ్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్‌ అండ్‌ డేటా ఎనాలసిస్‌.. తదితర కోర్సులు ఎంచుకోవచ్చు. ఆయా డిగ్రీ కళాశాలల పరిధిలోని పరిశ్రమలు, స్థానిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రాంతాల వారీ కోర్సులు రూపొందిస్తున్నారు

 

జాతీయ స్థాయిలో...

నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ అంతర్‌ప్రన్యూర్‌షిప్‌ ఒకేషనల్‌ విద్యకు దిక్సూచిలా వ్యవహరిస్తోంది. ఎన్‌ఎస్‌డీసీ యూజీసీతో కలిసి దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో ఒకేషనల్‌ కోర్సులు స్కిల్‌ బేస్డ్‌ విధానంలో అందిస్తోంది. కమ్యూనిటీ కళాశాలల్లో సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులు ఉంటాయి. ఇందులో భాగంగా 6 నెలల సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసుకుంటే నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ లెవెల్‌ 4 స్థాయి సొంతమవుతుంది. ఏడాది వ్యవది ఉండే డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్న వారికి లెవెల్‌ 5, రెండేళ్ల అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా వారికి లెవెల్‌ 6, మూడేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ పూర్తిచేసుకుంటే లెవెల్‌ 7 స్థాయికి చేరుకున్నట్లు. డిగ్రీ కళాశాల్లలో ఒకేషనల్‌లో బ్యాచిలర్‌ కోర్సులు ఎక్కువగా ఉంటాయి

Posted Date: 17-09-2021


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌