• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్/బీఎస్సీ

వృత్తి విద్యాకోర్సులు చేసేవారికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ వివిధ సదుపాయాలను కల్పించింది. వాటి వివరాలు..
రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసినవారు ఎంసెట్‌కు కూడా హాజరు కావచ్చు. దీని కోసం నిర్దేశించిన బ్రిడ్జికోర్సు పూర్తి చేయాలి.
ఒకవేళ డిగ్రీ చదవాలనుకుంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులతో సమానంగా ఆర్ట్స్, కామర్స్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. బ్రిడ్జి కోర్సు చేయడం ద్వారా బీఎస్సీలోనూ చేరవచ్చు.
ప్రైవేటు కళాశాలలో వృత్తి విద్యా కోర్సు చేసే ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వం బోధనారుసుం కింద రూ.4,500 చెల్లిస్తోంది.
సాధారణ ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు వృత్తి విద్యా కోర్సు చేసేవారికీ ఉపకారవేతనాలు అందుతాయి. 'ప్రతిభ అవార్డులకూ వీళ్లు అర్హులే.
వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో నేరుగా చేరవచ్చు. ఇందుకు ఎలాంటి ప్రవేశపరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కరెస్పాండెన్స్ కోర్సు ద్వారా కూడా పాలిటెక్నిక్ చేయవచ్చు. అప్పుడు కూడా రెండో సంవత్సరం నుంచే చదవవచ్చు.
దీర్ఘకాలిక కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వం ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సమయంలో విద్యార్థికి ప్రతినెలా స్టయిపెండ్ కింద కొంత నగదు లభిస్తుంది (కొన్ని కంపెనీలు మార్కెట్ డిమాండ్‌ను బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకూ చెల్లిస్తున్నాయి).

Posted Date: 20-10-2020


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌