• facebook
  • whatsapp
  • telegram

ఇఫ్లూ కోర్సుల్లో  ప్రవేశాలకు ప్రకటన

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ), 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ఫుల్‌టైం పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు...

కోర్సులు/ ప్రోగ్రాంలు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఇంగ్లిష్‌ టీచింగ్‌ (పీజీడీటీఈ), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ అరబిక్‌ టీచింగ్‌ (పీజీడీటీఏ), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ టీచింగ్‌(పీజీడీటీ).  

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో ఎంఏ(ఇంగ్లిష్‌/ ఇంగ్లిష్‌ లిటరేచర్‌/ అరబిక్‌)లో (ఓబీసీ అభ్యర్థులైతే 55శాతం, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులైతే 50శాతం మార్కులతో) ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు.

పీహెచ్‌డీలో ప్రోగ్రాంలు: లింగ్విస్టిక్స్‌ అండ్‌ ఫొనెటిక్స్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఎడ్యుకేషన్, హిందీ, ఇండియా అండ్‌ వరల్డ్‌ లిటరేచర్స్, ఇంగ్లిష్‌ లిటరేచర్, కంపేరిటివ్‌ లిటరేచర్, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్, కల్చరల్‌ స్టడీస్, ఈస్తటిక్స్‌ అండ్‌ ఫిలాసఫీ, ఫిల్మ్‌ స్టడీస్‌ అండ్‌ విజువల్‌ కల్చర్, సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ స్టడీస్, మీడియా కమ్యూనికేషన్, అరబిక్, ఫ్రెంచ్, రష్యన్, జర్మన్, స్పానిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌.

కటాఫ్‌ మార్కులు...

పీజీ డిప్లొమా: జనరల్‌- 50 శాతం, ఓబీసీ- 45 శాతం, ఎస్సీ/ ఎస్టీ- 35 శాతం.

పీహెచ్‌డీ: ఓబీసీ- 50 శాతం, ఎస్సీ/ ఎస్టీ- 45 శాతం.

సీట్లు: 108 (మొత్తం అన్ని కోర్సులకు కలిపి) 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ/ఎంఫిల్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 

సెమిస్టర్లు:

సీట్లు: మొత్తం 80 (పీజీడీటీఈ- 40, పీజీడీటీఏ- 20,  పీజీడీటీ- 20)

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా..

పరీక్ష ఫీజు: జనరల్‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.500/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే రూ.250/-.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులకు చివరి తేదీ: మే 18 

పరీక్ష తేదీ: జూన్‌ 04

పరీక్ష జరిగే సమయం: ఉదయం 9-11 లేదా 9-12 గంటల వరకు; మధ్యాహ్నం 2-4 లేదా 2-5 గంటల వరకు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.

వెబ్‌సైట్‌: https://www.efluniversity.ac.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సౌకర్యంగా చదువుకోడానికి ఈ-బుక్‌రీడర్‌

‣ బహు భాషలు నేర్చుకుంటే..!

‣ సరిహద్దు దళంలో ఉద్యోగాలు

‣ సులువుగా పర్యావరణాన్ని చదివేద్దాం!

‣ ఎకానమీలో ఏవీ ముఖ్యం?

‣ అవుతారా డ్రోన్‌ పైలట్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 17-05-2022


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌