• facebook
  • whatsapp
  • telegram

చక్కర సంస్థలో తియ్యని కోర్సులు! 

వసంత్‌ దాదా ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ, పీజీ డిప్లొమా ప్రవేశాలు

పంచదార ప్రధానంగా చెరుకు నుంచే రూపొందుతుందనేది తెలిసిన సంగతే. అయితే దాని తయారీ వెనుక సాంకేతికత, నిపుణుల శ్రమ దాగి ఉన్నాయి. అలాగే చెరుకు నుంచి ఇతర ఉత్పత్తులూ బయటకు వస్తున్నాయి. చెరుకు, పంచదార పరిశ్రమపై ఆసక్తి ఉన్నవారికోసమే ప్రత్యేకంగా కొన్ని కోర్సులు, సంస్థలూ ఆవిర్భవించాయి. వాటిని పూర్తిచేసుకున్నవారు చక్కెర పరిశ్రమలు, ఆల్కహాల్‌ తయారీ సంస్థల్లో అవకాశాలు పొందవచ్చు. దేశంలో అతి కొద్ది విద్యా సంస్థలు మాత్రమే ఈ తరహా చదువులు అందిస్తున్నాయి. వాటిలో పుణేలోని వసంత్‌ దాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒకటి. ఈ సంస్థ సర్టిఫికెట్, పీజీ డిప్లొమా, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆ వివరాలు..

పంచదార, అనుబంధ పరిశ్రమలకు నైపుణ్యమున్న మానవ వనరులను అందించడానికి వసంత్‌ దాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ 1975లో పుణే సమీపంలో నెలకొల్పారు. సావిత్రీభాయ్‌ ఫూలే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇక్కడ పలు జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు అందిస్తున్నారు. వీటిని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. దేశంలో పేరొందిన పంచదార పరిశ్రమలు, స్పిరిట్, డిస్టిలరీ, బ్రూవరీలు, బేవరేజ్‌లు, ఇతర సంస్థలు వీరిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ పరీక్ష నిర్వహిస్తారు. కోర్సును అనుసరించి జనరల్‌ కెమిస్ట్రీ, బయాలజీ, జనరల్‌ ఇంగ్లిష్, మ్యాథ్స్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో ప్రతిభ చూపినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు.

ఇవీ కోర్సులు..

ఎమ్మెస్సీ..

ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌: మ్యాథ్స్, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ కాకుండా ఏదైనా సబ్జెక్టుతో బీఎస్సీ లేదా బీటెక్‌ సివిల్‌/ కెమికల్‌ లేదా బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివినవారు అర్హులు. కోర్సు వ్యవధి రెండేళ్లు. 

వైన్, బ్రూవింగ్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ: బీఎస్సీ వైన్‌ టెక్నాలజీ/ బయో టెక్నాలజీ/ మైక్రోబయాలజీ/ కెమిస్ట్రీ/ అగ్రికల్చర్‌/ బోటనీ/ జువాలజీ/ పీజీడీఐఎఫ్‌ఏటీ లేదా బీటెక్‌ కెమికల్‌/ బయో టెక్నాలజీ/ ఫుడ్‌/ అగ్రి బయోటెక్‌ వీటిలో ఏదైనా కోర్సు పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి రెండేళ్లు. 

పీజీ డిప్లొమా..

షుగర్‌ టెక్నాలజీ: బీఎస్సీ షుగర్‌ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎంపీసీ లేదా బీటెక్‌ కెమికల్‌/ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు అర్హులు. కోర్సు వ్యవధి రెండున్నరేళ్లు. 

షుగర్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ: కోర్సు వ్యవధి 18 నెలలు. బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎల్రక్టానిక్స్‌ కోర్సులు చదివినవారు అర్హులు. బీటెక్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలక్ట్రికల్‌/ ఎల్రక్టానిక్స్‌/ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

షుగర్‌ ఇంజినీరింగ్‌: బీటెక్‌ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ కెమికల్‌ చదివినవారు అర్హులు. కోర్సు వ్యవధి 18 నెలలు.  

ఇండస్ట్రియల్‌ ఫర్మెంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ: బీఎస్సీలో కెమిస్ట్రీ/ వైన్‌ టెక్నాలజీ/ బయోటెక్నాలజీ/ మైక్రో బయాలజీ/ ఆల్కహాల్‌ టెక్నాలజీ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి లేదా బీటెక్‌ బయోటెక్నాలజీ/ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివుండాలి. కోర్సు వ్యవధి 22 నెలలు. 

పీజీ సర్టిఫికెట్‌..

షుగర్‌ ఇంజినీరింగ్‌: మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ కెమికల్‌ డిప్లొమా చదివినవారు అర్హులు. పంచదార మిల్లులో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి. ఈ కోర్సు 12 నెలల వ్యవధితో అందిస్తున్నారు.  

షుగర్‌ మాన్యుఫ్యాక్చర్‌: బీఎస్సీ కెమిస్ట్రీ లేదా షుగర్‌ టెక్నాలజీ కోర్సు చదివినవారు అర్హులు. లేదా షుగర్‌ టెక్నాలజీ/ షుగర్‌ మాన్యుఫ్యాక్చర్‌/ కెమికల్‌ ఇంజినీరింగ్‌ వీటిలో ఏదైనా డిప్లొమా చదివినవారై ఉండాలి. అలాగే రెండేళ్ల పని అనుభవం అవసరం. కోర్సు వ్యవధి ఏడాది. సర్టిఫికెట్‌..

షుగర్‌ బాయిలింగ్‌: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు పంచదార పరిశ్రమలో రెండేళ్ల పని అనుభవం లేదా ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. కోర్సు వ్యవధి 6 నెలలు. 

జ్యూస్‌ సూపర్విజన్‌: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు పంచదార పరిశ్రమలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. కోర్సు వ్యవధి 6 నెలలు. 

ఈటీపీ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌: ఇంటర్‌తోపాటు పంచదార పరిశ్రమలో రెండేళ్ల పని అనుభవం అవసరం. కోర్సు వ్యవధి 6 నెలలు.  

దరఖాస్తుకు చివరి తేదీ: జులై 15   

వెబ్‌సైట్‌: https://www.vsisugar.com/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ‘పది’తో 1558 కేంద్ర కొలువుల భర్తీ

‣ పక్కా ప్రణాళికతోనే లక్ష్య సాధన

‣ టెస్ట్‌ సిరీస్‌ల సాధనే గెలుపు మార్గం!

‣ బీటెక్‌తో ఆర్మీలో కొలువులు

‣ క్లర్కు కొలువు సాధనకు ఉమ్మడి వ్యూహం!

‣ వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలే కీలకం

Posted Date: 08-07-2023


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌