• facebook
  • whatsapp
  • telegram

బీమా పథకాలను రూపొందిస్తారా?

యాక్చూరియల్‌ సైన్స్‌లోకి ఏసెట్‌ దారి   


మేటి అవకాశాలకు దారిచూపే కోర్సుల్లో యాక్చూరియల్‌ సైన్స్‌ ఒకటి. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఈ విభాగంలో ప్రవేశించవచ్చు. ఇందుకోసం యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏసెట్‌)లో అర్హత సాధించాలి. ఏడాదికి రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు...


బీమా, అనుబంధ రంగాలు, ఆర్థిక, మదింపు సంస్థల్లో ఉన్నత కెరియర్‌ ఆశించేవారు యాక్చూరియల్‌ సైన్స్‌తో తమ ఆశయాలను నెరవేర్చుకోవచ్చు. అంకెలపై ఆసక్తి, గణితంపై పట్టు, తర్క పరిజ్ఞానం ఉన్నవారు ఈ కోర్సులో రాణించగలుగుతారు. ప్రస్తుతం ఈ కోర్సు పూర్తిచేసుకున్నవారి సంఖ్య చాలా పరిమితంగా ఉంది. అందువల్ల ఇందులో రాణించినవారు ఆకర్షణీయ వేతనంతో, విశ్వవ్యాప్తంగా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. బీమా పాలసీలు, ఎంప్లాయీ బెనిఫిట్, సోషల్‌ సెక్యూరిటీ, పెన్షన్‌ బెనిఫిట్, ప్రభుత్వ స్కీమ్‌లు, ఇన్వెస్ట్‌మెంట్లు... మొదలైనవాటికి ప్రమాణాలు, ప్రీమియం నిర్ణయించడంలో వీరే కీలకం. మనం తీసుకుంటున్న అన్ని రకాల బీమాలకూ ప్రీమియం నిర్ణయించేది యాక్చూరియల్‌ నిపుణులే. ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అంచనా, ప్రమాదం..అన్నీ విశ్లేషించి బీమా, ఆర్థిక పథకాలకు వీరు తుది రూపమిస్తారు. 


ప్రవేశపరీక్ష ఇలా..


ఏసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో 70 ప్రశ్నలు వస్తాయి. 


ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున సెక్షన్‌-ఎలో 45 ప్రశ్నలు అడుగుతారు. 


సెక్షన్‌ బిలో 20 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నకు రెండేసి మార్కులు కేటాయించారు. 


సెక్షన్‌ సిలో 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోదానికి 3 మార్కులు. 


సబ్జెక్టులవారీగా చూస్తే ప్రశ్నపత్రంలో.. మ్యాథ్స్‌కు 30, స్టాటిస్టిక్స్‌కు 30, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు 15, ఇంగ్లిష్‌కు 15, లాజికల్‌ రీజనింగ్‌కు 10 మార్కులు కేటాయించారు. రుణాత్మక మార్కులు లేవు. పరీక్షలో అర్హత సాధించడానికి కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. 


ఈ పరీక్షకు సిలబస్, చదవాల్సిన పుస్తకాలు వెబ్‌సైట్ల్‌ో పొందుపర్చారు. స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటవుతుంది. ఈ వ్యవధిలోగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చురీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఐ)లో సభ్యత్వాన్ని పొందవచ్చు. ఇలా చేరినవారు యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులో వివిధ పేపర్లను పూర్తిచేసుకోవడానికి వీలవుతుంది.  


13 పేపర్లు...


ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారు యాక్చూరీ ఫెలో కావడానికి వివిధ దశల్లో 13 పేపర్లు పూర్తిచేయాలి. స్టేజ్‌ 1 కోర్‌ ప్రిన్సిపల్స్‌లో 7, స్టేజ్‌ 2 కోర్‌ ప్రాక్టీసెస్‌లో 3 పేపర్లు అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. ఈ రెండు దశలనూ పూర్తిచేసినవారిని అసోసియేట్‌గా పరిగణిస్తారు. స్టేజ్‌ 3 స్పెషలిస్ట్‌ ప్రిన్సిపల్స్‌లో 8 పేపర్లు ఉంటాయి. వీటిలో నచ్చిన రెండింటిని ఎంపిక చేసుకుని పూర్తిచేయాలి. స్టేజ్‌ 4 స్పెషలిస్ట్‌ అడ్వాన్స్‌డ్‌లో ఏదైనా ఒక పేపర్‌ పూర్తిచేయాలి. నాలుగు దశలూ (13 పేపర్లు) పూర్తిచేసుకుంటే ఫెలోగా వ్యవహరిస్తారు. వీటిలో స్టేజ్‌-1 పాసైనా అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. 


మొత్తం 13 పేపర్లూ పూర్తిచేసుకున్నవారు ఉద్యోగిగా సుమారు రూ.5 లక్షల వేతనం అందుకోవచ్చు. వీరికి ఇన్సూరెన్స్, రీ ఇన్సూరెన్స్, ఫైనాన్స్, అకడమిక్, రెగ్యులేటరీ.. తదితర సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.


అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.


రిజిస్ట్రేషన్లు: ఫిబ్రవరి 17, 2023 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు


పరీక్ష తేదీ: మార్చి 18.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.


ఫలితాలు: మార్చి 28న ప్రకటిస్తారు.


వెబ్‌సైట్‌: https://actuariesindia.org/

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక అధికారులు

‣ ఆవిష్కరణల అధ్యయనానికీ కోర్సులు!

‣ కుదిరిన వేళల్లో కాస్త సంపాదించుకుంటారా?

‣ కాపీ కొట్టాలని ఎందుకు అనిపిస్తుందంటే?

‣ టెన్త్‌ పాసైతే సాయుధ దళాల్లోకి స్వాగతం!

‣ ‘క్రిటికల్‌’ అంటే నిజంగా క్రిటికల్‌ కాదు!

‣ దివ్య జీవనానికి దృఢమైన ఆసరా!

‣ ఐఐటీ ముంబయి... టాప్‌!

Posted Date: 25-11-2022


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌