• facebook
  • whatsapp
  • telegram

ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లోకి ఆహ్వానం

కొన్ని కట్టడాలు చూడగానే ఆకట్టుకుని, కళ్లు తిప్పనీయవు. ప్రస్తుతం నిర్మాణాలు శరవేగంగా విస్తరిస్తూ, ఆధునిక హంగులతో ఆకర్షణీయంగా రూపొందుతున్నాయి. వీటి వెనుక ఆర్కిటెక్చర్ల సృజనాత్మకత దాగి ఉంది. భారీ స్థాయి కట్టడాలకు వీరి సేవలే కీలకం. ఈ విభాగంలో ఆసక్తి ఉన్నవారి కోసం యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో కోర్సులు ఉన్నాయి. వీటిని చాలా సంస్థలు అందిస్తున్నాయి. వాటిలో న్యూదిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (స్పా) ముఖ్య సంస్థగా చెప్పుకోవచ్చు. అందులో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.

స్పా, న్యూదిల్లీలో బ్యాచిలర్‌ స్థాయిలో 2, పీజీలో 10 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సులు ఈ సంస్థ అందిస్తోంది. వీటిలో ప్రవేశం జేఈఈ మెయిన్‌తో లభిస్తుంది. మాస్టర్, డాక్టొరల్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో ఉంటాయి. పీజీ కోర్సుల వ్యవధి రెండేళ్లు. గేట్, సీడ్‌లో అర్హత సాధించినవారికి స్కాలర్‌షిప్‌ అందుతుంది.

కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌

స్పెషలైజేషన్లు: ఆర్కిటెక్చరల్‌ కన్జర్వేషన్, అర్బన్‌ డిజైన్, ల్యాండ్‌ స్కేప్‌ ఆర్కిటెక్చర్‌

అర్హత: ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి.

కోర్సు: మాస్టర్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: ఆర్కిటెక్చర్, సివిల్, కన్‌స్ట్రక్షన్‌ విభాగాల్లో ఎందులోనైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి.

కోర్సు: మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌

స్పెషలైజేషన్లు: ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్, హౌసింగ్, రీజనల్‌ ప్లానింగ్, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్, ఆర్బన్‌ ప్లానింగ్‌.

అర్హత: ప్లానింగ్, ఆర్కిటెక్చర్, సివిల్‌ ఎందులోనైనా బ్యాచిలర్‌ డిగ్రీ లేదా జాగ్రఫీ, ఎకనామిక్స్, సోషియాలజీల్లో ఎందులోనైనా మాస్టర్‌ డిగ్రీ. ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్లానింగ్‌కు ప్లానింగ్‌ ఆర్కిటెక్చర్, సివిల్‌.. ఎందులోనైనా బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఆపరేషన్స్‌ రిసెర్చ్‌ల్లో ఎందులోనైనా పీజీ.

కోర్సు: ఫుల్‌టైమ్‌ డాక్టొరల్‌ ప్రోగ్రామ్‌లు

అర్హత: ప్లానింగ్, ఆర్కిటెక్చర్‌ ఎందులోనైనా 60 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 55 శాతం ఉండాలి. గేట్, జేఆర్‌ఎఫ్, సీడ్‌ వీటిలో ఏదైనా స్కోర్‌ ఉండాలి.

ప్రవేశం: పరీక్షలో చూపిన ప్రతిభ, వైవా, పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మార్చి 28

దరఖాస్తు ఫీజు: రూ.2500

వెబ్‌సైట్‌: http://spa.ac.in/Home.aspx?ReturnUrl=%2f
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆన్‌లైన్‌ ఆటలు... కొలువులు కొల్లలు

‣ పొరపాట్లు సవరిస్తూ... ఒత్తిడిని ఓడిస్తూ!

‣ ఇంట‌ర్‌లో మంచి మార్కుల‌కు ఇవిగో మెల‌కువ‌లు!

‣ పరిధి పెద్దదైనా పట్టు పట్టొచ్చు!

‣ ఐటీఐతో నౌకాదళంలోకి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 08-03-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌