• facebook
  • whatsapp
  • telegram

ఎల్‌శాట్ ఇండియా


అమెరికాలో లా కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించే 'లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ మనదేశంలోని లా స్కూళ్లకు కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. 'లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్- ఇండియా (LSAT- India). ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో స్కోరు ఆధారంగా మనదేశంలోని విద్యాసంస్థల్లో న్యాయశాస్త్రంలో బ్యాచిలర్, పీజీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ప్రస్తుతం మనదేశంలో దాదాపు 20 సంస్థలు ఎల్‌శాట్ స్కోరును ఆమోదిస్తున్నాయి. వీటిలో ఐఐటీ ఖరగ్‌పూర్, జిందాల్ లా స్కూల్, యూపీఈఎస్ లాంటి ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి.

   మనదేశంలోని ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాలు లా కోర్సుల్లో ప్రవేశానికి 'క్లాట్‌ను నిర్వహిస్తున్నాయి. లా యూనివర్సిటీలకు అనుబంధం కాని అనేక కాలేజీల్లో ప్రవేశాల కోసం 'ఎల్‌శాట్ ఇండియా రూపొందించారు. అమెరికా, కెనడాల్లోని లా స్కూళ్లలో ప్రవేశానికి నిర్వహించే ఎల్‌శాట్‌కు, ఎల్‌శాట్- ఇండియాకు సంబంధం లేదు. ఎల్‌శాట్ ఇండియా ద్వారా మనదేశంలోని సంస్థల్లో మాత్రమే ప్రవేశం లభిస్తుంది. ఈ పరీక్ష ఆధారంగా కింది ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ పొందవచ్చు...
* ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్ బీఏ-ఎల్ఎల్‌బీ
* మూడేళ్ల ఎల్ఎల్‌బీ
¤* రెండేళ్ల ఎల్ఎల్.ఎం. ప్రోగ్రామ్

పరీక్ష విధానం 
   ఎల్‌శాట్- ఇండియా పేపర్-పెన్సిల్ ఆధారిత పరీక్ష. పరీక్ష వ్యవధి 2 గంటల 35 నిమిషాలు (15 నిమిషాల విరామంతో కలిపి). ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటాయి. మొత్తం నాలుగు సెక్షన్‌లు ఉంటాయి. రెండు సెక్షన్‌లలో లాజికల్ రీజనింగ్ సంబంధిత ప్రశ్నలు, మిగతా సెక్షన్‌లలో ఎనలిటికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు 35 నిమిషాల సమయం ఇస్తారు. 2, 3 సెక్షన్‌ల మధ్యలో 15 నిమిషాల విరామం ఉంటుంది.
ఎల్‌శాట్ ఇండియా ప్రాక్టీస్ టెస్ట్, మాదిరి ప్రశ్నలు ఎల్‌శాట్ ఇండియా అధీకృత వెబ్‌సైట్ www.pearsonvueindia.com లో లభిస్తాయి. నెగటివ్ మార్కింగ్ లేదు. ఎల్‌శాట్ - ఇండియా ఆధారంగా లా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తోన్న సంస్థలు...
సెంట్రల్ ఇండియా కాలేజ్ ఆఫ్ లా, నాగ్‌పూర్
కాలేజ్ ఆఫ్ లీగల్ స్టడీస్, యూపీఈఎస్, డెహ్రాడూన్
ఫ్యాకల్టీ ఆఫ్ లా, ఇక్ఫాయ్ యూనివర్సిటీ
జిందాల్ గ్లోబల్ లా స్కూల్, హర్యానా
జేఎస్ఎస్ లా కాలేజ్, మైసూర్
కె.ఎల్.ఇ. సొసైటీస్ లా కాలేజ్, బెంగళూరు
ఎంఏటీఎస్ లా స్కూల్, ఎంఏటీఎస్ యూనివర్సిటీ, రాయ్‌పూర్
రాజీవ్‌గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, ఐఐటీ ఖరగ్‌పూర్
సవీతా స్కూల్ ఆఫ్ లా
దుర్గాపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్, దుర్గాపూర్
డాక్టర్ మిలింద్ యెర్న్ కాలేజ్ ఆఫ్ లా, భాంద్రా
హాల్దియా లా కాలేజ్, మిడ్నాపూర్
ఐఎంఎస్ లా కాలేజ్, డెహ్రాడూన్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ లా అండ్ రిసెర్చ్, ఫరీదాబాద్
జగన్ నాధ్ యూనివర్సిటీ, జైపూర్
జైహింద్ డిఫెన్స్ కాలేజ్ ఆఫ్ లా, బర్కతుల్లా యూనివర్సిటీ
సర్దార్ పటేల్ సుభర్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ లా
సిద్ధార్థ లా కాలేజ్, ఉత్తరాఖండ్
టాగూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లా, జైపూర్
వైకుంఠ బలిగా కాలేజ్ ఆఫ్ లా, ఉడుపి
    ఎల్‌శాట్ ఇండియా స్కోరును ఆయా సంస్థలు ప్రాథమిక స్క్రీనింగ్‌కు ఉపయోగిస్తాయి. కోర్సుల స్వభావాన్ని బట్టి ఇతర అర్హతలు కూడా ఉంటేనే ప్రవేశం లభిస్తుంది. ఆయా సంస్థల ప్రవేశ నిబంధనలు వాటి వెబ్‌సైట్‌లలో లభిస్తాయి.

 

రిజిస్ట్రేషన్ విధానం 
   ఎల్‌శాట్ ఇండియా పరీక్షకు ఆన్‌లైన్‌లో మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి ప్రాక్టీస్ టెస్ట్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనరాష్ట్రంలో పరీక్ష కేంద్రం హైదరాబాద్‌లో ఉంది.
   ఎల్‌శాట్‌కు ఉపయోగపడే అధీకృత పుస్తకం: The Official LSAT - India Handbook (Published by Law School Admission Council)

 

Posted Date: 03-10-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌