• facebook
  • whatsapp
  • telegram

జాబ్‌ మార్కెట్‌లో ఏఐ జోరు!

స్కిల్స్‌ పెంచుకుంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలో డిమాండ్‌


ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాణించాలంటే ఏఐ నైపుణ్యాలు తప్పనిసరి. నిత్యం వీటిని మెరుగుపరుచుకుంటూనే ఉండాలి. అయితే రానున్న రోజుల్లో ఏయే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీలు జాబ్‌ మార్కెట్‌ను ఏలబోతున్నాయో తెలుసా? దీనికోసమే ఉద్యోగ కల్పన సంస్థ ఇండీడ్‌ ఓ పరిశీలన చేసింది.


పెరుగుతున్న ఏఐ టెక్నాలజీతో.. సంస్థలు ఉద్యోగార్థుల నుంచి ఆశించే నైపుణ్యాల్లో దీనికి సంబంధించిన స్కిల్స్‌ ఎక్కువగా ఉంటున్నాయి. అంటే వీటిని నేర్చుకోవడం ద్వారా వేగంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. రాబోయే కాలంలో బాగా డిమాండ్‌ ఉండబోయే ఏఐ టెక్నాలజీలు ఏమిటో ఇండీడ్‌ వెల్లడించింది. వచ్చే 1-5 సంవత్సరాల్లో ఈ టెక్నాలజీల్లో రాణించిన వారికి ఉద్యోగాలకు ఢోకా ఉండదని అది అభిప్రాయపడింది. ఇందులో ప్రముఖంగా 42 శాతం జనరేటివ్‌ ఏఐలో లభించబోయే ఉద్యోగాలు.. మొత్తం మెషిన్‌ లెర్నింగ్‌కు సంబంధించినవి అయ్యుంటాయని అంచనా వేసింది. 

భారత్‌లో 2027 నాటికి ఏఐ మార్కెట్‌ విలువ 17 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ఏటికేడు దాదాపు 25 నుంచి 35 శాతం పెరుగుదలతో ముందుకు వెళ్తోంది. ఇంతగా ప్రాముఖ్యం పెరుగుతున్న ఏఐకి సంబంధించి.. ఉద్యోగార్థులు మరిన్ని నైపుణ్యాలు సంపాదించడంపై దృష్టి పెట్టాల్సిందిగా ఇండీడ్‌ చెబుతోంది.

మెషిన్‌ లెర్నింగ్‌ మాదిరిగానే..  రిక్రూటర్లు 40శాతం వరకూ పైతాన్‌ స్కిల్స్‌ కావాలని కోరుతున్నారు. ఏఐ కోర్‌ స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు కూడా అధిక డిమాండ్‌ ఉంటోంది. ఈ నివేదిక ఇండియన్‌ జాబ్‌ మార్కెట్‌లో ఏఐ స్కిల్స్‌కు ఉన్న బలీయమైన గిరాకీ గురించి తెలియజేస్తుంది.

ఇందువల్ల ఏఐకు సంబంధించిన అంశాల్లో నైపుణ్యాలు పెంచుకోవడం ఇండియన్‌ జాబ్‌ మార్కెట్‌లో ఉద్యోగం కావాలి అనుకునేవారికి చాలా అవసరం. డిమాండ్‌లో ఉన్న ఈ స్కిల్స్‌ నేర్చుకోవడం ద్వారా.. నచ్చిన ఉద్యోగం పొందే వీలుంటుంది!
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

‣ క్లర్కు నుంచి కలెక్టర్‌ వరకూ..!

Posted Date: 17-07-2024


 

కోర్సులు