• facebook
  • whatsapp
  • telegram

ఐఐఎం నుంచి.. ఐపీఎం, ఐపీఎల్!

లా, మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల 

తొలిసారి న్యాయవిద్యలో ఇంటిగ్రేటెడ్ కోర్సు

మేనేజ్మెంట్ కోర్సులకు పెట్టింది పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ (ఐఐఎం). దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈ సంస్థ కేంద్రాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఐఐఎంలు ఏటా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ ఎఫ్) ప్రకటించే మేటి మేనేజ్మెంట్ సంస్థలజాబితాలో మొదటి వరుసలో ఉంటాయి. అత్యుత్తమ బోధన, అధునాతన సౌకర్యాలు, పూర్వ విద్యార్థుల ప్రతిభ, వారికి ఉన్నత సంస్థల్లో ప్లేస్మెంట్లు, భారీగా వేతనాలు తదితర అంశాలు ఇక్కడ చేరే విద్యార్థులను ఆకర్షిస్తాయి. ఇలాంటి సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి పోటీ తీవ్రంగానే ఉంటుంది. తాజాగా ఐఐఎం-రోహ్తక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం), ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ లా (ఐపీఎల్) కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ లా (ఐపీఎల్)

ఐఐఎం-రోహ్తక్ ఈ కోర్సును కొత్తగా  ప్రారంభించింది. వ్యవధి అయిదేళ్లు. ఇందులో చేరాలంటే కనీసం 60శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధిస్తే చాలు. 31 జులై 2021 నాటికి ఇంటర్మీడియట్/హెచ్ఎస్సీ పూర్తి చేసే విద్యార్థులు  కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. వయసు 31 జులై 2021 నాటికి 20 ఏళ్లు మించకూడదు. భారత ప్రభుత్వం నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. మొత్తం ఐదేళ్లకు అకడమిక్ ఫీజు రూ.37,62,000 ఉంటుంది. ఇతర ఖర్చులు అదనం.

ఎంపిక విధానం

కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో అభ్యర్థులు సాధించిన స్కోరు ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారిని షార్ట్లిస్ట్ చేస్తారు. వారి గత అకడమిక్స్, క్లాట్-2021 స్కోరును బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ చేస్తారు. అకడమిక్స్, జనరల్ అవేర్నెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ పరిశీలిస్తారు. క్లాట్శాతం, పర్సనల్ ఇంటర్వ్యూ-15 శాతం, గత అకడమిక్స్శాతం వెయిటేజీ ఉంటుంది. వీటిని బట్టి తుది మెరిట్ జాబితా రూపొందించి ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు ఇలా...

అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  చివరి తేదీ 31 మే 2021. దరఖాస్తు రుసుము రూ.3,890 చెల్లించాలి. 

ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం)

ఈ కోర్సు వ్యవధి అయిదేళ్లు. ఏడాదికి మూడు చొప్పున మొత్తం 15 టర్మ్ లు ఉంటాయి. కోర్సు పూర్తి చేసిన వారు ఐఐఎం రోహ్తక్ ఎంబీఏతోపాటు బీబీఏ డిగ్రీ పట్టా పొందుతారు. ఇందులో చేరాలంటే కనీసం 60శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్/హెచ్ఎస్సీ ఉత్తీర్ణతసాధించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధిస్తే చాలు. 31 జులై 2021 నాటికి ఇంటర్మీడియట్/హెచ్ఎస్సీ పూర్తి చేసే విద్యార్థులు  కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. వయసు 31 జులై 2021 నాటికి 20 ఏళ్లు మించకూడదు. భారతప్రభుత్వం నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. అయిదేళ్ల అకడమిక్ ఫీజు రూ.30,51,000 ఉంటుంది. ఇతర ఖర్చులు అదనం.

ఎంపిక ఇలా..

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఐపీఎం ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇందులో అకడమిక్స్, జనరల్ అవేర్నెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ పరిశీలిస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ 45శాతం, పర్సనల్ ఇంటర్య్వూ 15శాతం, గత అకడమిక్స్ 40శాతం వెయిటేజీ ఉంటుంది. దాన్ని బట్టి తుది ఎంపికలు ఉంటాయి. 

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. తుది గడువు 4 మే 2021. 

పరీక్ష ఇలా..

ఐపీఎం ఆప్టిట్యూడ్ టెస్ట్ను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నల చొప్పున మొత్తం 120 ప్రశ్నలుంటాయి. సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు ఉంటుంది. 

ప్రిపరేషన్ విధానం

క్వాంటిటేటివ్ ఎబిలిటీ

ఈ విభాగంలో అరిథ్మెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, నంబర్ సిస్ట్మ్, ఆవెరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ స్పీడ్& డిస్టెన్స్, క్వాడ్రాటిక్ అండ్ లైనియర్ ఈక్వేషన్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికి సంబంధించి సాధన చేస్తే సమాధానాలు గుర్తించడం సులభం.

లాజికల్ రీజనింగ్

ఇందులో గమ్మత్తయిన ప్రశ్నలు ఇచ్చి అభ్యర్థుల తార్కిక ఆలోచన విధానాన్ని పరిశీలిస్తారు. ప్యాసేజ్ ఇచ్చి అందులో నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే వీలైనంత ఎక్కువ సాధన చేయాలి. క్రిటికల్ రీజనింగ్, సిలోజియం, కోర్స్ ఆఫ్ యాక్షన్, స్ట్రాంగ్వీక్ ఆర్గుమెంట్స్, డేటా సఫిషియన్సీ, అరేంజ్మెంట్స్, కోడింగ్డీకోడింగ్, వెర్బల్, నాన్ వెర్బల్ విభాగాల నుంచి ప్రశ్నలడుగుతారు. అనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్ కంప్లేషన్, లాజికల్ డిడక్షన్, చార్ట్ లాజిక్, పాటెర్న్ పర్సెప్షన్, పేపర్ కటింగ్ ఇతర అంశాలు ఉంటాయి. 

వెర్బల్ ఎబిలిటీ

ఇంగ్లిష్ గ్రామర్పై పట్టు ఉంటే ఇందులో సులభంగా మార్కులు సాధించవచ్చు. గ్రామర్, ఒకాబులరీ, పారా జంబుల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కాంప్లెషన్, వర్డ్ మీనింగ్, సిననిమ్స్, ఆంటెనిమ్స్, ఎడిటింగ్, ఒమీటింగ్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కాంప్రహెన్షన్ ప్యాసేజీలో ముందుగా ప్రశ్నలను చదివి, గుర్తుంచుకుని తర్వాత ప్యాసేజీలో ఇచ్చిన సమాచారాన్ని చదివితే అవసరమైన సమాచారమేదో గుర్తించడం సులభంగా ఉంటుంది.  వీటిపై దృష్టి పెట్టాలంటే నిత్యం తప్పకుండా ఆంగ్ల పత్రికలు చదవాలి. 

ముఖ్యమైన తేదీలు

 ఐపీఎం ఆప్టిట్యూడ్ టెస్ట్: జూన్ 12, 2021 

 పర్సనల్ ఇటర్వ్యూ: జులై నాలుగో వారం, 2021

 తుది ఎంపికల ప్రకటన: ఆగస్టు రెండో వారం, 2021

వెబ్సైట్: https://www.iimrohtak.ac.in/
 

Posted Date: 25-03-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌