• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక వసతులు అత్యుత్తమ బోధన!

ప్రేమ్‌జీ వర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల

ఉన్నత ఆశయాలతో ఏర్పాటైన విద్యాసంస్థల్లో అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఒకటి.  విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంచే లక్ష్యంతో దీన్ని నెలకొల్పారు. అందుకు అనుగుణంగానే కోర్సులనూ రూపొందించారు. ఈ సంస్థలో బీఏ, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్, ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూలతో అవకాశం  కల్పిస్తారు. సీటు పొందినవారు పూర్తి ఉచితం లేదా రాయితీతో చదువుకోవచ్చు.  

నాణ్యమైన విద్యను అందించి, విద్యార్థులను మేటి మానవ వనరులుగా రూపొందించడానికి అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. నిష్ణాతులైన బోధన సిబ్బంది, ఆధునిక వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం అన్నింటి మేళవింపుతో బెంగళూరులో ఈ విద్యాసంస్థ ఏర్పాటైంది. సైన్సెస్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, న్యాయవిద్య, బోధన రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ సంస్థలో చదవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అన్ని కోర్సుల విద్యార్థులకూ ఉమ్మడి కరిక్యులమ్‌తోపాటు, ప్రతి కోర్సులోనూ మేజర్‌ (కంపల్సరీ), ఎలెక్టివ్‌లు ఉంటాయి. ఎంపికైనవారికి జులై నుంచి తరగతులు మొదలవుతాయి. వీటిని ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ విధానంలో అందిస్తున్నారు. 

యూజీలో... 

బీఏ: ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిస్టరీ (మూడేళ్లు)

బీఎస్సీ: ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ (మూడేళ్లు) బీఎస్సీ బీఎడ్‌: బయాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ (నాలుగేళ్లు)

అర్హత: సంబంధిత గ్రూప్‌లో 50 శాతం మార్కులతో 2021లో ఇంటర్‌ ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారై ఉండాలి. వయసు: 19 ఏళ్లలోపు ఉండాలి. 

పీజీలో... 

ఎంఏ: ఎడ్యుకేషన్, డెవలప్‌మెంట్, పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, ఎకనామిక్స్‌ (రెండేళ్లు)

ఎల్‌ఎల్‌ఎం: లా అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఏడాది వ్యవధి కోర్సు)

అర్హత: ఎకనామిక్స్‌ కోర్సుకు డిగ్రీలో ఆ సబ్జెక్టును చదివుండాలి. మిగిలిన వాటికి ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నా అర్హులే. ఎల్‌ఎల్‌ఎం: లా అండ్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులోకి ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం విద్యార్థులు అర్హులు.

పరీక్ష ఇలా...

యూజీ: బీఏ, బీఎస్సీ, బీఎస్సీ-బీఎడ్‌ అన్ని కోర్సులకూ ఉమ్మడిగానే పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఆబ్జెక్టివ్‌ విభాగంలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. 2 గంటల వ్యవధి. ప్రతి సరైన జవాబుకూ 2 మార్కులు ఉంటాయి. తప్పుగా గుర్తించినదానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. మరో విభాగంలో ఎస్సే రైటింగ్‌/ డేటా ఎనాలిసిస్‌/ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ల్లో ఒక వ్యాసరూప ప్రశ్న వస్తుంది. అభ్యర్థి ఎంచుకున్న కోర్సుపై ఆధారపడి ఆ విభాగానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం రాయాలి. వ్యవధి 45 నిమిషాలు. 

పీజీ: ఎకనామిక్స్‌ మినహా మిగిలిన ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు అన్నింటికీ పరీక్ష ఉమ్మడిగానే ఉంటుంది. ఇందులో 2 విభాగాలు ఉంటాయి. పార్ట్‌-1లో బహుళైచ్ఛిక ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ 15, జనరల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 15, సోషల్‌ అవేర్‌నెస్‌ 10 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌ -2లో అభ్యర్థి ఎంచుకున్న కోర్సుకు సంబంధించి ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. ఈ విభాగం వ్యవధి ఒక గంట. ఎంఏ ఎడ్యుకేషన్‌ ఎంచుకున్నవారికి పార్ట్‌ 2 ప్రత్యేకంగా ఉంటుంది. దీని వ్యవధి 45 నిమిషాలు. ఎంఏ ఎకనామిక్స్‌ అభ్యర్థులకు పార్ట్‌ ఎలో ఆ సబ్జెక్టుకు చెందిన 40 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు. వీటిని 2 గంటల్లో పూర్తిచేయాలి. రెండో పార్ట్‌లో గంట వ్యవధిలో వ్యాసం రాయాలి. 

ఫీజు: బీఏ, బీఎస్సీ, బీఎస్సీ-బీఎడ్‌ ఏ కోర్సులో చేరినా తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4 లక్షలలోపు ఉంటే పూర్తి ఫీజు మినహాయింపు లభిస్తుంది. వసతి కూడా ఉచితమే. రూ.4 - 8 లక్షల లోపు ఉంటే 75 శాతం, 8 - 10 లక్షల మధ్య 50 శాతం, 10 - 15 లక్షల మధ్య ఉన్నవారికి 25 శాతం ఫీజు, వసతిలో రాయితీ లభిస్తుంది. పీజీ అన్ని కోర్సులకూ రూ.2 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు చెందినవాకి పూర్తి మినహాయింపు లభిస్తుంది. 2 నుంచి 4 లక్షల లోపు ఉంటే 75 శాతం, 4 - 6 మధ్య ఉన్నవారికి 50 శాతం, 6 - 7 మధ్య ఉంటే 25 శాతం ఫీజు తగ్గిస్తారు. రుణ సౌకర్యం ఉంది. మూడేళ్ల యూజీ కోర్సులకు ట్యూషన్, వసతి మొత్తం ఫీజు సుమారు రూ.9 లక్షలు. అదే నాలుగేళ్ల కోర్సులకైతే రూ.12 లక్షలు. రెండేళ్ల పీజీ కోర్సులకు ఫీజు, వసతి నిమిత్తం మొత్తం రూ.3.68 లక్షలు చెల్లించాలి. ఎల్‌ఎల్‌ఎంకు రూ.1.84. అన్ని కోర్సులకు ఆహారానికి నెలకు రూ. 5000 నుంచి 6000 వరకు వెచ్చించాలి.

ఉపాధి అవకాశాలు

ఈ సంస్థలో చదువుకున్న దాదాపు అందరు విద్యార్థులూ ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారు. పలు కంపెనీలు కోర్సు చివర్లో నియామకాలు చేపడతున్నాయి. ఇక్కడ పీజీ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ఎడ్‌ కోర్సులు చదివినవారికి రూ.30 నుంచి 35 వేల నెల వేతనంతో పలు సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. అనుభవం ఉన్నవారికి ఇంతకంటే పెద్దమొత్తమే వెచ్చిస్తున్నాయి. 

ఈ సంస్థ ఆన్‌లైన్‌లో డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్‌ ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్, పీజీ డిప్లొమా ఇన్‌ డెవలప్‌మెంట్‌ లీడర్‌షిప్‌ కోర్సులను అందిస్తోంది. 

దరఖాస్తుకు చివరి తేదీ: పీజీ కోర్సులకు ఫిబ్రవరి 28. యూజీ కోర్సులకు ఏప్రిల్‌ 30

పరీక్షలు: పీజీ కోర్సులకు మార్చి 13న, యూజీ కోర్సులకు మే నెలలో.  

వెబ్‌సైట్‌: https://azimpremjiuniversity.edu.in 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఐటీ సంస్థల్లో ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాల జోరు!

‣ క్యాంపస్‌ కొలువు కొట్టాలంటే?

‣ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లకు సిద్ధమేనా?

‣ నిరుద్యోగులకు రైల్వే ఉచిత శిక్షణ

‣ మర్యాదలకూ మేనేజర్లు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 23-02-2022


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌