• facebook
  • whatsapp
  • telegram

క్లౌడ్‌ నిపుణులకు గిరాకీ!

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఆన్‌లైన్‌లో దొరికే అతిపెద్ద స్పేస్‌ లేదా సమాచార కేంద్రం. దీన్ని ఉపయోగించి ఎప్పుడైనా, ఎక్కడ్నుంచైనా ఇంçర్నెట్‌ ద్వారా తేలికగా యాక్సెస్‌ పొందొచ్చు. ఇప్పుడు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వల్ల క్లిష్టమైన పని కూడా సులువైపోయింది. ఈ టెక్నాలజీతో ఎటువంటి సాఫ్ట్‌వేర్‌నూ ఇన్‌స్టాల్‌ చేయకుండానే నేరుగా సేవలను పొందొచ్చు. గతకొద్ది కాలంగా మార్కెట్లో ఈ నిపుణులకు గిరాకీ పెరుగుతోంది!  

‘క్లౌడ్‌’ అంటే ఇంటర్నెట్‌ను సూచించేది. ‘కంప్యూటింగ్‌’ అంటే కంప్యూటర్‌ మీద పనిచేసేదని అర్థం. ఈ కంప్యూటింగ్‌ సేవలన్నింటిని కంప్యూటర్‌ అనుసంధానిత సిస్టమ్‌ ద్వారా కాకుండా ఇంçర్నెట్‌ సిస్టమ్‌ ద్వారా చేయడాన్నే ‘క్లౌడ్‌ కంప్యూటింగ్‌’ అంటున్నాం. ప్రస్తుతం దీనిపై పనిచేసే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ నిపుణులకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ఇది డేటాను నిల్వ చేయడం మొదలు సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టలేషన్, డేటా ఎనలిటిక్స్‌ వంటి సేవలకు ఎంతో ఉపయోగపడుతుంది. 

కేవలం ఐటీ నెట్‌వర్కింగ్‌ కోసమే కాక ఇతర వ్యాపార అవసరాల్లోనూ ఈ థర్డ్‌పార్టీ సేవల్ని వినియోగిస్తున్నారు. కాకపోతే ఇంటర్నెట్‌ను ఉపయోగించి వాడే కంప్యూటింగ్‌ అప్లికేషన్లకు కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడే మన సమాచారం భద్రంగా ఉంటుంది. త్వరలోనే ఇండియా క్లౌడ్‌ సొల్యూషన్స్‌కు గ్లోబల్‌ హబ్‌గా మారనుంది. ప్రముఖ ఐటీ సంస్థలు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వల్ల భవిష్యత్తు ప్రయోజనాలను ముందుగానే గుర్తించి ఈ సేవల్ని వినియోగించుకుంటున్నాయి. మీకు కావాల్సిన సమాచార వనరుల్ని సేకరించడం, నిల్వ చేయడం, కంప్యూట్‌ చేయడంలాంటి అన్ని సేవలను ఇది అందిస్తుంది. సాధారణ కంప్యూటర్‌ నుంచైనా ఈ క్లౌడ్‌ సేవలను పొందొచ్చు.

డిమాండ్‌ ఏ మేరకు: నాస్కామ్‌ 2025 నాటికి భారత్‌కు 20 లక్షల క్లౌడ్‌ నిపుణుల అవసరముందని అంచనా వేసింది. ఇప్పుడు 14 నుంచి 15 లక్షల మంది క్లౌడ్‌ నిపుణులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఏయే కోర్సులు: డిప్లొమా, పీజీ డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్స్‌తోపాటు ఇతర ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అందించే సంస్థలు: ఐఐటీ మద్రాసు, ఐఐటీ ఖరగ్‌పూర్, ఎన్‌ఐటీ తిరుచ్చి వంటి సంస్థలు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కాస్త బద్ధకం నేర్చుకోండి...

‣ చదువుకూ.. వ్యాయామం అవసరమే!

‣ ఆడుకుంటూ... నేర్చుకుంటూ!

‣ నాయకత్వ లక్షణాలకు పదునుపెట్టేలా..

‣ మెటా.. ఇక దీనిదే ఆట

‣ గణిత బోధనలో ఘనమైన సంస్థ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 30-03-2022


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌