‣ ఏఐఎంఏ నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా చాలా ప్రైవేటు విద్యాసంస్థలు మేనేజ్‌మెంట్ (ఎంబీఏ/ పీజీడీబీఏ) చదువులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు ఎన్నో పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోషియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్టు (మ్యాట్) అందులో ఒకటి. ఈ పరీక్షను ఏడాదికి నాలుగు సార్లు రాసుకోవచ్చు. ఇటీవల ఫిబ్రవరిలో నిర్వహించే మ్యాట్ ప్రకటన వెలువడింది. డిగ్రీ పూర్తైనవారితోపాటు ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కోరుతో దేశవ్యాప్తంగా 600కు పైగా సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి.
పరీక్షను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ల్లో కోరుకున్న విధానంలో రాసుకోవచ్చు. ఆసక్తి ఉంటే రెండు రకాలుగానూ ప్రయత్నించవచ్చు. రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్టు (ఐబీటీ), పేపర్ బేస్డ్ టెస్టు (పీబీటీ), పేపర్ బేస్డ్ టెస్టు అండ్ రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్టు (పీబీటీ+ఐబీటీ), కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ), కంప్యూటర్ బేస్డ్ టెస్టు అండ్ రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్టు (సీబీటీ+ఐబీటీ), పేపర్ బేస్డ్ టెస్టు అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్టు (పీబీటీ+సీబీటీ) వీటిలో నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆప్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (ఐపీఈ), ఆస్కీ, గీతం, చైతన్య, ధ్రువ, గురునానక్, విజ్ఞాన జ్యోతి, హెచ్‌బీఎస్, అరోరా, ఐఐఆర్‌ఎం, విశ్వవిశ్వానీ, ఐటీఎం, ఐసీబీఎం.. సంస్థలు మ్యాట్ స్కోర్‌తో ప్రవేశం కల్పిస్తున్నాయి. పరీక్షలో సాధించిన స్కోరు ఏడాదిపాటు చెల్లుతుంది. దేశవ్యాప్తంగా 50కు పైగా కేంద్రాల్లో పేపర్ బేస్డ్/ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తున్నారు.
ఇంటి నుంచే..
రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్టు (ఐబీటీ) విధానంలో ఇంటి నుంచే పరీక్ష రాసుకోవచ్చు. కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్, వెబ్ క్యామ్ ఉంటే సరిపోతుంది. ఈ విధానంలో పరీక్షలు ప్రతి రోజూ రెండు విడతల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. నచ్చిన తేదీ, సమయం ఎంచుకునే వెసులుబాటు అభ్యర్థులకు ఉంటుంది. రాయాలనుకున్న తేదీకి కనీసం 4 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష ఇలా
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, మ్యాథమెటికల్ స్కిల్స్, డేటా ఎనాలిసిస్ అండ్ సఫిషియన్సీ, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులున్నాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో లాంగ్వేజ్ కాంప్రహెన్షన్‌కు 30, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్‌కు 30, మ్యాథ్స్ స్కిల్స్‌కు 40, డేటా ఎనాలిసిస్ అండ్ సఫిషియన్సీకి 35, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్‌కు 15 నిమిషాల వ్యవధి కేటాయించారు. మాదిరి ప్రశ్నలు, మాక్ టెస్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
అర్హత: డిగ్రీ పూర్తిచేసినవాళ్లు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: అన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా.
ఫీజు: పేపర్/ ఆన్‌లైన్ ఏదో ఒక విధానంలో రాయడానికి రూ.1900. రెండు విధాలగానూ రాసుకోవడానికి రూ.3050
పీబీటీ పరీక్ష రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 14
సీబీటీ-1 పరీక్ష రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 21
పేపర్ ఆధారిత రాతపరీక్ష తేదీ: ఫిబ్రవరి 19
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 26
సీబీటీ-2 చివరి తేదీ: ఫిబ్రవరి 27
సీబీటీ-2 పరీక్ష తేదీ: మార్చి 4
తెలుగు రాష్ట్రాల్లో పేపర్, కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం
వెబ్‌సైట్: https://mat.aima.in/
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ డెకరేషన్లకు కొన్ని కోర్సులు!
‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!
‣ నిర్మాణ రంగంలో కొన్ని కోర్సులు!
‣ వచ్చేస్తున్నాయ్... వర్చువల్ ల్యాబ్స్!