• facebook
  • whatsapp
  • telegram

మేటి మేనేజ్‌మెంట్‌ సంస్థల్లోకి ‘మ్యాట్‌’

సెప్టెంబర్‌ 16న ప్రవేశ పరీక్ష



దేశంలోని విద్యాసంస్థల్లో ఎంబీఏ కోర్సు ప్రవేశానికి నిర్వహించే పరీక్షల్లో మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌) ఒకటి. దీన్ని ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తోంది. సెప్టెంబరు - 2023లో నిర్వహించే పరీక్షలకు ఇటీవల ప్రకటన వెలువడింది. డిగ్రీ పూర్తిచేసుకున్న, చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష స్కోరుతో దేశవ్యాప్తంగా వివిధ సంస్థల్లో ఎంబీఏ, పీజీడీఎం తదితర కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. 


రిమోట్‌ ప్రోక్టర్డ్‌ ఇంట‌ర్నెట్‌ బేస్డ్, కంప్యూటర్‌ బేస్డ్, పేపర్‌ ఆధారితం.. ఇలా కోరుకున్న విధానంలో మ్యాట్‌ పరీక్షను రాసుకోవచ్చు. వీటిలో కోరుకున్న రెండు విధాలుగా రాసుకునేందుకూ అవకాశమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఐపీఈ), గీతం, ఐసీబీఎం, విజ్ఞాన జ్యోతి, ధ్రువ, శివశివానీ, విశ్వవిశ్వానీ.. తదితర సంస్థలు మ్యాట్‌ స్కోరుతో ప్రవేశం కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 600 సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరడానికి ఈ స్కోరు ఉపయోగపడుతుంది. 


పరీక్ష ఇలా..

లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్, మ్యాథమెటికల్‌ స్కిల్స్, డేటా అనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీ, ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. మ్యాథ్స్‌ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి సీబీఎస్‌ఈ స్థాయిలో ఉంటాయి.  


అర్హత: డిగ్రీ పూర్తిచేసినవాళ్లు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 


దరఖాస్తు: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా.


ఫీజు: పేపర్‌/ రిమోట్‌ ప్రోక్టర్డ్‌/ కంప్యూటర్‌ బేస్డ్‌ ఏదో ఒక విధానంలో రాసుకోవడానికి రూ.1950. రెండు విధాల్లో రాసుకోవడానికి రూ. 3100


పేపర్‌ ఆధారిత పరీక్ష (పీబీటీ) రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: ఆగస్టు 29

రాతపరీక్ష తేదీ: సెప్టెంబరు 3


కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: సెప్టెంబరు 12

పరీక్ష తేదీ: సెప్టెంబరు 17


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: పేపర్‌ బేస్డ్‌: హైదరాబాద్, కంప్యూటర్‌ బేస్డ్‌: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.


వెబ్‌సైట్‌: https://mat.aima.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రభుత్వ బ్యాంకుల్లో 4,451 పీవో, ఎస్‌వో కొలువులు

‣ ‘స్మార్ట్‌’గానూ చదవొచ్చు!

‣ కేంద్ర బలగాల్లో 1,876 ఎస్‌ఐ కొలువులు

‣ కెరియర్‌ కౌన్సెలింగ్‌కు ఉచిత సలహాలివిగో..

Posted Date: 02-08-2023


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌