• facebook
  • whatsapp
  • telegram

శాసనసభ, శాసనమండలి

శాసనసభ
*» శాసనసభను విధాన సభ అని కూడా అంటారు.
*» శాసనసభలో ప్రజలు ఎన్నుకున్నవారు సభ్యులుగా ఉంటారు.
*» ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి సభలో సభ్యులు సంఖ్య ఉంటుంది.
*» శాసనసభకు పోటీచేయడానికి కావాల్సిన కనీస వయసు 25 సంవత్సరాలు.
*» శాసనసభ కాలపరిమితి 5 సంవత్సరాలు.
*» స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు.
*» స్పీకరు లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.
*» స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ప్యానెల్ స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు.
*» శాసనసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలు దిల్లీ, పాండిచ్చేరి.
*» విధానసభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 500కు మించకూడదు.
*» కనిష్ఠ సభ్యుల సంఖ్య 60కు మించకూడదు.
*» గోవా (40), సిక్కిం (32), మిజోరాం (40) రాష్ట్రాల్లో 60 కంటే తక్కువ సభ్యులున్నారు.
*» ఆర్థిక బిల్లు విషయంలో శాసనసభదే అంతిమ నిర్ణయం.

 

శాసనమండలి
*» శాసనమండలిని విధాన పరిషత్ అని కూడా అంటారు.
*» మండలిలో సభ్యుల సంఖ్య శాసనసభ సభ్యుల సంఖ్యలో మూడింట ఒకవంతు కంటే ఎక్కువ ఉండకూడదు. కనీసం 40 మంది సభ్యులుండాలి.
       (i) 1/3వ వంతును రాష్ట్ర శాసనసభ్యులు ఎన్నుకుంటారు.
       (ii) 1/3వ వంతును స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు.
       (iii) 1/12వ వంతును పట్టభద్రులు ఎన్నుకుంటారు.
       (iv) 1/12వ వంతును ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు.
       (v) 1/6వ వంతును గవర్నర్ నామినేట్ చేస్తారు.

* మొత్తం సభ్యుల్లో 5/6వ వంతు పరోక్షంగా ఎన్నికవుతారు.
*» విధానపరిషత్‌లో సభ్యుడిగా ఎన్నికవడానికి ఉండాల్సిన కనీస వయసు 30 సంవత్సరాలు.
*  ఇది శాశ్వత సభ.
* » ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మూడింట ఒకవంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు.
* » సభ్యుల కాలపరిమితి 6 సంవత్సరాలు.
*» ప్రస్తుతం శాసనమండలి ఉన్న రాష్ట్రాలు 6. అవి...

1. ఉత్తరప్రదేశ్  - 99 మంది స‌భ్యులు

2. ఆంధ్రప్రదేశ్ - 58

3. తెలంగాణ - 40

4. కర్ణాటక - 75

5. మహారాష్ట్ర - 78
6. బిహార్  - 75

* జ‌మ్ము క‌శ్మీర్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం జ‌మ్మూక‌శ్మీర్‌లో ఎగువ స‌భను ర‌ద్దు చేశారు. (గ‌తంలో 36 మంది స‌భ్యుల‌తో ఎగువ స‌భ ఉండేది.) 1957లో ఏర్పాటు చేశారు.
* 2020 జ‌న‌వ‌రి 27 ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శాస‌న మండ‌లి ర‌ద్దు తీర్మానం చేసి పార్ల‌మెంటుకు పంపింది. ఇంకా ర‌ద్దు కాలేదు.
* ఇటీవ‌లె ప‌శ్చిమ్ బెంగాల్ ప్ర‌భుత్వం శాస‌న మండ‌లి ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం చేసి పార్ల‌మెంటుకు పంపింది.
* ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌ మండ‌లి 1957లో చట్టం చేసి 1958లో ఏర్పాటు చేశారు. 1985లో ర‌ద్దు చేసి 2005లో తిరిగి చ‌ట్టం చేసి 2007 నుంచి అమ‌లు చేస్తుంది.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.