• facebook
  • whatsapp
  • telegram

సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీచేసే రిట్లు

హెబియస్ కార్పస్: ఈ రిట్ ప్రకారం నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాలి.  

మాండమస్: 'మేము ఆజ్ఞాపిస్తున్నాం' అని దీని అర్థం. ఏ అధికారి అయినా ప్రజాసంబంధ, చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడానికి నిరాకరించినప్పుడు వాటిని నిర్వర్తించమని కోర్టులు జారీ చేసే రిట్.    

సుప్రీంకోర్టు

ప్రొహిబిషన్: దిగువ కోర్టు తన అధికార పరిధిలో లేని విషయాన్ని గురించి విచారిస్తున్నప్పుడు దాన్ని నిలిపివేయమని ఈ రిట్‌ను జారీ చేస్తారు.

సెర్షియోరరి: కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిలో ఉండేలా చూడటం ఈ రిట్ ఉద్దేశం. కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేయడానికి ఈ రిట్‌ను జారీ చేస్తారు.

కోవారంటో: 'ఏ అధికారంతో' అని దీని అర్థం. ఏ అధికారంతో పదవిలో కొనసాగుతున్నారో ఆధారాలు చూపమని కోర్టులు జారీ చేసే రిట్.

* రిట్ అంటే 'ఆజ్ఞ' అని అర్థం.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.