• facebook
  • whatsapp
  • telegram

శ్వాస క్రియ

* ఉచ్ఛ్వాస, నిశ్వాసాలనే శ్వాసక్రియ అంటారు.
* ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియను శ్వాసక్రియా రేటు అంటారు.

వయసు

నిమిషానికి శ్వాసక్రియా రేటు

అప్పుడే పుట్టిన పిల్లలు

32 సార్లు

5 ఏళ్ల‌ పిల్లలు

26 సార్లు

25 ఏళ్ల‌ వారు

15 సార్లు

50 ఏళ్ల‌ వారు

18 సార్లు

* ఆరోగ్య మానవుడిలో శ్వాసక్రియా రేటు 18 సార్లు.
* శ్వాసక్రియ అనేది ఒక ఆక్సీకరణ చర్య, ఒక శక్తిమోచక చర్య, విచ్ఛిన్న క్రియ.
* శ్వాసక్రియ అన్ని రకాల బ్యాక్టీరియాలు, జంతువులు, మొక్కల్లో జరుగుతుంది కానీ వైరస్‌లలో జరగదు.
* మానవుడిలో శ్వాసక్రియ అనేది ఒక అసంకల్పిత, అనియంత్రిత చర్య.
* మానవుడిలో శ్వాసక్రియ మొదడులోని మజ్జాముఖం ఆధీనంలో ఉంటుంది.
* వాయు శ్వాసక్రియను జరిపే జీవులకు ఉదాహరణ ఉన్నత స్థాయి జీవులు, మొక్కలు.
* అవాయు శ్వాస క్రియను జరిపే జీవులకు ఉదాహరణ క్లాస్ట్రీడియం, ఈస్ట్ లాంటి సూక్ష్మ జీవులు.


వివిధ జీవులు - వాటి హృదయంలో ఉన్న గదుల సంఖ్య

జీవులు

హృదయంలో గదులు

చేపలు

2

ఉభయచరాలు, సరీసృపాలు (మొసలి, కప్ప)

3

పక్షులు, క్షీరదాలు

4

మొసలి (సరీసృపం)

4 (ఒక గది అసంపూర్ణం)

బొద్దింక

13

వానపాము

8 జతలు

వివిధ దశల్లో మానవుని నిమిషానికి హృదయ స్పందన రేటు

మానవుడి దశ

నిమిషానికి హృదయ స్పందన రేటు

అప్పుడే పుట్టిన శిశువు

135 - 140

ఏడాది వయసు శిశువు

115 - 130

రెండేళ్ల‌ వయసు శిశువు

100 - 117

ఏడేళ్ల‌ వయసువారు

80 - 90

14 ఏళ్ల‌ వయసువారు

80 - 81

మధ్య వయసువారు

70 - 80

వృద్ధులు

60 - 70

* సాధారణంగా కంటే ఎక్కువ హృదయ స్పందనలు జరిగితే టాకీకార్టియా అంటారు.
* సాధారణంగా కంటే తక్కువ హృదయ స్పందనలు జరిగితే బ్రాకీకార్డియా అంటారు.

జంతువులు - ఆయుర్దాయం

జంతువు

ఆయుర్దాయం (సంవత్సరాల్లో)

ఎలుక

1

రాణి ఈగ

6

రాణి చీమ

18

సింహం

29

ఆఫ్రికా ఏనుగు

70

తిమింగలం

90

మానవుడు

120

తాబేలు

152

పులి

25

కుక్క

24

జిరాఫి

30

కుందేలు

10

ఏనుగు

67

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.