• facebook
  • whatsapp
  • telegram

వివిధ రసాయనాల ఉపయోగాలు

రసాయనం

 ఉపయోగం

 ఐరన్ ఆక్సైడ్

 టేపు రికార్డర్ టేపుపై పూత కోసం

 హైపో

దుస్తులపై అధికంగా ఉన్న క్లోరిన్‌ను తొలగించడానికి

 సల్ఫర్

రబ్బరును వల్కనైజ్ చేసి సాగే గుణాన్ని పెంచడానికి

 సోడియం బై కార్బొనేట్

ఉదరంలో ఆమ్లత్వాన్ని తగ్గించడానికి

 టెఫ్లాన్

పదార్థాలు అంటకోకుండా గిన్నెలకు పూతపూయడానికి

 మిథైల్ ఆల్కహాల్

శుద్ధ ఆల్కహాల్‌ను తాగకుండా నిరోధించడానికి

 సోడియం కార్బొనేట్

నీటిలో శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి

 కాల్షియం హైడ్రాక్సైడ్

నీటిలో తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి

 పొటాష్ ఆలం

గాయాలు తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఆపేందుకు, మురికి నీటిని తేర్చి స్వచ్ఛంగా మార్చడానికి

 సోడియం హైపోక్లోరైట్

దుస్తులపై కాఫీ మరకలు తొలగించడానికి

 సోడియం పెంటథాల్

నిజ నిర్ధారణ పరీక్ష కోసం

 సోడియం హైడ్రాక్సైడ్

నూలును మెర్సిరైజ్ చేసి తెల్లగా మార్చడానికి

 సోడియం ఫ్లోరైడ్

దంతాల్లో పింగాణి ఏర్పడేందుకు

 రసరాజం

బంగారాన్ని కరిగించడానికి

 సిలికాజెల్

మందు సీసాల్లో తేమను గ్రహించడానికి

 ఆగ్జాలిక్ ఆమ్లం/ నిమ్మరసం

వస్త్రాలపై తుప్పు, సిరా మరకల్ని తొలగించడానికి

 కార్బన్ డై ఆక్సైడ్

మంటల్ని ఆర్పడానికి

 కాల్షియం హైడ్రాక్సైడ్

ఇళ్ళకు వెల్లవేసేందుకు

 పొటాషియం డైక్రోమేట్

మద్యం తాగిన డ్రైవర్‌ని గుర్తించడానికి

 గ్రాఫైట్

భారీ యంత్రాల్లో మృదుత్వం కోసం కందెనగా వాడటానికి

 ఇథిలీన్

పచ్చి కాయల్ని పండించడానికి

 ద్రవ నైట్రోజన్

పశువుల వీర్యాన్ని నిల్వ చేయడానికి

 హైడ్రోజన్ పెరాక్సైడ్

సిల్కు, ఉన్ని వస్త్రాలను విరంజనం చేయడానికి

 ఎసిటిక్ ఎన్‌హైడ్రైడ్

పచ్చళ్లను దీర్ఘకాలం నిల్వ చేయడానికి

 భారజలం

అణురియాక్టర్లలో న్యూట్రాన్ల వేగం తగ్గించడానికి

 ఇథిలీన్ గ్త్లెకాల్, గ్లిజరాల్

కారు కార్బొరేటర్‌లో యాంటిఫ్రీజ్‌గా

 ఎసిటిలీన్

ఆక్సిజన్‌తో పాటు గ్యాస్ వెల్డింగ్‌లో మంటకోసం

 నిన్‌హైడ్రిన్

కాగితంపై వేలిముద్రలను స్పష్టంగా గుర్తించడానికి

 సబ్బుద్రావణం

నీటి కాఠిన్యాన్ని గుర్తించడానికి

 ఓజోన్

మినరల్ వాటర్ తయారీలో బ్యాక్టీరియాను చంపేందుకు

 సిల్వర్ అయోడైడ్

కృత్రిమ వర్షాలకోసం, మేఘమథనం చేయడానికి

 ఫ్రియాన్

రిఫ్రిజిరేటర్లలో శీతలీకరణకు

 ఫినాల్ ఫార్మాల్డిహైడ్

టెలిఫోన్ పెట్టెల తయారీకి

 బ్లీచింగ్ పౌడర్

తాగే నీటిలో బ్యాక్టీరియాను చంపడానికి

 అనార్ధ్ర కాపర్ సల్ఫేట్

పదార్థాల్లో తేమను గుర్తించడానికి

 గ్లిజరిన్

సబ్బు తయారీలో

 క్లోరాల్ హైడ్రేట్

కల్తీ కల్లులో నురగకు

 కార్బన్ బ్లాక్

నల్లని ప్రింట్ సిరా తయారీకి

 హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం

గాజుపై అక్షరాల్ని రాయడానికి

 సిట్రనెల్లాల్

శీతల పానియాల్లో నిమ్మవాసనకు

 క్లోరోఫాం

మత్తు ఇవ్వడానికి/ స్పృహ లేకుండా చేయడానికి

 పొటాషియం స్టియరేట్

షేవింగ్ సబ్బులో నురగ ఏర్పరచడానికి

గాజులు - ఉపయోగాలు 

గాజు రకం

ఉపయోగం

సోడా గాజు/ మెత్తటి గాజు
క్రూక్స్‌గాజు
క్వార్ట్‌జ్‌ గాజు
ఫ్లింట్ గాజు
గట్టి గాజు
బోరోసిలికేట్
పైరెక్స్ గాజు

సీసాలు, కిటికీ అద్దాల తయారీకి
అతినీలలోహిత కిరణాల్ని నిరోధించే అద్దాల తయారీకి
విద్యుత్ బల్బులు, దృశ్య పరికరాల తయారీకి
విద్యుత్ బల్బులు, కంటి అద్దాల తయారీకి
గట్టి గాజు పరికరాల తయారీకి
వంటపాత్రలు, గొట్టాల తయారీకి
ప్రయోగశాలల్లోని పరికరాల తయారీకి

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.