• facebook
  • whatsapp
  • telegram

మానవుల్లో వైరస్ వల్ల వచ్చే వ్యాధులు

పోలియో

* ఈ వ్యాధి 'ఎంటిరోవైరస్' లేదా 'పోలియోవైరస్' వల్ల సంక్రమిస్తుంది.    

* ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.

* ఈ వ్యాధి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.

* పోలియోను 'శిశు పక్షవాతం' అని కూడా అంటారు.

* జూనాస్ సాల్క్ అనే శాస్త్రవేత్త పోలియో టీకాను కనుక్కున్నాడు.

* ఇంజక్షన్ ద్వారా తీసుకునే పోలియో టీకాను 'సాల్వాక్' అంటారు.

* నోటి ద్వారా తీసుకునే చుక్కల మందును 'సాబిన్' అంటారు.

* పోలియో వల్ల చాలకనాడులు నశించిపోయి కాళ్లూ, చేతులు చచ్చుబడిపోతాయి.

* 7 నుంచి 14 రోజుల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

వ్యాధి లక్షణాలు: తలనొప్పి, వాంతులు, వికారం, తీవ్రమైన జ్వరం, అతిసారం, పక్షవాతం.

జలుబు (రొంప)

* 'రినో వైరస్' అనే వైరస్ వల్ల ఇది సంక్రమిస్తుంది.

* దీనికి గాలి వాహకంగా పనిచేస్తుంది.

* దీనివల్ల ముక్కు తీవ్రంగా ప్రభావితమవుతుంది.

* వ్యాధి సోకిన వ్యక్తుల శ్వాసనాళాల నుంచి ఈ వైరస్ విడుదలవుతుంది.

* ఒకటి లేదా 2 రోజుల్లో ఇది సంక్రమిస్తుంది.

వ్యాధి లక్షణాలు: ముక్కు కారడం, తలనొప్పి, దగ్గు, కొద్దిగా జ్వరం రావడం.

మశూచి

* ఈ వ్యాధినే 'స్మాల్‌పాక్స్ (Smallpox) ' లేదా 'స్పోటకం' అని అంటారు.

* 'వరియొల వైరస్' వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* మొత్తం శరీరం ఈ వ్యాధికి లోనవుతుంది.

* ప్రత్యక్ష స్పర్శ, రోగి వాడిన వస్తువులను వాడటం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* ఎడ్వర్డ్ జెన్నర్ ఈ వ్యాధికి మొదటిసారిగా టీకా మందును కనిపెట్టాడు.

* మశూచిని భారత్‌లో పూర్తిగా నిర్మూలించారు.

వ్యాధి లక్షణాలు:

* అకస్మాత్తుగా లేదా క్రమంగా జ్వరం, తలనొప్పి, వెన్ను నొప్పి.

* ఈ వ్యాధి సోకిన మూడోరోజు శరీరం మీద ఎర్రని చిన్న గుల్లలు ఏర్పడి బొబ్బలుగా మారతాయి.

* చివరకు ఒకలాంటి ద్రవంతో పొక్కులుగా మారతాయి. ఈ పొక్కులు శరీరంపై గుంటలతో కూడిన మచ్చల్ని శాశ్వతంగా ఏర్పరుస్తాయి.

రేబిస్

* ఈ వ్యాధి వల్ల 'జల భీతి' కలుగుతుంది. అందువల్ల దీన్ని 'జల భీతి' వ్యాధి అని కూడా అంటారు.

* 'రేబిస్ వైరస్' అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది.    

* రేబిస్ వైరస్‌నే 'రాబ్డో వైరస్' అని కూడా అంటారు.

* కుక్క కాటు ద్వారా ఈ వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.

* 2 నుంచి 16 వారాల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కొన్ని సందర్భాల్లో మరింత ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు.

వ్యాధి లక్షణాలు:

* తలనొప్పి, జ్వరం, నీటిని చూస్తే భయం, వణుకు, పక్షవాతం, వాంతులు, గొంతు వాపు.

* ఈ వ్యాధి నివారణకు 'యాంటీ రేబిస్' అనే మందును ఇస్తారు.

* యాంటీ రేబిస్‌ను లూయీపాశ్చర్ కనుక్కున్నాడు.

* ఈ వ్యాధి నివారణకు వాడే మరో మందు 'రేబీపోల్'.

డెంగ్యూ

* ఈ వ్యాధిని ఎల్లో ఫీవర్, బ్రేక్ ఫీవర్, బోన్ ఫీవర్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.

* డెంగ్యూ వైరస్ (ఆర్బో వైరస్) ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* పగటి పూట కుట్టే 'ఎడిస్ ఈజిప్టు' అనే దోమకాటు ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.

* ఈ వ్యాధి వల్ల రక్తఫలకికల సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుంది.

* 4 నుంచి 8 రోజుల్లో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ వ్యాధి వస్తుంది.

* కీళ్లు, చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయి.

వ్యాధి లక్షణాలు:

* తీవ్ర జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, కొన్ని రోజుల పాటు చర్మం మీద చిన్న చిన్న గుల్లలు ఈ వ్యాధి వల్ల ఏర్పడి అలాగే ఉండిపోవడం.

గవద బిళ్లలు (మంప్స్)

* 'పారా మిక్సో వైరస్' అనే వైరస్ వల్ల ఇవి సంక్రమిస్తాయి.

* లాలాజలంలోని, చీమిడిలోని వైరస్ శరీరంలోకి ప్రవేశించి లాలాజల గ్రంథుల మీద దాడిచేస్తుంది.

* ప్రత్యక్ష స్పర్శ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.

* 12 నుంచి 21 రోజులు ఈ వ్యాధి సంక్రమించడానికి పడుతుంది.

* గొంతు, మెడ, దవడలు ప్రభావానికి గురవుతాయి.

* ఈ వ్యాధికి ఎక్కువగా దవడలు ప్రభావితమవుతాయి.

* ఈ ప్రభావమనేది 7 నుంచి 10 రోజుల పాటు ఉంటుంది.

వ్యాధి లక్షణాలు: చెవుల దగ్గర, దవడల దగ్గర లాలాజల గ్రంథులు వాయడం.

తట్టు (మీజిల్స్ లేదా పొంగు)

* 'పారా మిక్సోవైరస్' వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* మాట్లాడేటప్పుడు, దగ్గేటప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.

* వ్యాధి సంక్రమించడానికి 10 నుంచి 14 రోజుల సమయం పడుతుంది.

* చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది.

* ఈ వ్యాధి నివారణకు MMR (Measles, Mumps, Rubella) వ్యాక్సిన్ ఇస్తారు.

వ్యాధి లక్షణాలు:

* జలుబు, జ్వరం, తలనొప్పి, తుమ్ములు, చర్మంపై చిన్న చిన్న ఎర్రని గుల్లలు ఏర్పడటం.

* వ్యాధి సోకిన 4 రోజుల తర్వాతే ఈ ఎర్రని గుల్లలు ఏర్పడతాయి.

చికెన్ ఫాక్స్ (అమ్మవారు) (ఆటలమ్మ)

* 'వెరిసెల్లా వైరస్' వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* చర్మం ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది.

* తుంపర్ల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.

* వ్యాధి సంక్రమణకు 2 నుంచి 5 రోజులు పడుతుంది.

వ్యాధి లక్షణాలు:

* జలుబు, జ్వరం, తలనొప్పి, చర్మంపై చిన్న చిన్న ఎర్రని గుల్లలు ఏర్పడటం.

* ఏర్పడిన గుల్లలు 5 నుంచి 20 రోజుల లోపల రాలిపోతాయి.

* వైరస్ సోకిన 36 గంటల్లో గుల్లలు ఏర్పడతాయి.

మెదడువాపు వ్యాధి (జపనీస్ ఎన్‌సెఫలైటిస్)

* 'ఎన్‌సెఫాలిటిస్ (ఆర్బో వైరస్) వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* ఆడ క్యూలెక్స్ దోమ పందిని కుట్టి, మనిషిని కుడితే ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.

* 4 నుంచి 21 రోజుల్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* మెదడు ఈ వ్యాధి ప్రభావానికి గురవుతుంది.

* బెల్లడోనా మందును ఈ వ్యాధి చికిత్సకు వాడతారు.

వ్యాధి లక్షణాలు:

* అకస్మాత్తుగా జ్వరం, తలనొప్పి, వాంతులు, మత్తుగా ఉండటం, మెడ బిగుసుకుపోవడం, వెన్నునొప్పి. మానసిక అస్థిరత్వం.

* ఈ వ్యాధి వల్ల అంధత్వం, చెవుడు, పక్షవాతం, మనోవైకల్యం లాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయి.

చికున్ గున్యా

* 'ప్లావీ వైరస్ (ఆల్ఫా వైరస్)' అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.    

* ప్లావీ వైరస్‌నే 'చిక్ వైరస్' లేదా 'CK వైరస్' అని కూడా అంటారు.

* ఈ వ్యాధిని మొదటగా టాంజానియా (ఆఫ్రికా)లో గుర్తించారు.

* 'ఎడిస్ ఈజిప్టి' అనే దోమ కాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* ఆఫ్రికాలో 'మాకొండే' అనే భాషలో, కెన్యాలోని 'స్వాహిలీ' అనే భాషలో చికున్ గున్యా అంటే వంగి నడవటం అని అర్థం.

వ్యాధి లక్షణాలు:

* జ్వరం, కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్య వాపులు, కండరాల వాపులు

హెపటైటిస్

* 'హెపటైటిస్-బి' అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* 'హెప' అంటే కాలేయం అని అర్థం.

* ఇది కాలేయానికి వచ్చే వ్యాధి.

* మొదటిసారిగా హైదరాబాద్‌లోని శాంతా బయోటెక్ అనే సంస్థ ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనిపెట్టింది.

* వ్యాక్సిన్ పేరు 'శాన్‌వాక్స్'.

వ్యాధి లక్షణాలు:

* జ్వరం, వికారం, పచ్చకామెర్లు, కాలేయంలో వాపు.

ఇన్‌ఫ్లుయెంజా (ఫ్లూ)

* 'ఆర్థోమిక్సో వైరస్' అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* ఈ వ్యాధికి గాలి వాహకంగా పనిచేస్తుంది.

* కండరాలు, గొంతు, ఊపిరితిత్తులు ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయి.

* 1, 2 రోజుల్లోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

వ్యాధి లక్షణాలు:

* జ్వరం, కండరాల నొప్పి, గొంతు పుండు పడటం, పొడి దగ్గు.

* ఈ వ్యాధి ప్రభావంతో ఊపిరితిత్తుల మీద బ్యాక్టీరియా దాడి చేస్తుంది. ఇది 'న్యూమోనియా'కు దారితీసే అవకాశముంది.

హెర్పెస్ సింప్లెక్స్ 

* 'హెర్పెస్ సింప్లెక్స్' అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* లాలాజలం, మలం, కలుషితమైన వస్తువులు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.

వ్యాధి లక్షణాలు:

* చర్మంపై, శ్లేష్మపటలంపై అక్కడక్కడా బొబ్బల్లాంటి గుల్లలు.

ఎయిడ్స్

* AIDS - Acquired Immuno Deficiency Syndrome

* AIDSను కలుగచేసే వైరస్ HIV.

* HIV విస్తరణ రూపం Human Immuno Deficiency Virus.

* హ్యూమన్ టి సెల్ (ల్యూకేమియా వైరస్/రెట్రో వైరస్) ఈ వ్యాధికి కారకాలు.

* లైంగిక సంబంధాలు, రక్తం, సిరంజీలు ఈ వ్యాధి సంక్రమించడానికి దోహదం చేస్తాయి.

* రోగ నిరోధక వ్యవస్థపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

* HIV వైరస్‌ను 1983లో 'ల్యూక్ మాంటెగ్నర్' అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు.

* ఈయన ఫ్రాన్స్ దేశస్థుడు.

* ఈ వైరస్‌కు ఆయన పెట్టిన పేరు: LAV - 2

* LAV - 2 విస్తరణ రూపం: Lymphadenopathy Associated Virus - 2

* 1984లో అమెరికాకు చెందిన 'రాబర్ట్ గాలో' అనే శాస్త్రవేత్త ఇదే వైరస్‌ను కనిపెట్టాడు.

* ఈ వైరస్‌కు ఆయన పెట్టిన పేరు 'HTLV-III'.

* 'HTLV - III' విస్తరణ రూపం Human T-Cell Lympotropic Virus-III.

* ప్రపంచంలోనే మొదటిసారిగా మానవుల్లో ఈ వ్యాధిని 1981లో అమెరికాలో కనుక్కున్నారు.

* మన దేశంలో మొదటిసారిగా ఈ వ్యాధిని 1986లో చెన్నైలో కనుక్కున్నారు.

* 1987లో హైద‌రాబాద్‌లో ఈ వ్యాధి కేసు మొదటిసారిగా నమోదైంది.

* ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న దేశం దక్షిణాఫ్రికా.

* భారత్‌లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర.

* ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న జిల్లా గుంటూరు.

* ఈ వ్యాధి లక్షణాలు వ్యాధిని సోకిన తర్వాత 3-5 సంవత్సరాల మధ్యలో కనిపిస్తాయి.

* 20-49 సంవత్సరాల వయసువారే ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు.

* ఎయిడ్స్ / HIV వ్యాధి ఉన్న స్త్రీ గర్భం దాల్చితే పుట్టే శిశువుకు కూడా HIV సంక్రమిస్తుంది.

* పుట్టే శిశువుకు ఈ వైరస్ సోకకుండా వైద్యుడి పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు.

* HIV వైరస్ రిట్రో విరిడే అనే కుటుంబానికి చెందింది.

* HIV ఉన్న RNA 'రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్' అనే ఎంజైమ్‌ను కలిగి ఉంటుంది.

వ్యాధి లక్షణాలు:

* పదేపదే జ్వరం రావడం, తరచుగా విరేచనాలు, దగ్గు, న్యూమోనియా, రక్త నాళాలు చిట్లడం, బరువు విపరీతంగా తగ్గిపోవడం, చర్మ వ్యాధులు, రాత్రిపూట తీవ్రమైన చెమటలు పట్టడం, లింఫ్ గ్రంథుల్లో వాపు.

* ఈ వ్యాధి రోగ నిరోధక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపిందో 'సీడీ - 4' కణాల సంఖ్యను బట్టి తెలుసుకోవచ్చు.

* ఆరోగ్యవంతమైన మానవుడిలో సీడీ - 4 కణాల సంఖ్య ప్రతి మిల్లీమీటరుకు రక్తంలో 500 నుంచి 1500 వరకు ఉంటాయి.

* HIV వైరస్ తరచూ తన రూపాన్ని మార్చుకుంటుంది. అందుకే మందు తయారుచేయడమనేది కష్టసాధ్యమౌతోంది.

* ఎయిడ్స్‌ను నిర్ధారించడానికి చేసే పరీక్షలు:

        i) ELISA

        ii) WESTERN BLOT TECHNIQUE

        iii) TRIDOT TEST

        iv) PCR

వీటిల్లో ఏ ఒక్క పరీక్ష ద్వారానైనా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు.

* ELISA విస్తరణ రూపం Enzyme Linked Immuno Sorbent Assay.

* PCR విస్తరణ రూపం Polymerase Chain Reaction.

* HIV పరీక్షను వేగవంతంగా, సులభంగా చేయడానికి అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయంలో 'శామ్యూల్ కెంసియా' అనే శాస్త్రవేత్త ఎం.చిప్ అనే పరికరాన్ని కనుక్కున్నారు.

* ఎం.చిప్ పరికరం ద్వారా ఒకే ఒక్క రక్తపు చుక్కతో 15 నిమిషాల్లో HIV స్థితిని తెలుసుకోవచ్చు.

* ELISA పరీక్ష కంటే 10 రెట్ల వేగంతో ఎం.చిప్ పరికరం పనిచేస్తుంది.

* HIV బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న చికిత్స ART.

* ART విస్తరణ రూపం Anti Retro Virus Therapy.

* ART చికిత్సలో ఇచ్చే మందులు జిడోవుడెన్ (ZDV), అజిటో థయమిన్ (AZT), డైడి ఆక్సీ సైటిడిన్ (DDC).

* 1992లో భారత ప్రభుత్వం ఎయిడ్స్ నివారణకు, నియంత్రణకు NACO అనే సంస్థను స్థాపించింది.

* NACO విస్తరణ రూపం National Aids Control Organisation.

* ఆంధ్రప్రదేశ్‌లో 'AASHA' అనే పథకం అమల్లో ఉంది.

హెర్పెస్ జోస్టర్

* 'హెర్పెస్ జోస్టర్' అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* నోటి తుంపరలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.

* 7 నుంచి 14 రోజులు ఈ వ్యాధి సంక్రమణకు పడుతుంది.

వ్యాధి లక్షణాలు:

* చర్మంపై బొబ్బలు, చర్మం లేదా శ్లేష్మపట‌లంలో తీవ్రమైన బాధ, జ్వరం, నోటిలో పుండ్లు ఏర్పడటం.

స్వైన్ ఫ్లూ

* H1N1 అనే వైరస్ వల్ల ఇది సంక్రమిస్తుంది.

* H1N1 అనేది ఇన్‌ఫ్లుయెంజా వైరస్ రకం.

* 'స్వైన్' అనే జాతి పందుల ద్వారా ఈ వైరస్ వెలువడుతుంది. అందువల్ల దీనికి 'స్వైన్ ఫ్లూ' అనే పేరు పెట్టారు.

* ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది.

* మొదట పందుల నుంచి మనిషికి సంక్రమించి ఆ తర్వాత మనిషి నుంచి మనిషికి త్వరితగతిన సంక్రమిస్తుంది.

*ఈ వ్యాధి మెక్సికో, లాటిన్ అమెరికా దేశాలకు మాత్రమే పరిమితమైనప్పటికీ ఇప్పుడు దాదాపుగా అన్ని దేశాలకు వ్యాపించింది.

* ఈ వ్యాధి చికిత్సకు 'టామీ ఫ్లూ' అనే మందును వాడతారు.

వ్యాధి లక్షణాలు: 

* చలి, జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, ఛాతీ నొప్పి, ముక్కులో నుంచి రక్తం కారడటం, తీవ్రమైన జలుబు.

బర్డ్ ఫ్లూ

* H5N1 అనే వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* ఈ వ్యాధి అతి వేగంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది.

* ఈ వ్యాధి ఎక్కువగా పక్షులకు, కోళ్లకు వస్తుంది.

* మానవుల్లో ఈ వ్యాధి రావడం అరుదు.

* హాంకాంగ్‌లో ఈ వైరస్‌ను 1997లో మానవుల్లో గుర్తించారు.

SARS

* SARS విస్తరణ రూపం Severe Acute Respiratory Syndrome.

* కరోనా వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

* ఈ వ్యాధిని 'మృత్యుకారక న్యూమోనియా' అని కూడా అంటారు.

* ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి.

* న్యూమోనియా కూడా ఊపిరితిత్తులకు సంబంధించిందే. కానీ మరణం సంభవించదు. కానీ SARS వల్ల ప్రాణపాయం ఉంటుంది.

వ్యాధి లక్షణాలు: 

* జ్వరం, తలనొప్పి, దగ్గు.

* ఈ వ్యాధిని మొదటగా చైనాలో గుర్తించారు.

* ఈ వ్యాధి వల్ల గతంలో కెనడాలో అనేకమంది మరణించారు.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.