• facebook
  • whatsapp
  • telegram

మానవుల్లో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు

న్యూమోనియా
* ఈ వ్యాధి 'డిప్లోకోకస్ న్యూమోనియా' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.
* బ్యాక్టీరియా ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లోకి ప్రవేశిస్తుంది.
* దీనికి గాలి ప్రధాన వాహకంగా పనిచేస్తుంది.
వ్యాధి లక్షణాలు: ఛాతీలోనూ, పొత్తి కడుపులో నొప్పి; చలి, కామెర్లు, ఎగశ్వాస.


ధనుర్వాతం
* ఇది 'క్లాస్ట్రీడియమ్ టెటాని' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.
* ఈ వ్యాధిని 'టెటానస్' అని కూడా అంటారు.
* తుప్పు పట్టిన మేకులు, తీగలు శరీరానికి గుచ్చుకున్నా లేదా గీసుకున్నా.. ఈ వ్యాధి జనకాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
* శరీరంపై ఏర్పడిన గాయాల ద్వారా కూడా ఈ వ్యాధి జనకాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
* కండరాలు, నరాలు ఈ వ్యాధికి గురవుతాయి.
వ్యాధి లక్షణాలు:
* కండరాలు ముడుచుకొనిపోతాయి. నరాల తీపులు, శరీరం విల్లు ఆకారంలో వంగుతుంది.
* వ్యాధి సంక్రమణ కాలం 2 నుంచి 40 రోజుల వరకు ఉంటుంది.


కలరా
* ఇది 'విబ్రియో కలరా' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.
* ఈగలు, దోమలు, కలుషిత ఆహారం, నీరు, మలం ...... వ్యాధి వాహకాలుగా పనిచేస్తాయి.
వ్యాధి లక్షణాలు:
* వాంతులు, నీళ్ల విరేచనాలు, మూత్రం ఆగిపోవడం, కండరాల నొప్పులు, కళ్లు మండటం.
* ఈ వ్యాధి వల్ల డీహైడ్రేషన్ ఎక్కువగా జరుగుతుంది.
* డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఓఆర్ఎస్ (ORS: Oral Rehydration Solution) ద్రావణాన్ని ఇస్తారు.
* వ్యాధి సంక్రమణ కాలం 1 - 2 రోజులు మాత్రమే ఉంటుంది.


కుష్ఠు (లెప్రసీ)
* ఇది 'మైకో బ్యాక్టీరియమ్ లెప్రె' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.
* ఈ వ్యాధిని హాన్‌సన్ వ్యాధి అని కూడా అంటారు.
* వ్యాధి సోకిన వ్యక్తులతో దీర్ఘకాలం సన్నిహితంగా ఉండటం వల్ల కూడా సంక్రమిస్తుంది.
* వివిధ శరీర అవయవాలు ఈ వ్యాధి వల్ల ప్రభావితమవుతాయి.
వ్యాధి లక్షణాలు:
* కణుపులు, వేళ్లు, పాదాలు వంకరపోవడం; పుండ్లు ఏర్పడటం, చర్మంపై మచ్చలు రావడం, స్పర్శ లేకపోవడం, చేతి, కాలివేళ్ల కండరాలు ఊడిపోయి రక్తస్రావం జరుగుతుంది.
* హిస్టమైన్ పరీక్ష ద్వారా నాడుల క్షీణతను గుర్తించి కుష్ఠును అంచనా వేస్తారు.
* ప్రస్తుతం 'ఫ్లోరోసెంట్ లెప్రసీ యాంటీబాడీ ఎబ్‌జాస్టన్' పరీక్ష ద్వారా నిర్ధారిస్తున్నారు.
* ఎండీటీ (మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా దీన్ని నివారించవచ్చు.
* భారత ప్రభుత్వం 1955లో 'జాతీయ కుష్ఠు నియంత్రణ కార్యక్రమం'ను చేపట్టింది.
* ఫాంపిసిన్ డాప్‌సోన్, క్లోఫజిమైన్ లాంటి మందులు వాడటం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.


క్షయ (టీబీ)
* ఇది 'మైకో బ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.
* గాలి, ఈగలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.
* ప్రత్యక్ష స్పర్శ, పాలు, కలుషిత ఆహారం ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* ఊపిరితిత్తులు ఈ వ్యాధి బారిన పడతాయి.
వ్యాధి లక్షణాలు:
* సాయంత్ర సమయంలో జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు, అలసట, బరువు తగ్గడం, దగ్గినప్పుడు కళ్లె (తెమడ) రావడం.
* వ్యాధి సోకిన భాగాన్ని బట్టి వ్యాధి లక్షణాలు మారతాయి.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O.) నివేదిక ప్రకారం ఈ వ్యాధి ద్వారా జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
* ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఈ మరణాలు ఎక్కువ.
* చిన్నపిల్లల్లో ఈ వ్యాధి రాకుండా BCG (Bacillus Calmette Guerin) టీకాను ఇస్తారు.
* ఈ వ్యాధి నిర్ధారణకు 'మాంటెక్స్' పరీక్ష చేస్తారు.
* క్షయ వ్యాధికి DOTS (Directly Observed Treatment Short Course) చికిత్స చేస్తారు.
* 1962లో భారత ప్రభుత్వం ఈ వ్యాధి నివారణకు NTCP (National Tuberculosis Control Programme)ను చేపట్టింది.
* అదే విధంగా 1997లో RNTCP (Revised National Tuberculosis Control Programme)ను చేపట్టింది.


డిఫ్తీరియా
* 'కార్ని బ్యాక్టీరియా' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* ఇది గొంతుకు వచ్చే వ్యాధి. అందువల్ల దీన్ని 'అంగుడు వాపు' వ్యాధి అని కూడా అంటారు.
* ప్రత్యక్ష స్పర్శ, కలుషిత ఆహారం, గాలి, బ్యాక్టీరియా సోకిన శ్వాసనాళం నుంచి వచ్చే తుంపరలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.
వ్యాధి లక్షణాలు:
* జ్వరం, వాంతులు, గొంతులో గాయం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతులో బూడిద రంగు త్వచం ఏర్పడటం.
* వ్యాధి సంక్రమణ కాలం ఒకటి నుంచి 7 రోజులు.
* ఈ వ్యాధి నివారణకు 'షీక్ టెస్ట్' చేస్తారు.


టైఫాయిడ్
* ఇది 'సాల్మొనెల్లా టైఫీ' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.
* దీన్ని 'ఎంటరిక్ జ్వరం' అని కూడా అంటారు.
* ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు, కలుషిత పాలు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.
* ముఖ్యంగా ఈగలు వ్యాధి జనకాల్ని మోసుకొచ్చి ఆహారం, నీటిని కలుషితం చేస్తాయి.
* కలుషిత పాల ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమిస్తుంది.
* ముఖ్యంగా పేగులు, తర్వాత మొత్తం శరీరం ఈ వ్యాధికి ప్రభావితమవుతాయి.
* ఈ వ్యాధి నిర్ధారణకు 'వైడల్ టెస్ట్'ను జరుపుతారు.
* సంక్రమణ కాలం 10 నుంచి 14 రోజులు.
* ఈ వ్యాధి రాకుండా ఇచ్చే వ్యాక్సిన్: TAB (Typhoid - Paratyphoid A & B Vaccine)
* సల్ఫాడ్రగ్స్, క్లోరోమైసిటిన్ అనే మందుల్ని ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు.
వ్యాధి లక్షణాలు: జ్వరం, వికారం, వాంతులు, విపరీతమైన పొత్తికడుపు నొప్పి, ఉదాసీనత, విరేచనాలు.


కోరింత దగ్గు
* ఇది 'హెమోఫిల్లస్ పెర్టుసిస్' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.
* ఈ బ్యాక్టీరియాలు గాలి ద్వారా వ్యాపిస్తాయి.
* తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరియాలు గాలిలోకి ప్రవేశిస్తాయి.
* వ్యాధి సంక్రమణ కాలం 7 నుంచి 14 రోజులు.
* ఈ వ్యాధిని పెర్టుసిస్ అని కూడా అంటారు.
* శ్వాసనాళం, గొంతు ఈ వ్యాధి వల్ల ప్రభావితమవుతాయి.
వ్యాధి లక్షణాలు:
* చలి, పొడి దగ్గు, ఆ తర్వాత తీవ్రమైన దగ్గు, శ్వాస పీల్చిన తర్వాత ఎడతెరిపి లేకుండా దగ్గురావడం, ఎగశ్వాస.
* దగ్గు ఎక్కువగా వస్తూ దగ్గు చివరిలో 'ఊఫ్' అనే శబ్దం రావడం వల్ల దీన్ని 'Whooping cough' అంటారు.


గనేరియా
* 'డిప్లోకోకస్' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* డిప్లోకోకస్ బ్యాక్టీరియాను 'నిస్సేరియా గనేరియా' అని కూడా అంటారు.
* లైంగిక సంబంధం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీన్నే కోడ్ భాషలో STD (Sexually Transmitted Disease) అంటారు.
* వ్యాధి సంక్రమణ కాలం 2 నుంచి 8 రోజులు.
* జననావయవాలు ఈ వ్యాధి బారిన పడతాయి.
వ్యాధి లక్షణాలు:
* జననాంగాలు ఎరుపెక్కడం లేదా వాయడం, జననాంగాలపై పుండ్లు లేదా ఏర్పడిన పుండ్ల నుంచి చీము కారడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట రావడం ఈ వ్యాధి లక్షణాలు.

 

సిఫిలిస్
* 'ట్రిపోనిమా పల్లిడమ్' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* ట్రిపోనిమా పల్లిడమ్ అనేది సర్పిలాకారంలో ఉండే సూక్ష్మజీవి.
* ప్రధానంగా లైంగిక చర్యల ద్వారా సంక్రమిస్తుంది. కానీ ప్రత్యక్ష స్పర్శ ద్వారా కూడా సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు:
* జననావయవాలపై గట్టి పుండ్లు ఏర్పడటం లేదా ఎర్రటి గుల్లలు ఏర్పడతాయి. చర్మంపై తీవ్రమైన బొబ్బలు ఏర్పడతాయి.
* జననావయవాలు ఈ వ్యాధివల్ల ప్రభావానికి గురవుతాయి.
* కణజాల ధ్వంసం కూడా సంభవిస్తుంది.
* వ్యాధి సంక్రమణకు 10 నుంచి 90 రోజులు పడుతుంది.
* వ్యాధి నిర్ధారణకు VDRL (Venerial Disease Research Lab) పరీక్ష చేస్తారు.

 

మెనింజైటిస్
* 'నిస్సెరా మెనింజైటిస్' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* కలుషిత నీరు ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది.
* ఈ వ్యాధి వల్ల మెదడు, వెన్నుపాము ప్రభావితమవుతాయి.

 

గొంతు పుండు 
* ఈ వ్యాధిని 'థ్రోట్ ఇన్‌ఫెక్షన్' అని కూడా అంటారు.
* 'స్ట్రెప్టోకోకస్' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* ఈ బ్యాక్టీరియా సోకిన గొంతు నుంచి నోటి ద్వారా వెలువడే తుంపర్లు ఈ వ్యాధికి వాహకంగా పని చేస్తాయి.
* ముక్కు పొరల నుంచి కూడా ఈ బ్యాక్టీరియా వెలువడి వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది.
* వ్యాధి సంక్రమణకు 3 నుంచి 5 రోజులు పడుతుంది.
* ఈ వ్యాధికి గొంతు, ముక్కు ప్రభావితమవుతాయి.
వ్యాధి లక్షణాలు: గొంతు పుండు పడటం; తరచుగా దగ్గు, జ్వరం రావడం.


బొటులిజం 
* 'క్లాస్ట్రీడియం బొటులినమ్' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* కలుషిత ఆహారం ఈ వ్యాధికి వాహకంగా పనిచేస్తుంది.
* జీర్ణాశయం ఈ వ్యాధి బారిన పడుతుంది.
* ఈ వ్యాధి సంక్రమణకు 18 నుంచి 66 గంటలు మాత్రమే పడుతుంది.
వ్యాధి లక్షణాలు: వాంతులు, విరేచనాలు, వికారం, అలసట, అతిసారం, దృష్టి లోపాలు, పక్షవాతం.


ఆంథ్రాక్స్
* 'బాసిల్లస్ ఆంథ్రాసిస్' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* పశువుల పాలు, మాంసం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
* ఈ వ్యాధి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.


ప్లేగు
* ఈ వ్యాధిని 'బ్యుబోనిక్ ప్లేగు' అని కూడా అంటారు.
* 'షార్ట్‌రాడ్ యెర్సినియా పెస్టిస్' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.
* ఈ బ్యాక్టీరియాను 'పాశ్చరెల్లా పెస్టిస్' అని కూడా అంటారు.
* ఎలుకల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
* వ్యాధి సంక్రమణకు 2 నుంచి 10 రోజులు పడుతుంది.
వ్యాధి లక్షణాలు:
* అకస్మాత్తుగా జ్వరం రావడం, వాంతులు, వేడితో కూడిన పొడి చర్మం, చర్మంమీద నల్లటి మచ్చలు, ఉరఃసంధిలోని శోషరస కణుపులు వాయడం, కండరాలు వంకరపోవడం.
* వ్యాధి నివారణకు 'టెట్రాసైక్లిన్' అనే మందును వాడతారు.

 

బాసిల్లరి డీసెంట్రీ
* ఇది 'షిజెల్లా డిసెంట్రియా' అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది.
* ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు వాహకాలుగా పనిచేస్తాయి.
* వ్యాధి సంక్రమణకు ఒకటి నుంచి 4 రోజులు పడుతుంది.
వ్యాధి లక్షణాలు: జ్వరం, వికారం, వాంతులు, విరేచనాలు, పొత్తికడుపులో నొప్పి, మలంలో రక్తం పడటం.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.