• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగం

భారత రాజ్యాంగ పరిషత్ - ముఖ్యాంశాలు
* రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును మొదటిసారిగా 1942లో ప్రతిపాదించింది క్రిప్స్ మిషన్.
* రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను గురించి మొదట చెప్పిన వ్యక్తి ఎం.ఎన్. రాయ్.
* క్యాబినెట్ మిషన్ సూచన మేరకు రాజ్యాంగ పరిషత్‌ను 1946లో ఏర్పాటు చేశారు.
* రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు 1946 జులై నుంచి సెప్టెంబరు వరకు జరిగాయి.
* 1946, డిసెంబరు 9న రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగింది.
* మొదటి సమావేశానికి డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు.
* 1946, డిసెంబరు 11న డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
* 1946, డిసెంబరు 13న జవహర్‌లాల్ నెహ్రూ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
* లక్ష్యాల తీర్మానాన్ని 1947 జనవరి 22న ఆమోదించారు.
* 1947 జులై 22న జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.
* రాజ్యాంగ ముసాయిదా కమిటీని 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేశారు.
* 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు.
* 1950 జనవరి 24న చివరిసారిగా సమావేశం జరిగింది. ఈ చివరి సమావేశంలోనే జాతీయ గీతం, జాతీయ గేయాలను ఆమోదించారు.
* 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
* రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలు, సంస్థానాలకు ప్రాతినిధ్యం కల్పించారు.
* రాష్ట్రాల విధాన సభల సభ్యులు ఓటు బదిలీ అనే పద్ధతి ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు.
* మొత్తం సభ్యుల సంఖ్య 389.
* రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 292.
* స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 93.
* చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య 4.
* దేశ విభజన తర్వాత సభ్యుల సంఖ్య 299.
* 299 మందిలో ఎన్నికైన సభ్యులు 229, నామినేటెడ్ సభ్యులు 70.
* మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211.
* రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
* సమావేశాలు నిర్వహించిన మొత్తం రోజులు 165.
* మొత్తం నిర్వహించిన సమావేశాలు 11.
* రాజ్యాంగ పరిశీలనకు పట్టిన సమయం 114 రోజులు.
* రాజ్యాంగ రచనకు అయిన మొత్తం ఖర్చు 64 లక్షలు.
* సంప్రదించిన రాజ్యాంగాలు 60.
* రాజ్యాంగ పరిషత్తులో మొత్తం మహిళా సభ్యులు 9 మంది.
* రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు.
* మౌలిక రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి.
* ప్రస్తుత రాజ్యాంగంలో 462 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి.

 

భారత రాజ్యాంగంలో వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు

దేశ రాజ్యాంగం

గ్రహించిన అంశాలు

ఆస్ట్రేలియా

ఉమ్మడి జాబితా, పీఠికలో వాడిన భాష

రష్యా

ప్రాథమిక విధులు

అమెరికా

ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయవ్యవస్థ, ఉపరాష్ట్రపతి ఎన్నిక, న్యాయ సమీక్ష, రాష్ట్రపతి తొలగింపు

దక్షిణాఫ్రికా

రాజ్యాంగ సవరణ, రాజ్యసభ సభ్యుల ఎన్నిక

ఫ్రాన్స్

గణతంత్ర వ్యవస్థ

కెనడా

బలమైన కేంద్రప్రభుత్వం, కేంద్రానికి అవశిష్టాధికారాలు, సమాఖ్య విధానం

బ్రిటన్

సమన్యాయ పాలన, ఏక పౌరసత్వం, స్పీకర్ హోదా, విధులు, క్యాబినెట్ తరహా పార్లమెంటరీ విధానం

జపాన్

న్యాయసూత్రాలు, చట్టం నిర్ధారించిన విధానం

జర్మనీ

అత్యవసర పరిస్థితికి సంబంధించిన అధికారాలు

ఐర్లాండ్

ఆదేశిక సూత్రాలు, రాజ్యసభకు విశిష్ట వ్యక్తులను నామినేట్ చేయడం, రాష్ట్రపతి ఎన్నిక

భారత ప్రభుత్వ చట్టం 1935

రాష్ట్రపతికి, రాష్ట్రగవర్నర్లకు విశిష్ట అధికారాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన, ద్విసభా విధానం

రాజ్యాంగ ప్రవేశికపై ప్రముఖుల వ్యాఖ్యానాలు
* ''ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ లాంటిది''.- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
* ''ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం లాంటిది''- ఎం.ఎ. నానీఫాల్కీవాలా
* ''ఇదొక నిశ్చయాత్మక తీర్మానం, ఒక హామీ''- జవహర్ లాల్ నెహ్రూ
* ''ప్రవేశిక అనేది మన కలలు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం''- అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
* 'ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది' - జె. డయ్యర్
* ''అమెరికా స్వతంత్ర ప్రకటనకు అమెరికా రాజ్యాంగానికి ఎలాంటి సంబంధం ఉందో అదేవిధమైన సంబంధం భారత రాజ్యాంగ ప్రవేశికకు, భారత రాజ్యాంగానికి మధ్య ఉంది''- కె.ఆర్. బాంజ్‌వాలా
* ''భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వతంత్ర ప్రకటనలాగే రాజ్యాంగ ఆత్మ, ప్రాణం, రాజకీయ వ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు''- జస్టిస్ హిదయతుల్లా
* ''ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం. ఇది రాజ్యాంగ ఆత్మ, రాజ్యాంగానికి బంగారు ఆభరణ తాళంచెవి లాంటిది''- పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ
* ''ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం''- కె.ఎం. మున్షి

* ''ప్రవేశిక అనేది రాజ్యాంగానికి కీలక సూచిక లాంటిది. అలాంటి సూచికలు సాధారణంగా పాశ్చాత్య రాజ్య వ్యవస్థలో ఉంటాయి. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నందుకు నేను పులకించి గర్వపడుతున్నాను''- సర్ ఎర్నస్ట్ బార్కర్
 

భారత రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యలు
* కె.సి.వేర్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా అభివర్ణించారు.
* ఐవర్ జెన్నింగ్ న్యాయవాదుల స్వర్గం అని పేర్కొన్నారు.
* గాడ్విన్ ఆస్టిన్ సహకార సమాఖ్యగా వర్ణించారు.
* హెచ్.వి. కామత్ ఐరావతంతో పోల్చారు.
* ఐ.పి. గోయల్ సర్దుబాటు సమాఖ్యగా పేర్కొన్నారు.
* ''రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు. అమలుపరిచేవారిని నిందించాలి'' - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

 

రాజ్యాంగ రచనలో వివిధ కమిటీలు - అధ్యక్షులు

కమిటీలు

అధ్యక్షులు

» ప్రాథమిక హక్కులు

సర్దార్ వల్లభాయ్ పటేల్

» రాష్ట్రాలకు సంబంధించిన కమిటీ

సర్దార్ వల్లభాయ్ పటేల్

» నిబంధనల కమిటీ

డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్

» స్టీరింగ్ కమిటీ డాక్టర్

డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్

» ప్రాథమిక హక్కుల ఉప కమిటీ

జె.బి. కృపలానీ

» డ్రాఫ్టింగ్ కమిటీ

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

» ఈశాన్య రాష్ట్రాల (గిరిజన), అస్సాం ప్రాంతాల కమిటీ

గోపీనాథ్ బార్డోలి

» మైనారిటీల కమిటీ

హెచ్.సి. ముఖర్జీ

» సుప్రీంకోర్టు అడహాక్ కమిటీ

ఎస్. వరదాచారి

» కేంద్ర అధికారాలు, కేంద్ర రాజ్యాంగ కమిటీ

జవహర్‌లాల్ నెహ్రూ

» ఆర్థిక, స్టాఫ్ కమిటీ

డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్

» క్రెడెన్షియల్ కమిటీ

అల్లాడి కృష్ణస్వామి అయ్యర్

» సభా కమిటీ

భోగరాజు పట్టాభి సీతారామయ్య

» అస్సాం ప్రాంతాలను మినహాయించి ఇతర ప్రాంతాల సబ్‌కమిటీ

ఎ.వి. ఠక్కర్

» ఆర్థిక అంశాలపై కమిటీ

నళినీ రంజన్ సర్కార్

» రాజ్యాంగ పరిశీలనా కమిటీ

అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, జవహర్‌లాల్ నెహ్రూ

» జాతీయ పతాక తాత్కలిక కమిటీ

డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్

» చీఫ్ కమిషనర్‌ల ప్రాంతాలపై కమిటీ

డాక్టర్ పట్టాభి సీతారామయ్య

» సలహా సంఘం

సర్దార్ వల్లభాయ్ పటేల్

» కమిషన్ ఆన్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్

ఎస్.కె. థార్

» ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ

కె.ఎం. మున్షి

» రాజ్యాంగ పరిషత్ విధులపై కమిటీ

గణేశ్ వాసుదేవ మౌలంకర్

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.