• facebook
  • whatsapp
  • telegram

ప్రముఖ వ్యక్తులు - నినాదాలు

జాతీయ వ్యక్తులు:

నినాదం

వ్యక్తి

* గోబ్యాక్ టు వేదాస్ (వేదాలకు మరలండి)

-

స్వామి దయానంద సరస్వతి

* నాకు రక్తాన్ని ఇవ్వండి - మీకు నేను స్వాతంత్య్రం ఇస్తాను

-

సుభాష్ చంద్రబోస్

* ఢిల్లీ చలో

-

సుభాష్ చంద్రబోస్

* జైహింద్

-

సుభాష్ చంద్రబోస్

* జై జవాన్, జై కిసాన్

-

లాల్‌ బహదూర్ శాస్త్రి

* సత్యం, అహింస నాకు దేవుళ్లు

-

మహాత్మా గాంధీ

* డూ ఆర్ డై (చేయండి లేదా చావండి)

-

మహాత్మా గాంధీ

* బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం

-

మహాత్మా గాంధీ

* బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది

-

మహాత్మా గాంధీ

* సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వులాంటిది

-

మహాత్మా గాంధీ

* ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్

-

స్వామి దయానంద సరస్వతి

* భారతదేశం, భారతీయుల కొరకే

-

స్వామి దయానంద సరస్వతి

* ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి

-

లాలా లజపతిరాయ్

* కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసిందీ కాదు

-

లాలా లజపతిరాయ్

* ముందుకు సాగండి

-

మేడం బికాజికామా

* నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి

-

సర్దార్ వల్లభాయ్ పటేల్

* రోజ్‌గార్ బడావో

-

మన్మోహన్‌సింగ్

* జై విజ్ఞాన్

-

అటల్‌బిహారి వాజ్‌పేయి

* భారతదేశానికి హిందువులు, ముస్లింలు రెండు కళ్లులాంటివారు

-

సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్

* రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణ వాయువులాంటిది

-

అరబిందో ఘోష్

* ప్రజలే ప్రభువులు

-

లోక్‌సత్తా

* ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు

-

జవహర్‌లాల్ నెహ్రూ

* ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం

-

జవహర్‌లాల్ నెహ్రూ

* చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది

-

జవహర్ లాల్ నెహ్రూ

* ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం

-

శ్రీశ్రీ

* భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే

-

ఎం.కె. ధింగ్రా

* ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి)

-

భగత్‌సింగ్

* స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను

-

బాలగంగాధర తిలక్

* దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను

-

బాలగంగాధర తిలక్

* పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్లు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు

-

గోపాలకృష్ణ గోఖలే

* ఆధునిక విద్య, విజ్ఞానాల్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించటం సాధ్యం కాదు

-

రాజారామ్మోహన్‌రాయ్

* కళ కళ కోసం కాదు ప్రజల కోసం

-

బళ్ళారి రాఘవ

* గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది

-

భోగరాజు పట్టాభి సీతారామయ్య

* దేశ్ బచావో, దేశ్ బనావో

-

పి.వి.నరసింహారావు

* వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం

-

గుర్రం జాషువా

* ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం

-

వి.డి.సావర్కర్

* నా తెలంగాణ కోటి రతనాల వీణ

-

దాశరథి కృష్ణమాచార్యులు

* బోదెను చేధిస్తే ఎండిన కొమ్మలు వాటంతటవే పడిపోతాయి

-

బాజీరావు I

* చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికై కృషిచేయండి

-

ఎ.పి.జె. అబ్దుల్ కలాం

* పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి

-

మోతీలాల్ నెహ్రూ

* నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను

-

ఇందిరాగాంధీ

* అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో

-

కందుకూరి వీరేశలింగం పంతులు

* బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు

-

మౌలానా అబుల్ కలాం ఆజాద్

* ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు

-

మౌలానా అబుల్ కలాం ఆజాద్

* బికారీ హఠావో

-

రాజీవ్ గాంధీ

* వాణి నా రాణి

-

పిల్లలమర్రి పినవీరభద్రుడు

* బ్రిటిషర్ల ఫించను పొందుతున్న రాజుల, నవాబుల జాబితాలో బతకటం కంటే సైనికుడిగా మరణించటమే మేలు

-

టిప్పుసుల్తాన్

* సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి

-

రవీంద్రనాథ్ ఠాగూర్

* స్వాతంత్య్రం అనేది ఓ కనిపించని మహా అదృష్టం, అది లేనప్పుడు గాని దాని విలువ తెలియదు

-

రవీంద్రనాధ్ ఠాగూర్

* అందరిలోనూ సామాన్యున్ని అయినా చిరంజీవుణ్ణి

-

సి.నారాయణరెడ్డి

* కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము

-

బి.ఆర్. అంబేడ్కర్

* మహారాష్ట్రులనంతా ఒకచోట చేర్చు. మతం మరలా జీవించేటట్లు చూడు. మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతున్నారు

-

గురు రామదాస్

* మానవులందరూ నా బిడ్డలవంటివారు

-

అశోకుడు

అంతర్జాతీయం వ్యక్తులు:

నినాదం

వ్యక్తి

* స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది

-

హిట్లర్

* స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి స్వాతంత్య్రం అలాంటిది

-

ముస్సోలిని

* వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, ధాన్యం కోసం యుద్ధం

-

ముస్సోలిని

* ప్రజలు విన్నట్లు స్వర్గం వింటుంది. ప్రజలు చూస్తున్నట్లు స్వర్గం చూస్తుంది

-

కన్ఫ్యూషియస్

* నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను

-

జూలియస్ సీజర్

* నాలెడ్జ్ ఈజ్ వపర్

-

జె.ఎల్.మిల్

* భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించినవాడవుతాడు

-

మాల్థస్

* ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్

-

అరిస్టాటిల్

*ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది

-

అరిస్టాటిల్

* నేనే రాజ్యాన్ని

-

లూయి XIV

* నా తర్వాత ప్రళయం వస్తుంది

-

లూయి XV

* స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్లతో బంధించబడ్డాడు

-

రూసో

* బ్యూటీ ఈస్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈస్ బ్యూటీ

-

జాన్‌కీట్స్

* నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నా నివాళ్లు అర్పించడానికి వచ్చాను

-

మార్టిన్ లూథర్ కింగ్

* బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తిమంతమైంది

-

అబ్రహం లింకన్

* నీకు బానిసగా ఉండటానికి ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటానికి కూడా ఇష్టపడకూడదు

-

అబ్రహం లింకన్

* ఇవ్వడానికి నా దగ్గర ఏమీలేదు. రక్తం, శ్రమ, కన్నీళ్లు తప్ప

-

విన్‌స్టన్ చర్చిల్

* లిపి పుట్టుకే నాగరికతల ఆవిర్భావానికి చిహ్నం

-

గార్డెన్ చైల్డ్

* శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది

-

రాబర్ట్ స్టీల్

* మతం మత్తుమందు వంటిది

-

కారల్‌మార్క్స్

* పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప

-

కారల్ మార్క్స్

* చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డే తప్ప మరేమీ కాదు

-

కారల్‌మార్క్స్

* ప్రపంచ కార్మికులారా ఏకంకండి

-

కారల్ మార్క్స్

* అలవాటు అనే పదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది

-

సెయింట్ అగస్టీన్

* జన్మతః బ్రిటిష్‌వారు పాలకులు, హిందూ దేశస్థులు పాలింపబడేవారు మాత్రమే

-

కారన్‌వాలిస్

* నూరు పువ్వులు వికసించనీ, వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ

-

మావో సేటుంగ్

* నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని

-

నెపోలియన్

* అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం

-

నెపోలియన్

* ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్‌లోనే ఉద్భవిస్తాయి

-

నెపోలియన్

* చైనా నిద్రావస్థలో ఉన్న పెనుభూతం. దానికి మెలకువ వచ్చిన రోజు ప్రపంచంపై పాశ్చాత్య దేశాలు పెత్తనం అంతమవుతుంది

-

నెపోలియన్

* సంగీత విద్వాంసుడు ఫిడేలును ప్రేమించినట్లు నేను అధికారాన్ని ప్రేమిస్తాను

-

నెపోలియన్

* పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు, అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు

-

నెపోలియన్

* గివ్ మి స్పేస్ టు స్టాండ్ అవే ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఐ షల్ లిఫ్ట్ దిస్ ఎర్త్

-

ఆర్కిమెడిస్

* భారతదేశ వ్యాపారమే ప్రపంచ వ్యాపారమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆ దేశాన్ని తమ ఆధిప్యతంలో ఉంచుకోగలరో వారే ఐరోపాను నిరంకుశంగా పరిపాలించగలరు

-

రష్యా పీటర్ చక్రవర్తి

* ఆహారం కంటే ఫిరంగులే ముఖ్యం

-

గోరింగ్ (హిట్లర్ అనుచరుడు)

* కంటికి కన్ను పంటికి పన్ను

-

బాబిలోనియా నాగరికత

* రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది

-

జేమ్స్ I

* యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ

-

మిరాబో

* ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముందు ఈజిప్టు పిరమిడ్లు వెలవెలబోతాయి

-

వోల్టెర్

* సంతృప్తి చెందిన మూర్ఖుని కంటే అసంతృప్తితో ఉన్న సోక్రటీస్ నయం

-

జె.ఎల్. మిల్

* ఈ సెబాస్టపోల్ బురద నుంచి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది

-

కౌంట్ కవూర్

* నేను ఉపన్యాసాన్ని ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను

-

కౌంట్ కవూర్

* ప్రాచీన చరిత్ర రచనకు ఉపయోగపడే మానవ అస్థిపంజరాలు, పుర్రెలు, శిలాజాలు అనే ఆధార వస్తువుల్ని ప్రాచీన కాలం మనుషులుగా వర్ణించవచ్చు

-

మార్టిమర్ వీలర్

* ప్రపంచ ఆధిపత్యమో లేదా పతనమో

-

రెండో కైజర్ విలియం

* నేను న్యాయాన్ని ప్రేమించాను, అన్యాయాన్ని నిరసించను. అందువల్లే ఈ విధంగా ప్రవాసంలో మరణిస్తున్నాను

-

గ్రేగరి VII

* విప్లవం రోగం వంటిది, అగ్ని పర్వతంలాంటిది, పుట్టుకురుపు వంటిది

-

ఎటర్నిక్

* మానవ పరిణామ క్రమాన్ని ఒక గంట సినిమాగా తీస్తే అందులో 59 నిమిషాలు శిలాయుగానికే సరిపోతుంది

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.