• facebook
  • whatsapp
  • telegram

వివిధ ప్లాస్టిక్‌ల ఉపయోగాలు

పాస్టిక్ పేరు

ఉపయోగం

అల్పసాంద్రత గల పాలిథీన్

పాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ సంచులు, వర్షపు కోట్లు

అత్యధిక సాంద్రత గల పాలిథీన్

బొమ్మలు, విద్యుత్ బంధకాలు, పాత్రలు

పి.వి.సి (పాలీ వినైల్ క్లోరైడ్)

చేతి సంచులు, గ్రామ్‌ఫోన్ రికార్డులు, విద్యుత్ బంధకాలు

ఓర్లాన్

నీరు అంటని కార్పెట్‌లు, వస్త్రాలు, దుప్పట్ల తయారీ

యూరియా ఫార్మాల్డిహైడ్

బాటిల్ మూతలు, విద్యుత్ నిరోధకాలు, ఫ్త్లెవుడ్ అతికించడానికి, గుండీలు, అలంకరణ బొమ్మలు

మెలమైన్ ఫార్మాల్డిహైడ్

పగలని వంటింటి టేబుల్ వస్తువుల తయారీకి

టెఫ్లాన్

రసాయన పంపు భాగాలు, గాస్కెట్‌లు, అంటకుపోని వంట పాత్రలపై పూతకు

పాలిప్రొపిలీన్

విద్యుత్ పరికరాలు, విద్యుత్ బంధకాలు, మెడికల్ పరికరాలు, బొమ్మలు, పైపులు

నైలాన్ 6, 6

బ్రష్‌లు, తివాచీలు, దారాల తయారీకి

పాలిస్త్టెరీన్

విద్యుత్ బంధకాలు, దువ్వెనలు, టి.వి, ఫ్రిజ్‌ల లైనింగ్

టెరిలీన్

మాగ్నటిక్ టేపులు, ముడుతలు పడని వస్త్రాల తయారీకి

బెకలైట్

పెన్నులు, దువ్వెనలు, రేడియో, టి.వి. కేబినెట్, విద్యుత్ స్విచ్‌ల తయారీకి

ప్లాస్టిక్‌ల తయారీ విధానాలు

పాలీవినైల్ క్లోరైడ్: వినైల్ క్లోరైడ్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలివినైల్ క్లోరైడ్ ఏర్పడుతుంది.
పాలిథీన్: ఇథిలీన్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలీ ఇథిలీన్ ఏర్పడును. దీని వ్యాపార నామం పాలిథీన్
బెకలైట్: ఫినాల్‌ను ఫార్మాల్డిహైడ్‌తో ఆమ్లం లేదా క్షారం సమక్షంతో పాలిమరీకరణం జరిపినప్పుడు ఫినాల్ ఫార్మాల్డిహైడ్ రెజీన్ ఏర్పడుతుంది. దీన్నే బెకలైట్ అంటారు.
పాలిస్త్టెరీన్: స్త్టెరీన్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలీస్త్టెరీన్ ఏర్పడుతుంది.
యూరియా ఫార్మాల్డిహైడ్: యూరియా, ఫార్మాల్డిహైడ్‌లను క్షారం సమక్షంలో పాలిమరీకరణం జరిపినప్పుడు యూరియా ఫార్మాల్డిహైడ్ ఏర్పడుతుంది.
నైలాన్ 6, 6: ఎడిపిక్ ఆమ్లాన్ని హెక్సామిథిలీన్ డై ఎమైన్‌తో పాలిమరీకరణం జరిపినప్పుడు నైలాన్ 6, 6 ఏర్పడుతుంది.
టెఫ్లాన్: టెట్రాఫ్లోరో ఇథిలీన్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలి టెట్రా ప్లోరో ఇథిలీన్ ఏర్పడుతుంది. దీన్నే టెఫ్లాన్ అంటారు.
టెరిలీన్: డైమిథైల్ టెర్‌థాలేట్‌ను ఇథిలీన్ గ్త్లెకాల్‌తో పాలిమరీకరణం జరిపినప్పుడు టెరిలీన్ ఏర్పడుతుంది.
మెలమైన్ ఫార్మాల్డిహైడ్: మెలమైన్‌ను ఫార్మాల్డిహైడ్‌తో పాలిమరీకరణం జరిపినప్పుడు మెలమైన్ ఫార్మాల్డిహైడ్ ఏర్పడుతుంది.
పాలిప్రొపిలీన్: ప్రొపిలీన్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలిప్రొపిలీన్ ఏర్పడుతుంది.
ఓర్లాన్: వినైల్ సయనైడ్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు ఓర్లాన్ ఏర్పడుతుంది.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.