• facebook
  • whatsapp
  • telegram

విటమిన్లు

* విటమిన్లు శరీరానికి కావలసిన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు.
* Vital, Amines అనే పదాల నుంచి 'Vitamins' అనే పదం రూపొందింది.
* సర్ హెచ్.జి.హోప్‌కిన్స్ 1912లో మొదటిసారిగా పాలలో విటమిన్లను గుర్తించారు.
* విటమిన్లు అనే పేరును సూచించింది 'ఫంక్'.
* విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం 'విటమినాలజీ'.
* విటమిన్లు ద్రావణీయత ఆధారంగా 2 రకాలు:
        1) కొవ్వులో కరిగే విటమిన్లు
        2) నీటిలో కరిగే విటమిన్లు
* కొవ్వులో కరిగే విటమిన్లు A, D, E, K
* నీటిలో కరిగే విటమిన్లు B, C
* విటమిన్లు ఎంజైములకు సహ ఎంజైములుగా పనిచేస్తాయి.
* ఇవి సూక్ష్మ పోషకాలుగా వ్యవహరిస్తాయి.
* విటమిన్లు దేహ నిర్మాణంలో కానీ, శక్తినివ్వడంలో కానీ పాలుపంచుకోవు. కానీ దేహంలో జరిగే వివిధ జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి.

 

విటమిన్ - ఎ
* విటమిన్ A రసాయనిక నామం 'రెటినాల్'.
* మరో పేరు 'యాంటీ గ్జెరాఫ్తాల్మిక్ విటమిన్'.
* ఇది కంటిచూపునకు తోడ్పడే విటమిన్.
* రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది.
* రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది.
* మొక్కల్లో విటమిన్ A బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది.
* ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ Aగా మారుతుంది.
* రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ A ఉండాల్సిన పరిమాణం 750 మి.గ్రా.
* విటమిన్ A లోపం వల్ల ప్రతి ఏడాది భారత్‌లో అంధత్వానికి గురయ్యేవారి సంఖ్య 60వేలని ఒక అంచనా.
* దీని లోపం వల్ల రేచీకటే కాకుండా వర్ణాంధత్వం కూడా సంభవిస్తుంది.
లభ్యమయ్యే పదార్థాలు: బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేపనూనె, పాలు, పసుపు పచ్చని ఫలాలు (గుమ్మడి పండు, జామ పండు), కాలేయం, వెన్న, టొమాటో
* మానవ శరీరం 6 నెలల పాటు విటమిన్ Aను నిల్వ ఉంచుకోగలదు.
* జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రతి 6 నెలలకు ఒకసారి పాఠశాల పిల్లలకు విటమిన్ Aను అందించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని సిఫార్సు చేసింది.
* విటమిన్ A లోపించడం వల్ల చర్మం పొడిబారుతుంది.
* కనుగుడ్లు ఎండిపోవడాన్ని 'జెరాఫ్తాల్మియా' అంటారు.
* విటమిన్ Aకు 'యాంటీ ఇన్‌ఫెక్టివ్' విటమిన్ అనే మరో పేరు కూడా ఉంది.
* నేత్రగోళం మీద కార్నియా శాశ్వతంగా నశించిపోవడాన్ని 'కేరటోమలేసియా' అంటారు.
* లాక్రిమల్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు ఆగిపోవడం వల్ల నేత్రాలు పొడిబారిపోయి జెరాఫ్తాల్మియాకు కారణమవుతుంది.
* రేచీకటి వ్యాధినే 'నిక్టిలోఫియా' అంటారు.
* కన్ను తెల్ల గుడ్డు మీద తెల్లని చారలు మచ్చల్లా కనిపిస్తాయి. వీటిని బైటాల్ చుక్కలు అంటారు. ఇవి విటమిన్ A లోపం వల్ల ఏర్పడతాయి.


విటమిన్ - బి
విటమిన్ - బి కాంప్లెక్స్ 8 రకాలు
1) విటమిన్ - బి1:
* దీని రసాయన నామం 'థయమిన్'.
* వాడుక పేర్లు యాంటీ బెరిబెరి, యాంటీ న్యూరైటిస్ విటమిన్.
* పాలిష్ చేసిన బియ్యంలో ఈ విటమిన్ లోపిస్తుంది.
* హృదయ స్పందన క్రమరహితమవడాన్నే 'బెరిబెరి' అంటారు.
* నరాలు బలహీనమవడం, పాక్షిక పక్షవాతాన్నే పాలీన్యూరైటిస్ అంటారు.
లభ్యమయ్యే పదార్థాలు: వేరుశనగ, తవుడు, సోయాబీన్స్, దంపుడు బియ్యం, గంజి, బియ్యం, గోధుమ, జొన్నల్లోని పై పొరలు.


2) విటమిన్ - బి2:
* దీని రసాయన నామం 'రైబోఫ్లేవిన్'.
* వాడుక పేర్లు ఎల్లో విటమిన్, యాంటీ ఖీలోసిస్ విటమిన్, యాంటీ గ్లాసైటిస్ విటమిన్, విటమిన్ G.
* ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం విటమిన్-బి2.
లోపం వల్ల వచ్చే వ్యాధులు: ఖీలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైటిస్.
* నోటి మూలలు పగలడాన్ని 'ఖీలోసిస్' అంటారు.
* గ్లాసైటిస్‌లో వ‌ల్ల‌ నాలుకపై పూత, నాలుక మంట కనిపిస్తాయి.
* ముఖంపై చర్మం పాలిపోవడాన్నే 'డెర్మటైటిస్' అంటారు.
లభ్యమయ్యే పదార్థాలు: కొబ్బరి, బార్లీ, జీడిమామిడి, బాదం పప్పు, రాగులు, తవుడు, బొప్పాయి, గుడ్లు, పాలు, కాలేయం, మూత్రపిండం.
* పాలను బాగా మరగబెట్టినప్పుడు అవి లేత పసుపు రంగు పొందడానికి కారణం పాలలో రైబోఫ్లేవిన్ ఉండటమే.

 

3) విటమిన్ - బి3:
* దీని రసాయన నామం 'నియాసిన్' లేదా 'నికోటిక్ ఆమ్లం' లేదా 'నికోటినమైడ్'.
* వాడుక పేర్లు యాంటీ పెల్లాగ్రా విటమిన్, 4D విటమిన్, సుస్థిర విటమిన్, విటమిన్-PP.
* ఇది NDP, ADP సంయోగాల తయారీలో క్రియాశీలకంగా పనిచేస్తుంది.
* ఈ విటమిన్‌ను ఆక్సీకరణ, ఉష్ణం తేలికగా నాశనం చేయలేవు.
లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెల్లాగ్రా, పెదాలు లావెక్కడం, మచ్చలతో, మందమైన చర్మంతో అరిచేతులు తయారవడం.
* చర్మం గరుకుగా తయారై, పొలుసులుగా ఏర్పడి ఊడిపోవడాన్ని 'పెల్లాగ్రా' అంటారు.
లభ్యమయ్యే పదార్థాలు: ముల్లంగి, బఠాణీ, కాలేయం, ఈస్ట్, చేపలు, వేరుశనగ.

 

4) విటమిన్ - బి5:
* దీని రసాయన నామం 'పాంటోథెనిక్ ఆమ్లం'.
* ప్రకృతిలో విరివిగా లభించడం వల్ల దీన్ని 'సర్వ విస్తృత విటమిన్' అంటారు.
* గ్రీకు భాషలో పాంటోథస్ అంటే ప్రతిచోటా అని అర్థం.
లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెరుగుదల మందగించడం, వెంట్రుకలు రాలడం, బాలనెరుపు, ఆర్థరైటిస్, బర్నింగ్‌ఫీట్.
* కీళ్లవాతాన్నే ఆర్థరైటిస్ అంటారు.
* అరికాళ్లు, అరిచేతుల్లో మంటలు పుట్టడాన్ని 'బర్నింగ్ ఫీట్' అంటారు.
లభ్యమయ్యే పదార్థాలు: కాయగూరలు, కాలేయం, గుడ్డు, మాంసం, చిలగడదుంప, చేపలు, పాలు, ఈస్ట్, ధాన్యాలు, పండ్లు.


4) విటమిన్ - బి6:
* దీని రసాయన నామం 'పైరిడాక్సిన్'.
* వాడుక నామం యాంటీ అనీమియా విటమిన్.
* అమైనో ఆమ్లాల ఉత్పత్తిలో, జీర్ణక్రియలో B6 విటమిన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది.
* ప్రతిరక్షకాలు, హిమోగ్లోబిన్‌ల ఉత్పత్తిలో పాల్గొంటుంది.
లోపం వల్ల వచ్చే వ్యాధులు: అజీర్తి, రక్తహీనత, ఫిట్సు లాంటి వ్యాధులు, కోపం ఎక్కువగా రావడం, అనీమియా, మొటిమలు, చర్మ వ్యాధులు.
లభించే పదార్థాలు: గోధుమ, దంపుడు బియ్యం, సోయాచిక్కుడు, మాంసం, గుడ్లు, కాలేయం, పాలు, గుడ్డుసొన.

 

5) విటమిన్ - బి7:
* దీన్ని విటమిన్ H అంటారు.
* సల్ఫర్ మూలకం కలిగిన విటమిన్ ఇది.
* 1939లో ఈ విటమిన్‌ను కనిపెట్టారు.
* అమైనో ఆమ్లాల, కొవ్వు ఆమ్లాల జీవన క్రియల్లో తోడ్పడుతుంది.
* పచ్చిగుడ్డు తాగడం వల్ల శరీరం విటమిన్ B7ను కోల్పోతుంది.
* దీని రసాయన, వాడుక నామం 'బయోటిన్'.
లోపం వల్ల వచ్చే వ్యాధులు: కండరాల నొప్పులు, అలసట, నాడీ మండలంలో తేడాలు సంభవించడం, మానసిక రుగ్మత, రక్తంలో కొలెస్ట్రాల్ అధికమవడం, ఆకలి మందగించడం.
లభించే పదార్థాలు: చేపలు, మాంసం, సోయాచిక్కుడు, టొమాటో, పాలు, కాలేయం, మూత్రపిండం, గింజలు, కాయగూరలు.

 

6) విటమిన్ - బి11:
* వాడుక నామం 'ఫోలిక్ ఆమ్లం' లేదా 'ఫొలాసిస్'. రసాయన నామం కూడా ఇదే.
* దీన్ని M - విటమిన్ అని కూడా అంటారు.
* దీన్ని ఎల్లాప్రగడ సుబ్బారావు కనుక్కున్నారు.
* గర్భిణీ స్త్రీలకు మొదటిసారిగా ఇచ్చే విటమిన్ ఫోలిక్ ఆమ్లం.
* ఈ ఆమ్లం స్పినాక్ పత్రాల నుంచి మొదటిసారిగా లభ్యమైంది.
* 'ఫోలియం' అంటే 'పత్రం' అని అర్థం.
* కోలిన్, సీరైన్‌ల సంశ్లేషణలో, న్యూక్లిక్ ఆమ్లాల (DNA, RNA) సంశ్లేషణలో ఫోలిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది.
లోపం వల్ల వచ్చే వ్యాధులు: రక్తహీనత, అతిసారం, మానసిక రుగ్మతలు.
లభించే పదార్థాలు: మొక్కజొన్న, గోధుమ, మొలకెత్తే గింజలు, ఆకుకూరలు, ధాన్యాలు, ఫలాలు, పాలు, గుడ్డు, మాంసం, కాలేయం.

 

7) విటమిన్ - బి12:
* దీని రసాయన నామం 'సయనకోబాలమిన్'
* దీని మరో రసాయన నామం 'కోబాలమిన్'
* దీన్నే 'యాంటీ ఫెర్నీషియస్ ఎనీమియా' విటమిన్ అంటారు.
* నీలి రంగులో ఉంటూ కోబాల్ట్ (Co) అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది.
* ఇది కేంద్రకామ్లాల సంశ్లేషణలో, ఎర్ర రక్తకణాలు ఏర్పడడానికి, యాంటీబాడీల ఉత్పత్తికి, నాడీ కణపు మైలిన్ తొడుగు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.
లోపం వల్ల వచ్చే వ్యాధులు: పెర్నీషియస్ అనీమియా, మాక్రోసైటిక్ అనీమియా, బాలింతల్లో పాల ఉత్పత్తి కుంటుపడుట, హానికర రక్తహీనత.
లభించే పదార్థాలు: కోడిమాంసం, పాలు, గుడ్డు, కాలేయం.

 

విటమిన్ - సి
* దీని రసాయన నామం 'ఆస్కార్బిక్ ఆమ్లం'.
* దీని వాడుక నామం 'యాంటీ స్కర్వీ విటమిన్'.
* గాయాలు త్వరగా మానడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది.
* కణాంతరాల్లో కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదపడుతుంది.
* దంతాలలో డెంటిన్ అనే పదార్థం ఏర్పడటానికి దోహదం చేస్తుంది.
* దీని లోపం వల్ల రక్తనాళాలు పెళుసుగా అవుతాయి. చిగుళ్లు చిట్లి రక్తస్రావం జరుగుతుంది.
* స్కర్వీ వ్యాధిని 'సెయిలర్స్ డిసీజ్' అని కూడా అంటారు.
లభించే పదార్థాలు: సిట్రస్ జాతి ఫలాలు (నిమ్మ, ఉసిరి), జామకాయలు, టొమాటో, ఆకుకూరలు.

 

విటమిన్ - డి
* దీని రసాయన నామం 'కాల్సిఫెరాల్'.
* వాడుక నామాలు సన్‌షైన్ విటమిన్, ఫ్రీ విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్, యాంటీ రికెటింగ్ విటమిన్.
* అన్నవాహిక నుంచి కాల్షియం, ఫాస్ఫరస్‌లను ఎక్కువగా గ్రహించి ఎముకలు ఏర్పడటానికి, గట్టిపడటానికి తోడ్పడుతుంది.
* సూర్యరశ్మిలోని UV కిరణాల ద్వారా చర్మం కింద గల కొలెస్టరాల్ విటమిన్ Dగా తయారవుతుంది.
* చిన్న పిల్లల్లో విటమిన్ D లోపం వల్ల రికెట్స్, పక్షి లాంటి ఛాతీ, రాకిటిక్ రోజరీ అనే వ్యాధులు వస్తాయి.
* పెద్దవారిలో ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధులు వస్తాయి.
* దొడ్డికాళ్లు, ముట్టికాళ్లు ఏర్పడడాన్ని 'రికెట్స్' అంటారు.
* పక్కటెముకల్లో బుడిపెలు ఏర్పడటాన్ని రాకిటిక్ రోజరీ అంటారు.
లభించే పదార్థాలు: సూర్యరశ్మి, కాడ్, షార్క్ చేపల కాలేయనూనె, పాలు, క్యాబేజీ, గుడ్డు (పచ్చసొన).
* ప్రపంచంలో 80% మంది డి-విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక తెలుపుతోంది.

 

విటమిన్ - ఇ
* దీని రసాయన నామం 'టోకోఫెరాల్'.
* వాడుకనామాలు 'బ్యూటీ విటమిన్', 'యాంటీ స్టెరిలిటీ విటమిన్'.
* త్వచాల నిర్మాణానికి, యాంటీ ఆక్సిడెంట్‌గా, కొటోజెనెసిస్, లైపోజెనెసిస్ ఆక్సీకరణ ప్రక్రియలకు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమ నిర్వహణకు, ముఖంపై ముడుతలు రాకుండా ఉండటానికి E విటమిన్ ఉపయోగకరం.
లోపం వల్ల వచ్చే వ్యాధులు: కండరాల క్షీణత, ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నమవడం, పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో రుతుస్రావం, గర్భస్రావం.
లభించే పదార్థాలు: సోయా చిక్కుడు, పత్తి గింజల నూనె, పామ్ ఆయిల్, గోధుమ, చిలగడ దుంపలు, పొద్దు తిరుగుడు గింజల నూనె, ఫలాలు.


విటమిన్ - కె
* దీని రసాయన నామం 'నాఫ్తోక్వినోన్' లేదా 'ఫిల్లోక్వినోన్'.
* వాడుక నామాలు రక్త స్కందన విటమిన్, రక్త స్రావక నిరోధక విటమిన్ (కొయాగ్యులేషన్ విటమిన్).
* ప్రోథ్రాంబిన్ ఏర్పరచడంలో ఉపయోగపడుతుంది.
* రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడుతుంది.
లోపం వల్ల వచ్చే వ్యాధులు: గాయాలైనప్పుడు ఆగని రక్తస్రావం, పిల్లల్లో పచ్చ కామెర్లు.
* విటమిన్ Kను కనుక్కున్నవారు డాయిసీడాం.
లభించే పదార్థాలు: క్యాలీఫ్లవర్, క్యాబేజీ, గుడ్లు, ఆకుకూరలు, ఆవు పాలు, టొమాటో.
* ఆపరేషన్ చేయడానికి ముందు రోగికి, ప్రసవానికి ముందు తల్లికి కె విటమిన్‌ను ఇస్తారు.
* శరీరంలో విటమిన్లు మితిమీరి చేరితే కొన్ని విశిష్ట రోగ లక్షణాలు ఏర్పడతాయి. విటమిన్లు ఎక్కువైన స్థితిని 'అతి విటమినీయ స్థితి' అంటారు.
* సి విటమిన్ ఎక్కువైతే గౌట్ వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.
* డి విటమిన్ ఎక్కువైతే మృదుకణజాలం అస్థీకరణ చెందుతుంది.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.