• facebook
  • whatsapp
  • telegram

మానవుల్లో హెల్మింథిస్ / నెమటోడ్స్ వల్ల వచ్చే వ్యాధులు

ఆస్కారియాసిస్

* 'ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్' అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది.

ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్

* 'ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్'ను 'ఏలిక పాము' అని కూడా అంటారు.

* అపరిశుభ్రత వల్ల ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది.

* ఈ పరాన్నజీవి మానవుడి పేగులో ఉండి రోజుకు 2 లక్షల గుడ్లను పెడుతుంది. ఈ చర్య వల్ల ఆహార రవాణాలో ఆటంకం ఏర్పడి కడుపు నొప్పి, చిన్న పిల్లల్లో రక్తహీనత సంభవిస్తుంది.
 

ఎంటరోబియాసిస్

* 'ఎంటరోబియస్ వర్మిక్యులారిస్' అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది.

* ఈ వ్యాధినే 'పిన్‌వార్మ్ వ్యాధి' అని కూడా అంటారు.

* ఈ వ్యాధి వల్ల దురద, పాయువు చుట్టూ చీరుకుపోవడం, నిద్రలేమి, ఉండుకం (అపెండిక్స్) వాయడం సంభవిస్తాయి.

ఎంఖైలోస్టోమియాసిస్

* ఎంఖైలోస్టోమా డుయోడినేల్' అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది.     

* చెప్పులు లేకుండా మల మూత్రాలు చేసే ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఈ వ్యాధి జనక లార్వా (ఫెలేరిఫాం లార్వా) శరీరంలోకి ప్రవేశించి మానవుడి చిన్నపేగులో ఆవాసం ఏర్పరచుకుంటుంది.

* చర్మంపై ఎర్రని, దురద పుట్టించే పుండ్లు; రక్తహీనత, మలబద్ధకం, ఆంత్రమూలంలో పుండ్లు ఈ వ్యాధి వల్ల సంభవిస్తాయి.
 

షిస్టోసోమియాసిస్

* 'షిస్టోసోమా హిమటోబియమ్' అనే హెల్మింథిస్ వ్యాధికారకంగా పనిచేస్తుంది.

* ఈ వ్యాధిని 'బిల్హర్జియాసిస్' అని కూడా అంటారు.

* ఈ వ్యాధి సంక్రమణకు 'బులినస్' అనే నత్త సహకరిస్తుంది.

* ఈ వ్యాధికి 'స్విమ్మర్స్ ఇచ్' అనే మరో పేరు కూడా కలదు.

* ఈ వ్యాధి జనకం మూత్రాశయం, శ్రోణి సిరల్లో నివసిస్తుంది.

* జ్వరం, కాలేయం, వాపు, మూత్రంతోపాటు రక్తం పడటం; దురద, మంట లాంటి లక్షణాలు ఈ వ్యాధి ద్వారా సంక్రమిస్తాయి.

ఫైలేరియాసిస్

* ఈ వ్యాధికి బోదకాలు, ఎలిఫెంటియాసిస్ అనే పేర్లు ఉన్నాయి.

ఉచరేరియా బ్రాంకాఫ్టి

* 'ఉచరేరియా బ్రాంకాఫ్టి' అనే హెల్మింథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది.

* శోషరస నాళాలు, శోష కణాల్లో ఇది నివసిస్తుంది.

* ఈ వ్యాధి వల్ల కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు ఉబ్బుతాయి.
 

టీనియాసిస్

* 'టీనియా సోలియం' అనే హెల్మింథిస్ ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది.

టీనియా సోలియం

* సరిగా ఉడికించని పంది మాంసం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

* కడుపు నొప్పి, అజీర్తి, మలబద్ధకం అనే లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.