• facebook
  • whatsapp
  • telegram

పంచాయతీ వ్యవస్థ


* పంచాయతీ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం రాజస్థాన్ (అక్టోబర్ 2, 1959).

* పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (నవంబర్ 1, 1959).

* » మూడంచెల పంచాయతీ వ్యవస్థను సూచించిన కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ (1957).

* » రెండంచెల పంచాయతీ వ్యవస్థను సూచించిన కమిటీ అశోక్ మెహతా కమిటీ (1977).

*» పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి సూచించిన కమిటీ ఎం.ఎం.సింఘ్వి కమిటీ (1986).

*» 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించింది.

*» పంచాయతీ నిర్మాణం రాజ్యాంగంలోని 9వ భాగంలో ప్రకరణ 243 (ఎ) నుంచి 243 (ఒ) వరకు ఉంది.

*» 11వ షెడ్యూల్‌లో పంచాయతీలకు 29 విధులను కేటాయించారు.

*» ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం (1994) 3 అంచెల వ్యవస్థను సూచించింది.

* (1) మొదటి అంచె - గ్రామ పంచాయతీ

* (2) రెండో అంచె - మండల పరిషత్

* (3) మూడో అంచె - జిల్లా పరిషత్

*» గ్రామ పంచాయతీకి రాజకీయ అధిపతి సర్పంచ్.

*» సర్పంచ్ పంచాయతీ సమావేశాలకు (గ్రామసభ) అధ్యక్షత వహిస్తాడు.

*» గ్రామ పంచాయతీకి ప్రభుత్వ అధికారి కార్యదర్శి.

*» సర్పంచ్ పదవీ కాలం 5 సంవత్సరాలు.

*» సర్పంచ్‌గా పోటీ చేయడానికి కావాల్సిన కనీస వయసు 21 సంవత్సరాలు.

*» సర్పంచ్‌కు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది.

*» మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌కు రూ.1000 గౌరవ వేతనం ఇస్తారు.

* (ప్రభుత్వం రూ. 500 చెల్లిస్తుంది. గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ నుంచి రూ.500 చెల్లిస్తారు)

*» మైనర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌కు రూ.600 గౌరవ వేతం ఇస్తారు.

* (ప్రభుత్వం రూ. 300 ఇస్తుంది. గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ నుంచి రూ.300 చెల్లిస్తారు)

*» సర్పంచ్ లేని సమయంలో ఉపసర్పంచ్ బాధ్యతలను నిర్వర్తిస్తారు.

*» క్రమానుసారంగా పంచాయతీ ఖాతాలను ఆడిట్ చేయించని సర్పంచ్, ఉప సర్పంచ్ తమ పదవులను కోల్పోతారు.

*» ఎన్నికలకు సంబంధించిన వివాదాల్లో ఒక వ్యక్తికి శిక్ష పడితే, పంచాయతీరాజ్ చట్టంలోని 233వ సెక్షన్ ప్రకారం... శిక్ష పడిన రోజు నుంచి 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదు.

*» సర్పంచ్ తన రాజీనామాను గ్రామపంచాయతీకి పంపాలి.

*» అన్ని రాష్ట్రాల్లోనూ పంచాయతీ సభ్యులను ప్రత్యక్ష పద్ధతి ద్వారానే ఎన్నుకుంటారు.

*» వార్డు సభ్యులకు ఎలాంటి వేతనాలు చెల్లించరు.

*» సమావేశాలు నిర్వహించినప్పుడు వార్డు సభ్యులకు రూ.75 చెల్లిస్తారు.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.