• facebook
  • whatsapp
  • telegram

మానవుడిలో జన్యు సంబంధ వ్యాధులు

థలసీమియా:  దీనివల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ క్షీణిస్తుంది.
వర్ణాంధత్వం:  ఈ వ్యాధిగ్ర‌స్థులు ప్రాథమిక రంగుల (ఎరుపు, నీలం, ఆకుపచ్చ)ను గుర్తించలేరు.
సికెల్‌సెల్ అనీమియా:  ఈ వ్యాధివల్ల ఎర్రరక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారి వర్ణవిహీనమవుతాయి.
ఆల్బినిజం:  ఈ వ్యాధి వల్ల మెలనిన్ లోపిస్తుంది. దీని లోపంతో చర్మం తెలుపు రంగులోకి మారుతుంది. శుక్లపటలంలో మార్పులు వస్తాయి.
టైరోసినోసిస్:  ఈ వ్యాధి వల్ల హైడ్రాక్సీ ఫినైల్ పైరూవిక్ ఆమ్లం, టైరోసిస్ మూత్రం ద్వారా విసర్జితమవుతాయి.
హీమోఫీలియా:  ఈ వ్యాధి లక్షణం - గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టకుండా నిరంతరాయంగా రక్తం స్రవిస్తుంది.
* ఈ వ్యాధిని రాయల్ డిసీజ్ అంటారు.
* ఈ వ్యాధి వల్ల రక్తస్రావం జరుగుతుంది. కాబట్టి బ్లీడర్ వ్యాధి అని కూడా అంటారు.
ఫినైల్ కీటోన్యూరియా:  ఒక జత అంతర్గత జన్యువుల ప్రభావం వల్ల రక్తం, మస్తిష్క మేరు ద్రవం, చెమటలో అధిక శాతం ఫినైల్ అలనైన్ ఉండి బుద్ధిమాంద్యానికి దారితీస్తుంది.
ఆల్కాప్టోన్యూరియా:  ఈ వ్యాధి ప్రభావం వల్ల ఎక్కువ పరిమాణంలో హోమో జెనెటిసిక్ ఎసిటిక్ ఆమ్లం మూత్రంలో కలసి నలుపు రంగులో విసర్జితమవుతుంది.
గాయిట్రస్ క్రెటినిజమ్:  తీవ్ర బుద్ధిమాంద్యం, అవటు గ్రంథి ఉబ్బడం ఈ వ్యాధి వల్లే సంభవిస్తాయి.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.