• facebook
  • whatsapp
  • telegram

గ్రంథులు - విధులు

పిట్యూటరీ గ్రంథి

* దీన్నే పీయూష గ్రంథి అని కూడా అంటారు.

పిట్యూటరీ గ్రంథి

* ఈ గ్రంథి దాదాపు 10 లేదా అంతకంటే ఎక్కువ హార్మోన్‌లను స్రవిస్తుంది. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు.

* ఇది మెదడు కింది భాగంలో బఠాని గింజ పరిమాణంలో ఉంటుంది.

* పెరుగుదల హార్మోన్, ఇతర హార్మోన్‌లను ఇదే ప్రేరేపిస్తుంది.

* పెరుగుదల హార్మోన్ లోపిస్తే మరుగుజ్జుతనం వస్తుంది.

పారాథైరాయిడ్

* ఇది థైరాయిడ్ గ్రంథికి దగ్గరలో ఉంటుంది.

* పారాథార్మోన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.

* ఈ గ్రంథి కాల్షియం, ఫాస్పేట్‌ల వ్యాప్తిని క్రమబద్ధం చేస్తుంది.

* ఎముకలు వృద్ధి చెందడానికి ఇది చాలా కీలకం.

క్లోమ గ్రంథి

* దీన్ని మిశ్రమ గ్రంథి అంటారు.     

* ఉదర భాగంలో జీర్ణాశయం కింద ఉంటుంది.

* ఇన్సులిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.

* ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిని నియంత్రిస్తుంది.

* శరీరంలో తగినంత ఇన్సులిన్ విడుదల కాకపోతే డయాబెటిస్ (షుగర్) వ్యాధి వస్తుంది.
 

థైరాయిడ్ గ్రంథి

* దీన్నే అవటు గ్రంథి అని కూడా అంటారు.

* ఇది గొంతు దగ్గర వాయు నాళానికి ఆనుకుని ఉంటుంది.

* ఇది థైరాక్సిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.

* మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ గ్రంథి వాపుకు గురవుతుంది.

* థైరాయిడ్ గ్రంథి వాపుకు గురవడం వల్ల 'గాయిటర్' అనే వ్యాధి వస్తుంది.

* ఈ హార్మోన్ యుక్త వయసులో లోపిస్తే 'క్రెటినిజం' అనే వ్యాధి వస్తుంది.

* వయోజన దశలో ఈ హార్మోన్ లోపిస్తే 'మిక్సిడెమ' అనే వ్యాధి వస్తుంది.
 

ఎడ్రినల్ గ్రంథి

* దీన్నే అధివృక్క గ్రంథి అని కూడా అంటారు.

* ఇది మూత్రపిండాలపై ఉంటుంది.

* ఎడ్రినలిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.

* ఒత్తిడి, కోపం, భయాందోళనలకు గురైనప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది.

* ఎడ్రినలిన్ హృదయ స్పందన రేటును, కండరాలకు రక్త సరఫరా రేటును పెంచుతుంది.

పురుష బీజకోశాలు

* వృషణాల్లో ముష్క గోణుల్లో పురుష బీజ కోశాలుంటాయి.

* పురష లైంగిక హార్మోన్లు అయిన టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్‌లను ఇవి ఉత్పత్తి చేస్తాయి. 

* వీటి వల్ల గౌణ లైంగిక లక్షణాలు వృద్ధి చెందుతాయి.

* పురష సంయోగ బీజాలైన శుక్రకణాల ఉత్పత్తిలో ఈ హార్మోన్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.
 

స్త్రీ బీజ కోశాలు 

* ఇవి మూత్రపిండాలకు దిగువన ఉంటాయి.     

* స్త్రీ లైంగిక హార్మోన్లు అయిన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌లను ఇవి స్రవిస్తాయి.     

* ఈ హార్మోన్‌లను స్త్రీలలో గౌణ లైంగిక లక్షణాల్ని అభివృద్ధి చేస్తాయి.     

* ఇవే హార్మోన్‌లు స్త్రీలలో రుతుచక్రాన్ని, ప్రత్యుత్పత్తి వ్యవస్థను నియంత్రిస్తాయి.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.