• facebook
  • whatsapp
  • telegram

జాతీయ, అంతర్జాతీయ తొలి సంఘటనలు - తొలి వ్యక్తులు

సంఘటన

ప్ర‌దేశం/ వ్యక్తులు

* ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ

-

లండన్ (1863)

* ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ

-

లండన్ (1890)

* ప్రపంచంలో తొలి గ్రంథం

-

రుగ్వేదం

* భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్

-

అప్సర (1956)

* తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు

-

ఇండో - గ్రీకులు

* భారత్‌లో తొలి పత్రిక

-

బెంగాల్ గెజిట్ (1780)

* దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం

-

ఆంధ్రప్రదేశ్ (1956)

* ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం

-

ముంబయి

* భారత్‌లో మొదటి మహిళా కళాశాల

-

బెతూన్ కళాశాల, కలకత్తా (1879)

* దేశంలో తొలి చమురు బావి

-

దిగ్బోయ్ (అస్సాం, 1890)

* ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం

-

జపాన్ (టోక్యో, 1964)

* మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు

-

కుక్క

* మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం

-

రాగి

* దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం

-

చామ్రవట్టం (కేరళ)

* భారత్‌లో తొలి నాగరికత

-

సింధు

* భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం

-

ముంబయి (1885)

* తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం

-

జనతా ప్రభుత్వం (1977 - 79)

* మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం

-

న్యూజిలాండ్ (1893)

* తొలి క్లోన్‌డ్ జంతువు

-

డాలీ అనే గొర్రె (1996)

* భారత్‌లో తొలిసారిగా భారజల ఉత్పత్తిని ప్రారంభించిన కేంద్రం

-

నంగల్ (పంజాబ్)

* భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా

-

పాలక్కడ్ (కేరళ)

* భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం

-

చోగ్లామ్‌సార్ (జమ్ము, కాశ్మీర్)

* తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా

-

మలప్పురం (కేరళ)

* భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం

-

మైసూర్ (కర్ణాటక)

* భారత్‌లో మొదటి సమాచార సాంకేతికత ఉన్న జిల్లా

-

పాలక్కడ్ (కేరళ)

* భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్

-

అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)

* భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం

-

బెంగళూరు (1906)

* భారత్‌లో తొలి మహిళా విశ్వవిద్యాలయం

-

ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీ (పుణె)

* మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్

-

పెన్సిలిన్

* భారత్‌లో మొదటి అణు పరీక్ష

-

పోఖ్రాన్ (రాజస్థాన్ - 1974)

* భారత్‌లో తొలి సైన్స్ నగరం

-

కలకత్తా

* భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం

-

ఆర్యభట్ట (1975)

* కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం

-

స్పుత్నిక్ (రష్యా - 1957)

* ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ

-

రజియా సుల్తానా

* భారత్‌లో మొదటి రైల్వే లైను

-

ముంబయి నుంచి థానే (1853)

* ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను

-

కలకత్తా, డైమండ్ హార్బర్‌ల మధ్య (1851)

* శని గ్రహంపైకి పంపిన తొలి స్పేస్ క్రాఫ్ట్

-

కేసినీ హ్యుగిన్స్ (2004)

* భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం

-

ఆపిల్ (1981)

* భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్

-

PSLVC - 2

* భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం

-

కలకత్తా (1727)

* మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం

-

ముంబయి, కలకత్తాల మధ్య (1927)

* ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా

-

రాజా హరిశ్చంద్ర (1913)

* ప్రపంచంలో మొదటి టాకీ సినిమా

-

ది జాజ్ సింగర్ (1927)

* భారత్‌లో మొదటి టాకీ సినిమా

-

ఆలం ఆరా (1931)

* పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం

-

స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్

* భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం

-

టాటా ఐరన్, స్టీల్ కంపెనీ (1907)

* విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం

-

మదర్ ఇండియా

* భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త

-

పతంజలి

* భారతదేశంలో మొదటిసారిగా స్థాపించిన పోలీసు మ్యూజియం

-

ఘజియాబాద్ (ఉత్తర్‌ ప్రదేశ్)

* ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు

-

కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)

* మొదటి కంపాక్ట్ డిస్క్

-

సోనీ, ఫిలిప్స్ కంపెనీలు తయారు చేశాయి (1978)

* భారత్ తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్

-

ఇంగ్లండ్‌తో (1932)

* భారత్ తొలి ఎలక్ట్రిక్ రైలు

-

ముంబయి నుంచి వి.టి. కుర్లా వరకు (1925)

* మొదటి ఆటంబాంబు

-

లిటిల్ బాయ్ (1945)

* ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం

-

భారతదేశం

* భారత దేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు

-

పాహియాన్

* భారత దేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి

-

అశోకుడు

* దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం

-

పంజాబ్

* బోర్లాగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ

-

డాక్టర్ అమితా పటేల్ (1992)

* భార‌త‌ దేశ మొదటి రాష్ట్రపతి

-

డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1950 - 1962)

* భారత దేశ మొదటి ఉపరాష్ట్రపతి

-

సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952 - 62)

* భారత దేశ మొదటి ప్రధానమంత్రి

-

జవహర్‌లాల్ నెహ్రూ (1947 - 64)

* భారత దేశ మొదటి ఉప ప్రధానమంత్రి

-

సర్దార్ వల్లభాయ్ పటేల్ (1947 - 50)

* సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి

-

హీరాలాల్ జె.కానియా (1950 - 51)

* సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి

-

మీరా సాహెబ్ ఫాతిమా బీబీ (1989)

* భారత దేశ తొలి మహిళా అడ్వకేట్

-

కోర్నేషియా సొరాబ్జి (కోల్‌క‌తా 1894)

* భారత దేశ హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి

-

లీలాసేథ్ (ఢిల్లీ)

* భారత్‌లో హైకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి

-

అన్నాచాంది

* స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్

-

విలియం బెంటింగ్ (1828 - 35)

* భారతదేశ చివరి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్

-

లార్డ్ కానింగ్ (1856 - 62)

* స్వతంత్ర భారత మొదటి, చివరి గవర్నర్ జనరల్

-

మౌంట్ బాటన్ (1947 - 48)

* స్వతంత్ర భారత మొదటి, చివరి భారతీయ గవర్నర్ జనరల్

-

సి. రాజగోపాలాచారి

* ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ

-

విజయలక్ష్మి పండిట్ (1953)

* భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి మహిళ

-

అనిబిసెంట్ (1917, కలకత్తా)

* భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ

-

సరోజినీ నాయుడు (1925 - కాన్పూర్)

* భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు

-

ఉమేష్ చంద్ర బెనర్జి (1885 - బొంబయి)

* భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు

-

బద్రుద్దీన్ త్యాబ్జీ (1887 - మద్రాసు)

* భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు

-

పి. ఆనందాచార్యులు (1891 - నాగపూర్)

* వరుసగా రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి

-

రాస్ బిహారీ ఘోష్ (1907 - సూరత్, 1908 - మద్రాస్)

* విడివిడిగా రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి

-

దాదాభాయ్ నౌరోజీ (1886 - కలకత్తా, 1906 - కలకత్తా)

* భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కువసార్లు జరిగిన మొదటి పట్టణం

-

కలకత్తా (1886, 1906, 1917, 1928)

* భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు

-

జార్జి యూల్ (1888 - అలహాబాదు)

* భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి పార్శీ మతస్తుడు

-

దాదాభాయ్ నౌరోజీ

* బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు

-

దాదాభాయ్ నౌరోజీ

* భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన తొలి మహిళ

-

కాదంబినీ గంగూలీ (1901)

* భారత్‌లో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి

-

బేబి హర్ష (1986)

* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి గవర్నరు

-

ఒస్‌బ‌ర్న్ స్మిత్ (1935 - 37)

* ఆర్‌బీఐ తొలి భారతీయ గవర్నరు

-

సి.డి. దేశ్‌ముఖ్ (1943 - 49)

* ఆర్‌బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నరు

-

కె.జె. ఉదేశి

* వెండితెరపై మొదటి నటి

-

దేవికారాణి

* గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన మొదటి భారతీయుడు

-

డాక్టర్ వేణుగోపాల్

* భారత రత్న పురస్కారం పొందిన మొదటి వ్యక్తులు

-

సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలచారి, సి.వి.రామన్ (1954)

* భారతరత్న పొందిన తొలి మహిళ

-

ఇందిరాగాంధీ (1971)

* భారతరత్న అవార్డు పొందిన తొలి ఉప రాష్ట్రపతి

-

సర్వేపల్లి రాధాకృష్ణన్ (1954)

* భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త

-

సి.వి.రామన్ (1954)

* భారతరత్న అవార్డు పొందిన మొదటి ఇంజినీర్

-

మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1955)

* భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని

-

జవహర్‌లాల్ నెహ్రూ (1955)

* భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి

-

బాబూ రాజేంద్రప్రసాద్ (1962)

* మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి

-

లాల్‌బహదూర్ శాస్త్రి (1966)

* భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు

-

ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ (1987)

* భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడు

-

ఎం.జి. రామచంద్రన్ (1988)

* భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా దర్శకుడు

-

సత్యజిత్ రే (1992)

* సంగీతంలో భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి, తొలి మహిళ

-

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి(1998)

* పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి

-

డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1969)

* పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి

-

కృష్ణకాంత్ (2002)

* తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి

-

వరాహగిరి వెంకటగిరి (1969 మే - 1969 జులై)

* మొదటి ముస్లిం రాష్ట్రపతి

-

డాక్టర్ జాకీర్ హుస్సేన్

* మొదటి సిక్కు రాష్ట్రపతి

-

జ్ఞానీ జైల్‌ సింగ్

* అత్యధిక కాలం రాష్ట్రపతిగా పనిచేసిన తొలి రాష్ట్రపతి

-

డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్

* ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి

-

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

* మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి

-

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1962)

* అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా వ్యవహరించిన రాష్ట్రపతి

-

డాక్టర్ జాకీర్ హుస్సేన్

* మొదటి కాంగ్రెసేతర రాష్ట్రపతి

-

వరాహగిరి వెంకటగిరి

* స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మొదటి రాష్ట్రపతి

-

వరాహగిరి వెంకటగిరి

* సుప్రీంకోర్టులో సాక్షిగా హాజరైన మొదటి రాష్ట్రపతి

-

వరాహగిరి వెంకటగిరి

* అతి ఎక్కువ ఆర్డినెన్స్‌లు జారీచేసిన రాష్ట్రపతుల్లో ప్రథముడు

-

ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్

* ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి

-

ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్

* ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి

-

నీలం సంజీవరెడ్డి

* పిన్న వయసులోనే (63 సంవత్సరాలు) రాష్ట్రపతి మొదటి వ్యక్తి

-

నీలం సంజీవరెడ్డి

* ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా (ఆంధ్రప్రదేశ్), స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి

-

నీలం సంజీవరెడ్డి

* తొలి దళిత రాష్ట్రపతి

-

కె.ఆర్. నారాయణన్

* ఓటు హక్కు ఉపయోగించుకున్న తొలి రాష్ట్రపతి

-

కె.ఆర్.నారాయణన్

* తొలి మహిళా రాష్ట్రపతి

-

ప్రతిభా దేవీసింగ్ పాటిల్

* అత్యధిక కాలం (2 పర్యాయాలు) (1952 - 62) ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి వ్యక్తి

-

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

* తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి

-

డాక్టర్ జాకీర్ హుస్సేన్

* అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి

-

వరాహగిరి వెంకటగిరి

* తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి ఉపరాష్ట్రపతి

-

వరాహగిరి వెంకటగిరి

* ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

-

జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా

* పెద్ద వయసులో ఉపరాష్ట్రపతిగా (73 ఏళ్లు) వ్యవహరించిన తొలి వ్యక్తి

-

ఆర్.వెంకట్రామన్

* అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి

-

జవహర్ లాల్ నెహ్రూ (17 సంవత్సరాలు; 1947 - 64)

* . పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధాని

-

జవహర్‌లాల్ నెహ్రూ

* ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని

-

జవహర్‌లాల్ నెహ్రూ

* విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని

-

లాల్‌బహదూర్‌శాస్త్రి

* మొదటి మహిళా ప్రధాని

-

ఇందిరాగాంధీ

* ప్రధానిగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన మొదటి ప్రధాని

-

ఇందిరాగాంధీ (1977)

* రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానిగా ఎన్నికైన మొదటి వ్యక్తి

-

ఇందిరాగాంధీ

* అత్యధిక రాజ్యాంగ సవరణలు చేసిన మొదటి ప్రధాని

-

ఇందిరాగాంధీ

* ఎక్కువసార్లు రాష్ట్రపతి పాలన విధించిన మొదటి ప్రధాని (48 సార్లు)

-

ఇందిరాగాంధీ

* హత్యకు గురైన మొదటి ప్రధాని

-

ఇందిరాగాంధీ

* అరెస్టు అయిన మొదటి ప్రధాని

-

ఇందిరాగాంధీ

* మొదటి కాంగ్రెసేతర ప్రధాని

-

మొరార్జీ దేశాయ్

* పెద్ద వయసులో ప్రధానిగా (81 ఏళ్లు) వ్యవహరించిన వ్యక్తి

-

మొరార్జీ దేశాయ్

* ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి

-

మొరార్జీ దేశాయ్

* మొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి

-

చరణ్ సింగ్

* తన పదవీకాలంలో పార్లమెంటులో అడుగుపెట్టని ఏకైక ప్రధాని

-

చరణ్ సింగ్

* అతి పిన్న వయసులో (47 ఏళ్లు) ప్రధాని పదవిని అధిష్టించిన తొలి వ్యక్తి

-

రాజీవ్ గాంధీ

* విశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడిన ఏకైక ప్రధాని

-

విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్

* ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని

-

చంద్రశేఖర్

* దక్షిణ భారత దేశం నుంచి ప్రధాని అయిన మొదటి వ్యక్తి

-

పి.వి. నరసింహారావు

* పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొలి వ్యక్తి

-

పి.వి. నరసింహారావు

* ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని

-

అటల్ బిహారీ వాజ్‌పేయ్

* ‘వరల్డ్ స్టేట్స్‌మెన్’ అవార్డు పొందిన ఏకైక ప్రధాని

-

ఐ.కె. గుజ్రాల్

* ప్రధానమంత్రి పదవిని అలంకరించిన మొదటి ఆర్థికవేత్త

-

మన్మోహన్ సింగ్

* ఏకైక తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి

-

గుల్జారీలాల్ నందా

* లోక్‌సభ తొలి స్పీకర్

-

గణేష్ వాసుదేవ్ మౌలాంకర్

* లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు

-

నీలం సంజీవరెడ్డి

* రెండు లోక్‌సభలకు స్పీకర్‌గా చేసిన తొలి వ్యక్తి

-

డాక్టర్ బలరాం జక్కర్

* లోక్‌సభకు తొలి దళిత స్పీకర్

-

జి.ఎం.సి. బాలయోగి

* లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్

-

మీరాకుమార్‌

* భారత తొలి ఎన్నికల కమిషనర్

-

సుకుమార్ సేన్

* భారత ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు

-

ఆర్.ఎ.ఎస్. పేరిశాస్త్రి

* భారత ఎన్నికల తొలి మహిళా కమిషనర్

-

వి.ఎస్. రమాదేవి

* అతి తక్కువ కాలం ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించిన వ్యక్తి

-

వి.ఎస్. రమాదేవి (16 రోజులు)

* మొదటి మహిళా గవర్నర్

-

సరోజినీ నాయుడు (ఉత్తర్ ప్రదేశ్, 1947 - 49)

* మొదటి మహిళా ముఖ్యమంత్రి

-

సుచేతా కృపాలానీ (ఉత్తర్ ప్రదేశ్, 1963 - 67)

* మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి

-

మాయావతి (ఉత్తర్ ప్రదేశ్, 1995)

* మొదటి దళిత ముఖ్యమంత్రి

-

దామోదరం సంజీవయ్య (ఆంధ్రప్రదేశ్, 1960 - 62)

* ముఖ్యమంత్రి అయిన తొలి సినిమా నటుడు

-

ఎం.జి. రామచంద్రన్ (తమిళనాడు)

* ముఖ్యమంత్రి అయిన తొలి స్వతంత్ర అభ్యర్థి

-

బిశ్వనాథ్ దేశ్ (1971)

* అవినీతి కుంభకోణంపై అరెస్టు అయి జైలుకు వెళ్లిన తొలి ముఖ్యమంత్రి

-

జయలలిత (తమిళనాడు, 1996)

* ప్రజలు ఎన్నుకున్న తొలి లెఫ్ట్ ప్రభుత్వాధినేత (ప్రపంచంలో కూడా)

-

నంబూద్రిపాద్ (కేరళ, 1957)

* ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి హిజ్రా

-

షబ్మమ్ మౌసి (మధ్యప్రదేశ్, 2000)

* ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయురాలు

-

భాను అథయా (1983)

* ఆస్కార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పొందిన తొలి భారతీయుడు

-

సత్యజిత్ రే (1992)

* రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి భారతీయుడు

-

ఆచార్య వినోబా భావే (1958)

* రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి మహిళ

-

మదర్ థెరిసా (1962)

* రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి ఆసియావాసి

-

ఆచార్య వినోబా భావే(1958)

* రామన్ మెగసెసె అవార్డును మొదటిగా గ్రహించింది

-

ఆచార్య వినోబా భావే

* సామాజిక నాయకత్వంలో రామన్‌మెగసెసె అవార్డును తొలిగా గ్రహించింది

-

ఆచార్య వినోబా భావే(1958)

* రామన్‌మెగసెసె అవార్డు పొందిన తొలి తండ్రీకొడుకులు

-

బాబా ఆమ్టే (1985), ప్రకాష్ ఆమ్టే (2008)

* రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి భార్యాభర్తలు

-

మందాకినీ ఆమ్టే (2008), ప్రకాశ్ ఆమ్టే (2008)

* ఎమర్జంట్ లీడర్‌షిప్ అంశం కింద రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి భారతీయుడు

-

సందీప్ పాండే (2002)

* జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి వ్యక్తి

-

శంకర కురూప్ (1965) (రచన: ఒడక్క జుల్, మలయాళం)

* జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి మహిళ

-

ఆషాపూర్ణాదేవి (1976, ప్రథమ్, ప్రతిశ్రుతి, బెంగాలీ)

* బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయుడు

-

వి.ఎస్. నైపాల్ (1971)

* బుకర్‌ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ

-

అరుంధతీ రాయ్ (ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, 1997)

* పులిట్జర్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ

-

ఝంపా లాహిరి (2000)

* దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి వ్యక్తి

-

దేవికారాణి రోరిచ్ (1969)

* దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి ఆంధ్రుడు

-

బి.ఎన్.రెడ్డి (1974)

* బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన తొలి వ్యక్తి

-

ఇంద్రజిత్ గుప్తా (1993)

* ఎన్టీఆర్ అవార్డు పొందిన తొలి వ్యక్తి

-

అక్కినేని నాగేశ్వరరావు (1996)

* వైశ్రాయ్ కౌన్సిల్ మొదటి భారతీయ సభ్యుడు

-

ఎస్.పి. సిన్హా

* సుప్రీంకోర్టు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి

-

కె.జి. బాలకృష్ణన్ (2007)

* మహాభియోగ తీర్మానాన్ని ఎదుర్కొన్న తొలి, ఏకైక సుప్రీంకోర్టు న్యాయమూర్తి

-

జస్టిస్ వి. రామస్వామి (1993)

* తొలి మహిళా మేజిస్ట్రేట్

-

ఓమన కుంజమ్మ

* అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు

-

డాక్టర్ నాగేందర్ సింగ్

* రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు

-

విశ్వనాథన్ ఆనంద్ (చదరంగం, 1991 - 94)

* రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారిణి

-

కరణం మల్లేశ్వరి (1995)

* రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి క్రికెటర్

-

సచిన్ టెండూల్కర్ (1997)

* బాక్సింగ్‌లో రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి మహిళ

-

మేరికోమ్ (మణిపూర్)

* పరమవీర చక్ర అవార్డు పొందిన తొలి వ్యక్తి

-

సోమనాథ్ శర్మ

* ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు

-

టెన్సింగ్ నార్కే (1953, మే 29)

* ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలు

-

బచేంద్రిపాల్ (1984)

* ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన తొలి భారతీయురాలు

-

సంతోష్‌యాదవ్ (1993, మే 10)

* ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న తొలి దక్షిణ భారతీయుడు

-

శేఖర్ బాబు (ఆంధ్రప్రదేశ్)

* ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన తొలి వ్యక్తి

-

నవాంగ్ గొంబూ (1965)

* ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తి

-

పూదోర్జి

* తొలి భారతీయ ఐ.పి.ఎస్. అధికారి

-

సత్యేంద్రనాథ్ ఠాగూర్

* తొలి మహిళా ఐ.ఎ.ఎస్. అధికారి

-

అన్నాజార్జ్

* తొలి మహిళా ఐ.పి.ఎస్. అధికారి

-

కిరణ్‌బేడి (1972)

* తొలి మహిళా డి.జి.పి. అధికారి

-

కంచన్ చౌదరి భట్టాచార్య (ఉత్తరాఖండ్)

* ఐక్యరాజ్యసమితి సివిల్ పోలీస్‌కు సలహాదారుడిగా నియమితులైన తొలి భారతీయ మహిళ

-

కిరణ్‌బేడి

* భారతీయ రైల్వే బోర్డులో మొదటి మహిళా సభ్యురాలు

-

విజయలక్ష్మీ విశ్వనాథన్

* తొలి మహిళా రాయబారి

-

విజయలక్ష్మి పండిట్ (మాజీ సోవియట్‌కు, 1947 - 49)

* తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి

-

చోకిలా అయ్యర్

* ఇంగ్లిష్‌ఛానెల్ ఈదిన తొలి మహిళ

-

ఆర్తిసాహా (1959)

* ఇంగ్లిష్ ఛానెల్‌ను ఈదిన తొలి భారతీయుడు

-

మిహిర్‌సేన్ (1958)

* ఇంగ్లిష్ ఛానెల్‌ను రెండుసార్లు ఈదిన తొలి భారతీయురాలు

-

బులా చౌదరి (2004)

* సప్త సముద్రాల్లోని 7 జలసంధులను ఈదిన తొలి భారతీయురాలు

-

బులా చౌదరి (ప్రపంచంలోనే మొదటి వ్యక్తి)

* జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మొదటి భారతీయ మహిళ

-

ఆర్తి సాహా

* అయిదు ఖండాల్లో సముద్రాలను ఈదిన తొలి మహిళ

-

బులా చౌదరి

* స్వతంత్ర భారత పోస్టల్ స్టాంపుపై దర్శన మిచ్చిన తొలి వ్యక్తి

-

మహాత్మా గాంధీ (1948)

* మొదటి భారతీయ మహిళా ఫొటో జర్నలిస్ట్

-

హోమియా వ్యారవల్లా (బాంబే క్రానికల్, 1938)

* రైల్వే ఇంజిన్ డ్రైవర్ అయిన మొదటి భారతీయ మహిళ

-

సురేఖా యాదవ్ (ఇండియన్ రైల్వేస్, 1992)

* నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు

-

ఒమనా అబ్రహం (కొట్టాయం, కేరళ)

* భారత్‌ను పాలించిన తొలి మహిళ

-

రజియా సుల్తానా (1236 - 1240)

* అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు

-

రాకేష్ శర్మ (1984)

* అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ టూరిస్ట్

-

సంతోష్ జార్జి (కేరళ)

* అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన తొలి మహిళ

-

కల్పనా చావ్లా

* ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం పొందిన తొలి భారతీయుడు

-

ఖాషాబా జాదవ్ (1952, రెజ్లింగ్, కాంస్యం)

* ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారతీయురాలు

-

కరణం మల్లేశ్వరి (2000, వెయిట్‌లిఫ్టింగ్, కాంస్యం)

* ఒలింపిక్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళ

-

పి.టి. ఉష (1984)

* ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయుడు

-

రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (2004, ఏథెన్స్, షూటింగ్)

* ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు

-

అభినవ్ బింద్రా (2008, బీజింగ్, షూటింగ్)

* భూగోళం చుట్టివచ్చిన మొదటి భారతీయుడు

-

లెఫ్టినెంట్ కల్నల్ కె.ఎస్. రావు

* భూగోళం చుట్టివచ్చిన తొలి భారతీయ మహిళ

-

ఉజ్వల రాయ్

* చదరంగంలో తొలి భారతీయ గ్రాండ్‌మాస్టర్

-

విశ్వనాథన్ ఆనంద్

* చదరంగంలో తొలి భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్

-

ఎస్. విజయలక్ష్మి (2000)

* ప్రపంచ బిలియర్డ్స్ ట్రోఫీని గెలుచుకున్న తొలి భారతీయుడు

-

విల్సన్ జోన్స్

* ప్రపంచ అథ్లెటిక్స్‌లో పతకం పొందిన తొలి భారతీయ మహిళ

-

అంజూ బాబీ జార్జ్

* అంటార్కిటికాను చేరిన తొలి భారతీయుడు

-

లెఫ్టినెంట్ రామ్‌చరణ్ (1960)

* అంటార్కిటికాను చేరుకున్న తొలి భారతీయ మహిళ

-

మోహర్‌మూస్ (1976)

* మొదటి భారతీయ ప్రపంచ సుందరి

-

రీటా ఫారియా (1966)

* మొదటి భారతీయ విశ్వసుందరి

-

సుస్మితాసేన్ (1994)

* మొదటి మిస్ ఇండియా

-

ప్రమీల (1947)

* మొదటి మిస్ ఏసియా పసిఫిక్

-

దియామీర్జా (2000)

* పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి నటి

-

నర్గీస్ దత్

* నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు (ఆసియావాసి)

-

రవీంద్రనాధ్ ఠాగూర్ (1913)

* నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ వనిత

-

మదర్ థెరిసా (శాంతి, 1971)

* ఆసియాన్ గేమ్స్‌లో వ్యక్తిగత బంగారు పతకం పొందిన తొలి భారతీయ మహిళ

-

కమలజిత్ సంధూ (1970)

* భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్

-

సి.కె. నాయుడు (1932)

* స్వతంత్ర భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్

-

లాలా అమర్‌నాథ్ (1947 - 48)

* తొలి టెస్ట్ సెంచరీ సాధించిన భారతీయుడు

-

లాలా అమర్‌నాథ్ (ఇంగ్లండ్‌పై)

* ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడు

-

వీరేంద్ర సెహ్వాగ్ (పాకిస్థాన్, 2004)

* టెస్టుల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయుడు

-

సునీల్ గవాస్కర్

* టెస్టుల్లో వన్డేల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయుడు

-

సచిన్ టెండూల్కర్

* టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు

-

హర్భజన్ సింగ్ (ఆస్ట్రేలియాపై 2001)

* భారతదేశ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్

-

విలియం బెంటిక్

* భారత్‌లో హత్యకు గురైన ఏకైక వైశ్రాయి

-

లార్డ్ మేయో (1872)

* బెంగాల్ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్

-

వారన్ హేస్టింగ్స్

* భారత్‌లో మొదటి పైలట్

-

జె.ఆర్.డి. టాటా (1929)

* ఎయిర్ బస్ మొదటి భారతీయ మహిళా పైలట్

-

దుర్గా బెనర్జీ

* వైమానిక దళంలో పైలట్‌గా పనిచేసిన తొలి భారతీయ మహిళ

-

హరితాకౌర్ దయాల్

* మొదటి భారతీయ ఎయిర్ మార్షల్

-

అర్జున్ సింగ్

* వైమానిక దళ తొలి మహిళా ఎయిర్ వైస్ మార్షల్

-

పద్మా బందోపాధ్యాయ

* మొదటి వైమానిక దళాల ప్రధానాధికారి

-

ఎస్.కె. ముఖర్జి (1954 - 60)

* మొదటి నావికా దళాల ప్రధానాధికారి వైస్ అడ్మిరల్

-

ఆర్.డి. కటారి (1958 - 62)

* నావికా దళంలో మొదటి మహిళా వైస్ అడ్మిరల్

-

పునీతా అరోరా

* సైనికా దళంలో తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్

-

పునీతా అరోరా

* సైనిక దళాల మొదటి ప్రధానాధికారి

-

జనరల్ ఎమ్. రాజేంద్ర సింగ్ (1955)

* తొలి ఫీల్డ్ మార్షల్ జనరల్

-

మానెక్ షా (1973)

* స్వతంత్ర భారత మొదటి ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్

-

సర్ థామస్ ఎల్ మ్రిస్ట్ (1947 - 50)

* స్వతంత్ర భారత తొలి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్

-

కె.ఎం. కరియప్ప (1949 - 53)

* డబ్ల్యూహెచ్‌వో ఆరోగ్య సమావేశాలకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ

-

రాజకుమారి అమృత కౌర్ (1950)

* తొలి భారతీయ మహిళా వైద్యురాలు

-

కాదంబినీ గంగూలీ (1886)

* పదవిలో ఉండగా మరణించిన ఏకైక స్పీకర్

-

జి.ఎం.సి. బాలయోగి

* మొదటి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్

-

ఎస్.వి. కృష్ణమూర్తి (1952)

* రాజ్యసభకు తొలి మహిళా డిప్యూటీ ఛైర్మన్

-

వయిలెట్ ఆల్వా (1962 - 69)

* రాజ్యసభ మొదటి మహిళా సెక్రటరీ జనరల్

-

వి.ఎస్. రమాదేవి

* మొదటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్

-

అనంతశయనం అయ్యంగార్ (1952 - 56)

* మొదటి మహిళా కేంద్రమంత్రి

-

రాజకుమారి అమృతకౌర్ (ఆరోగ్యశాఖ 1947 - 57)

* మొదటి విద్యాశాఖామంత్రి

-

మౌలానా అబుల్ కలాం ఆజాద్

* తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి

-

ఆర్.కె. షుణ్ముగం చెట్టి (1947)

* రాష్ట్రాల పరంగా తొలి మహిళా మంత్రి

-

విజయలక్ష్మీ పండిట్ (ఉత్తర ప్రదేశ్)

* రాష్ట్రాలపరంగా మొదటి మహిళా స్పీకర్

-

షానోదేవి (హర్యానా)

* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసినవారు

-

వై.వి. చంద్రచూడ్ (7 ఏళ్లకు పైగా)

* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పనిచేసినవారు

-

కె.ఎన్. సింగ్ (18 రోజులు)

* మొదటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్

-

వి. నరహరి రావు

* మొదటి అటార్నీ జనరల్

-

ఎం.సి. సెతల్‌వాడ్

* మొదటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్

-

హెచ్.కె. కృపలాని

* దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టిన తొలి ప్రధాని

-

వి.పి. సింగ్

* కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ప్రధాని

-

మన్మోహన్ సింగ్

* రఘుపతి వెంకయ్య అవార్డు పొందిన తొలి వ్యక్తి

-

ఎల్.వి. ప్రసాద్

* టెంపుల్టన్ అవార్డు పొందిన తొలి భారతీయుడు

-

సర్వేపల్లి రాధాకృష్ణన్

* రైట్ టు లైవ్‌లీ హుడ్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి

-

రూత్ మనోరమ

* ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరవేసిన తొలి ప్రధాని

-

జవహర్‌లాల్ నెహ్రూ (17 సార్లు)

* తొలి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్

-

డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్

* చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులైన తొలి వ్యక్తి

-

ఎన్. శ్రీనివాసరావు

* జాతీయ సమగ్రతా మండలికి తొలి అధ్యక్షుడు

-

జవహర్‌లాల్ నెహ్రూ

* జాతీయ భద్రతా మండలికి తొలి అధ్యక్షుడు

-

బ్రిజేష్ మిశ్రా

* జాతీయ వినియోగదారుల కమిషన్ మొదటి ఛైర్మన్

-

జస్టిస్ వి. బాలకృష్ణ ఎరాడి

* తొలి కేంద్ర‌ న్యాయశాఖామంత్రి

-

డాక్టర్ అంబేద్కర్

*తొలి కేంద్ర‌ కార్మిక శాఖామంత్రి

-

బాబూ జగ్‌జ్జీవన్ రామ్

* తొలి కేంద్ర‌ రక్షణ శాఖామంత్రి

-

బల్‌దేవ్‌సింగ్

* తొలి కేంద్ర‌ హోంశాఖామంత్రి

-

సర్దార్ వల్లభాయ్ పటేల్

* తొలి కేంద్ర‌ వ్యవసాయ శాఖామంత్రి

-

బాబూ రాజేంద్రప్రసాద్

* తొలి కేంద్ర‌ ఆర్థికమంత్రి

-

ఆర్.కె. షణ్ముగం చెట్టి

* ఉత్తర ధ్రువాన్ని చేరుకున్న తొలి వ్యక్తి

-

రాబర్ట్ పియరీ (1909)

* దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి మహిళ

-

కరోలిన్ మికెల్‌సెన్ (1935)

* దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి వ్యక్తి

-

అముండ్‌సెన్ (నార్వే, 1911)

* దేశానికి అధ్యక్షురాలైన తొలి మహిళ

-

ఇసబెల్ పెరాన్ (అర్జెంటీనా, 1974)

* ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు

-

టెన్సింగ్ నార్కే (భారత్), ఎడ్మండ్ హిల్లరీ (న్యూజిలాండ్) 1955

* ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి తల్లీకూతుళ్లు

-

చెరైల్ బర్ట్, సిక్కి (ఆస్ట్రేలియా, 2008)

* ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి దంపతులు

-

ఆండ్రిజ్, మరిజా స్ట్రీమ్‌ఫెల్జ్ (స్లోవేకియా)

* ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తులు

-

పీటర్ హబెలర్ (ఆస్ట్రేలియా), రెన్‌హోల్డ్ మెస్నర్ (ఇటలీ)

* ఎవరెస్ట్ శిఖరంపై అధిక సమయం గడిపిన తొలి వ్యక్తి

-

బాబూ చిరిషెర్పా

* ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి అతిపిన్న వయస్కురాలు

-

డిక్కిడోల్మ

* ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగుడు

-

టామ్ విట్టేకర్

* ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి అంధుడు

-

ఎరిక్ విహెన్మియర్ (అమెరికా, 2001)

* ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ

-

జుంకోతాబి (జపాన్, 1975)

* తొలి విశ్వసుందరి

-

ఆర్మికౌసెల (ఫిన్‌లాండ్, 1952)

* తొలి ప్రపంచ సుందరి

-

కెర్‌స్టిన్ కికి హాకోన్సన్ (స్వీడన్, 1951)

* చంద్రుడిపై కాలు మోపిన తొలి వ్యక్తి

-

నీల్ఆర్మ్‌స్ట్రాంగ్ (అమెరికా 1969)

* బ్రిటన్ మొదటి ప్రధాని

-

రాబర్ట్ వాల్‌పోల్ (1721)

* బ్రిటన్ మొదటి మహిళా ప్రధాని

-

మార్గరెట్ థాచర్ (కన్జర్వేటివ్ పార్టీ, 1979 - 90)

* సముద్ర మార్గంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి వ్యక్తి

-

ఫెర్టినాండ్ డిమాజిలాన్ (స్పెయిన్)

* జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి మహిళ

-

ఆర్తి సాహా (భారత్)

* జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి వికలాంగుడు

-

తారానాథ్ షెనాయ్ (1988)

* అమెరికా మొదటి అధ్యక్షుడు

-

జార్జి వాషింగ్టన్ (1789)

* రాజీనామా చేసిన మొదటి అమెరికా అధ్యక్షుడు

-

రిచర్డ్ నిక్సన్ (1974)

* హత్యకు గురైన మొదటి అమెరికా అధ్యక్షుడు

-

అబ్రహం లింకన్ (1865)

* గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి మహిళ

-

మౌరీన్ క్యాథరిన్ (1953)

* మొదటి ప్రపంచ చెస్ ఛాంపియన్

-

విల్‌హెల్మ్ స్టెయిన్ట్జ్ (1886)

* ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న తొలి మహిళ

-

చార్లొట్టే కూపర్ (యూకే టెన్నిస్, 1900)

* జర్మనీ మొదటి మహిళా ఛాన్సెలర్

-

ఎంజెలా మెర్కెల్ (2005)

* దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన తొలి నల్ల జాతీయుడు

-

నెల్సన్ మండేలా (1994)

* అమెరికాకు అధ్యక్షుడైన తొలి నల్ల జాతీయుడు

-

బరాక్ హుస్సేన్ ఒబామా

* తొలి మహిళా బిషప్

-

రీవ్ బార్బరా సి హ్యారీస్ (1988, అమెరికా)

* అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి

-

లైలా అనే కుక్క (స్పుత్నిక్ - 2, 1957)

* అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికా వ్యోమగామి

-

అలెన్ షెపర్డ్ (1961)

* అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి

-

యూరీ గగారిన్ (సోవియట్ యూనియన్ 1961)

* అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ

-

వాలెంటీనా తెరిష్కోవా (యూఎస్ఎస్ఆర్, 1963)

* అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తి

-

అలెక్సి లియనోవ్ (యూఎస్ఎస్ఆర్, 1965)

* అంతరిక్షంలో నడిచిన తొలి మహిళ

-

స్వెత్లానా సవిత్సకయ (యూఎస్ఎస్ఆర్, 1982)

* అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్

-

డెన్నిస్ టిటో (అమెరికా, 2001)

* అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిళా టూరిస్ట్

-

అనౌషి అన్సారి (2006)

* అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ముస్లిం మహిళ

-

అనౌషి అన్సారి (2006)

* ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు పొందిన తొలి వ్యక్తి

-

ఎమిల్ జెన్నింగ్స్ (1928)

* ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు పొందిన తొలి నల్ల జాతీయురాలు

-

హాలీ బెర్రి (2002)

* ఓడపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి వ్యక్తి

-

ఫెర్డినాండ్ మాజిలాన్ (స్పెయిన్)

* పులిట్జర్ బహుమతి పొందిన తొలి నల్లజాతీయురాలు

-

జి.బ్రూక్స్ (1950)

* ఐక్యరాజ్యసమితి తొలి సెక్రెటరీ జనరల్

-

ట్రిగ్వేలీ (నార్వే, 1946 - 53)

* ఐక్యరాజ్యసమితి తొలి డిప్యూటీ సెక్రెటరీ జనరల్

-

లూయిస్ ఫ్రీ చెట్టి

* గ్రాడ్యుయేట్ అయిన తొలి మూగ, చెవిటి మహిళ

-

హెలెన్ కెల్లర్ (1904)

* అంటార్కిటిక్ వలయాన్ని దాటిన తొలి వ్యక్తి

-

జేమ్స్ కుక్ (1773)

* ప్రపంచంలో అన్ని ఖండాల్లోని ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ

-

అన్నా బిల్లీబెండ్

* ఇంగ్లిష్ ఛానెల్ ఈదిన తొలి వ్యక్తి

-

మాథ్యువెబ్ (1875)

* తొలి టెస్ట్‌ట్యూబ్ బేబి

-

లూయిస్ బ్రౌన్ (1978, ఇంగ్లండ్)

* గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి

-

క్రిస్టియన్ బెర్నార్డ్ (1967, దక్షిణాఫ్రికా)

* భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి

-

విలియం రాంట్‌జన్ (1901, జర్మనీ)

* రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి

-

జాకబ్స్ వాంట్ హాప్ (1901, నెదర్లాండ్స్)

* వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి

-

ఎమిల్ అడాల్ఫ్ వాన్ బేరింగ్ (1901, జర్మనీ)

* ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తులు

-

రాగ్నర్ ఫ్రిష్ (నార్వే), జాన్ టిన్ బెర్జెన్ (నెదర్లాండ్స్) 1969

* నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి వ్యక్తులు

-

జీన్ హెన్రీ డ్యునాంట్ (స్విస్), ఫ్రెడరిక్ పాసీ (ఫ్రాన్స్)

* సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి

-

సల్లీప్రుదోమ్మి (ఫ్రాన్స్, 1901)

* నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి నల్లజాతీయుడు

-

రాల్ఫ్ బంచె (1950)

* రెండుసార్లు నోబెల్ బహుమతి అందుకున్న తొలి వ్యక్తి

-

మేరీ క్యూరి (భౌతికశాస్త్రం (1903), రసాయన శాస్త్రం (1911))

* నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి ముస్లిం మహిళ

-

షిరిన్ ఎబాది (ఇరాన్, 2003)

* అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ

-

రోజాలిన్ హిగ్గిన్స్

* జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ మొదటి ఛైర్మన్

-

సూరజ్ భాను

* జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మొదటి ఛైర్మన్

-

కున్వర్ సింగ్

* జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ మొదటి ఛైర్మన్

-

ఆర్.ఎన్. ప్రసాద్

* జాతీయ మైనారిటీల కమిషన్ మొదటి ఛైర్మన్

-

జస్టిస్ ఎం.డి. సర్దార్ అలీఖాన్

* జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ మొదటి ఛైర్మన్

-

శాంతా సిన్హా

* జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి ఛైర్మన్

-

జస్టిస్ రంగనాథ్ మిశ్రా

* వయోపరిమితి సమస్య ఎదుర్కొన్న తొలి సైనిక దళాల ప్రధాన అధికారి

-

జనరల్ వి.కె. సింగ్

* 1987లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి యుద్ధ ట్యాంకు

-

వైజయంతి

* భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పైలట్ రహిత యుద్ధ విమానం

-

నిశాంత్

* భారత నావికాదళంలో తొలి యుద్ధ నౌక

-

ఐఎన్ఎస్ సావిత్రి

* ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి యుద్ధ నౌక

-

ఐఎన్ఎస్ తరంగిణి

* భారత్‌లో తొలి విమాన వాహక నౌక

-

ఐఎన్ఎస్ విశ్రాంత్

* మన దేశ తొలి గూఢచార నౌక

-

ఐఎన్ఎస్ శివాలిక్

* స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దేశ తొలి క్షిపణి నౌక

-

ఐఎన్ఎస్ విభూతి

* దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి సబ్‌మెరైన్

-

ఐఎన్ఎస్ షల్కి

* భారత దేశ తొలి అణు సబ్‌మెరైన్

-

ఐఎన్ఎస్ చక్ర

* స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అణు జలాంతర్గామి

-

అరిహంత్ (2009)

* మన దేశ తొలి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం

-

భాస్కర - 1

* ప్రపంచంలోనే తొలిసారిగా సముద్ర పరిశోధనలకు ప్రయోగించిన ఉపగ్రహం

-

ఓషన్‌శాట్ - 1

* చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం

-

చంద్రయాన్ - 1

* సింగపూర్ తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం

-

ఎక్సోశాట్

* జీఎస్ఎల్వీ శ్రేణిలో మొదటి నౌక

-

జీఎస్ఎల్వీ - డీ1

* స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి

-

పృథ్వీ

* గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉన్న తొలి క్షిపణి

-

అగ్ని-2

* భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి

-

సూర్య

* భారతదేశ తొలి అణు పరిశోధనా కేంద్రం

-

బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బీఏఆర్‌సీ)

* భారతదేశ తొలి ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహం

-

భాస్కర - 1

* భారతదేశ తొలి జియో స్టేషనరీ ఉపగ్రహం

-

ఆపిల్

* అమెరికా తొలి రోదసి నౌక

-

ఎక్స్‌ప్లోరర్

* మనదేశంలో తొలి ఎఫ్.ఎం. స్టేషన్ ప్రారంభమైన నగరం

-

చెన్నై (1977)

* ప్రైవేటు రంగంలో తొలి ఎఫ్.ఎం. ప్రారంభమైన నగరం

-

బెంగళూరు (2001)

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.