• facebook
  • whatsapp
  • telegram

భారత రాష్ట్రపతులు - వారి ప్రత్యేకతలు

డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1884 - 1963)
* పదవీకాలం 13 మే 1952 నుంచి 12 మే 1957, 13 మే 1957 నుంచి 13 మే 1962.     
* భారత తొలి రాష్ట్రపతి.    
* అత్యధిక కాలం (2 సార్లు) రాష్ట్రపతిగా పనిచేశారు.
* 1962లో భారతరత్న పురస్కారం పొందారు.
* రాజ్యాంగ పరిషత్‌కు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
* బీహార్ రాష్ట్రానికి చెందినవారు.
* అత్యధిక మెజారిటీ (99.4%)తో ఎన్నికయ్యారు.
* ఈయనపై కె.టి.షా పోటీచేశారు.
* రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి.
* తొలి హిందీ పత్రిక 'దేశ్'కు సంపాదకత్వం వహించారు.
* హిందూ కోడ్ బిల్లు (1951)కు ఆమోదం తెలపకుండా సవరణల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు.
* ఎక్కువ పర్యాయాలు సుప్రీంకోర్టు సలహా తీసుకున్న రాష్ట్రపతి.
* రెండోసారి రాష్ట్రపతిగా పోటీచేసినప్పుడు నాగేంద్ర నారాయణదాసు (తనపై పోటీ చేసిన అభ్యర్థి) అతి తక్కువ ఓట్లు (2,000) పొందిన వ్యక్తిగా నిలిచారు.


డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 - 1975)
* పదవీకాలం 13 మే 1962 - 13 మే 1967.
* మొదటి ఉపరాష్ట్రపతి.    
* దౌత్యవేత్త, ఉపాధ్యాయుడు, తత్వవేత్త, దార్శనికుడు.
* రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ జరగక ముందు మద్రాసు రాష్ట్రానికి చెందినవారు.
* రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారయ్యారు.
* ఈయనపై సీహెచ్.హరిరాం పోటీచేశారు.
* రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి వ్యక్తి.
* టెంపుల్టన్ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడు.
* యునెస్కోకు ఛైర్మన్‌గా పనిచేశారు.
* ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి ఆచార్యులుగా పనిచేశారు.
* ఈయన పుట్టిన రోజైన సెప్టెంబరు 5ను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
* చైనా యుద్ధానంతరం రక్షణ మంత్రి కృష్ణమీనన్‌ను పదవి నుంచి తొలగించమని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
* ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు.
* మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని (1962లో) విధించారు.
* భారతరత్న అవార్డు పొందిన తొలి ఉపరాష్ట్రపతి.
* రాష్ట్రపతుల్లో భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి.
* 1954లో మొదటిసారిగా భారతరత్న అవార్డు పొందిన వారిలో ఈయనొకరు.


డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1897 - 1969)
* పదవీ కాలం 13 మే 1967 - 3 మే 1969.    
* తొలి ముస్లిం రాష్ట్రపతి.
* తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి కూడా ఈయనే.
* ఈయనపై కోకా సుబ్బారావు పోటీ చేశారు.
* పదవీలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి.
* అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేశారు.
* హైదరాబాద్‌లో జన్మించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
* 1963లో భారతరత్న అవార్డు పొందారు.

 

వరాహగిరి వెంకటగిరి (1894 - 1980)
* 03 మే 1969 నుంచి 20 జులై 1969 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు.    
* తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి.
* రాష్ట్రపతిగా పోటీచేయాలనే ఉద్దేశంతో తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి రెండు పదవులూ ఈయన సమయంలోనే ఖాళీ అయ్యాయి.     
* ఇలా రెండు పదవులు ఖాళీ అవ్వడం వల్ల అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా 20 జులై 1969 నుంచి 24 ఆగస్టు 1969 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.     
* వి.వి.గిరి రాష్ట్రపతిగా ఎన్నికై 24 ఆగస్టు 1969 నుంచి 24 ఆగస్టు 1974 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* అతి తక్కువ మెజారిటీతో రెండో ప్రాధాన్య ఓటు ద్వారా ఎన్నికయ్యారు.
* ప్రస్తుత ఒడిశాలోని బరంపురానికి చెందినవారు.
* ట్రేడ్ యూనియన్ ఉద్యమాలతో సంబంధం కలిగి ఉండేవారు.
* 'వాయిస్ ఆఫ్ కన్సెషన్' అనే గ్రంథాన్ని రచించారు.
* ఈయన కాలంలోనే బ్యాంకుల జాతీయీకరణ జరిగింది.
* రాజభరణాలు ఈయన హయాంలోనే రద్దయ్యాయి.
* పార్లమెంటు ఆమోదించిన కార్మిక బిల్లుపై తన అభ్యంతరాలను తెలియజేస్తూ వెనక్కి తిప్పి పంపారు.
* ప్రభుత్వంలో పెరుగుతున్న అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడిన రాష్ట్రపతి.
* తన ఎన్నిక విషయమై తలెత్తిన వివాదంలో స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై తన వాదనను వినిపించారు.

 

ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1905 - 1977)
* 24 ఆగస్టు 1974 నుంచి 11 ఫిబ్రవరి 1977 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.    
* ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి పదవిని అలంకరించిన మొదటి వ్యక్తి.
* పదవిలో ఉండగా మరణించిన రెండో రాష్ట్రపతి.
* ఈయన రెండో ముస్లిం రాష్ట్రపతి.
* అసోంకు చెందినవారు.
* లోక్‌సభ సభ్యుడిగా ఉంటూ రాష్ట్రపతి పదవికి ఎన్నికవడం ద్వారా లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
* అతి ఎక్కువ ఆర్డినెన్సులను జారీ చేశారు.
* 1975లో ప్రధాని సలహాపై జాతీయ ఆంతరంగిక పరిస్థితిని విధించడం వివాదాస్పదమైంది.
* ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రభావంతో అత్యధిక ఆర్డినెన్సులను జారీచేయడం వల్ల రాష్ట్రపతి 'రబ్బరు ముద్ర' అనే పేరు ఈయన హయాంలోనే వచ్చింది.
* ఈయన మరణించడం వల్ల అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బసప్ప దాసప్ప జెట్టి 1977 ఫిబ్రవరి 11 నుంచి 1977 జులై 25 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు. ఈయన 3వ తాత్కాలిక రాష్ట్రపతి.

 

నీలం సంజీవరెడ్డి (1913 - 1996)
* 1977 జులై 25 నుంచి 1982 జులై 25 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.    
* ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.
* ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి.
* మొదటి పర్యాయం వి.వి.గిరిపై పోటీచేసి ఓడిపోయారు.
* అతి చిన్న వయసులోనే (63 సంవత్సరాలు) రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానూ, స్పీకర్‌గానూ పనిచేశారు.
* మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని ఈయన హయాంలోనే విధించారు.
* ఉపరాష్ట్రపతి పదవి చేపట్టకుండానే రాష్ట్రపతి అయ్యారు.

 

జ్ఞాని జైల్‌సింగ్ (1916 - 1994)
* 1982 జులై 25 నుంచి 1987 జులై 25 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు.    
* పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు.
* మొదటి సిక్కు రాష్ట్రపతి.
* వెనకబడిన తరగతుల నుంచి వచ్చిన మొదటి రాష్ట్రపతి.
* వివాదాస్పద పోస్టల్ బిల్లు (1986)పై పాకెట్ వీటోను వినియోగించిన రాష్ట్రపతి.
* స్వర్ణ దేవాలయంలో 'ఆపరేషన్ బ్లూ స్టార్' అనే సైనిక చర్య ఈయన కాలంలోనే జరిగింది.


రామస్వామి వెంకట్రామన్ (1910 - 2009)
* 25 జులై 1987 నుంచి 25 జులై 1992 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.    
* తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* ఈయన నలుగురు ప్రధానమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వారు 1) రాజీవ్‌గాంధీ 2) వి.పి.సింగ్ 3) చంద్రశేఖర్ 4) పి.వి.నరసింహారావు.

 

డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ (1918 - 1999)
* 25 జులై 1992 నుంచి 25 జులై 1997 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.    
* మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు.
* ఎన్నికల ప్రచార సమయాన్ని 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గిస్తూ చేసిన ఆర్డినెన్స్‌పై సంతకం చేయడానికి నిరాకరించి వెనక్కి పంపారు.
* వివాదాస్పద దళిత క్రిస్టియన్లకు సంబంధించిన రిజర్వేషన్ ఆర్డినెన్స్‌ను వెనక్కి పంపారు.


కె.ఆర్.నారాయణన్ (1920 - 2005)
* 25 జులై 1997 నుంచి 25 జులై 2002 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.    
* కేరళ రాష్ట్రానికి చెందినవారు.
* తొలి దళిత రాష్ట్రపతి.
* అత్యధిక మెజారిటీ (9,56,290)తో గెలుపొందిన రాష్ట్రపతి.
* ఓటు హక్కు ఉపయోగించుకున్న తొలి రాష్ట్రపతి.
* బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించమనే కేంద్ర ప్రభుత్వ తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కి పంపారు.

 

ఎ.పి.జె.అబ్దుల్ కలాం
* 1931లో జన్మించారు.    
* తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* రాష్ట్రపతి అయిన మొదటి శాస్త్రవేత్త.
* 25 జులై 2002 నుంచి 25 జులై 2007 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు.
* భారత క్షిపణి పితామహుడుగా ప్రసిద్ధులు.
* రాష్ట్రపతిగా పనిచేసిన మూడో ముస్లిం వ్యక్తి.
* ద్వంద్వ పదవుల బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి.
* రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తి.
* దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న 2వ రాష్ట్రపతి.
* సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మొదటి రాష్ట్రపతి.
* ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేసి పంపించిన ఆర్డినెన్స్‌ను వెనక్కి పంపారు. కేంద్ర మంత్రివర్గం దీన్ని యథావిధిగా పంపడంతో ఆమోదించారు.
* ఇగ్నైటెడ్ మైండ్స్, విజన్ 2020, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాలను రచించారు.
* యూఎస్‌కు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ 25 మే 2013న 'వెర్నర్ వాన్ బ్రాన్' అనే అవార్డును ప్రదానం చేసింది.


శ్రీమతి ప్రతిభా దేవీ సింగ్ పాటిల్
* 1934లో జన్మించారు.    
* మహారాష్ట్రకు చెందినవారు.
* 2007 జులై 25 నుంచి 2012 జులై 25 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు.
* రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు.
* రాజ్యసభకు డిప్యూటీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.
* బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆహ్వానం అందుకున్న తొలి దేశాధినేత.
* సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతి.
* టీ-90 యుద్ధట్యాంకులో ప్రయాణించిన రాష్ట్రపతి.

 

ప్రణబ్ ముఖర్జీ
* 1935, డిసెంబర్ 11న జన్మించారు.    
* పశ్చిమ్ బంగకు చెందినవారు.
* 2012, జులై 25 నుంచి రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు.
* కేంద్రంలో ఆర్థిక, విదేశాంగ శాఖలకు మంత్రిగా పనిచేశారు.
* ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
* బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా (2011), పద్మవిభూషణ్ (2008), ఉత్తమ పార్లమెంటేరియన్ (1997) లాంటి అవార్డులు లభించాయి.
* మిడ్ టర్మ్, బియాండ్ సర్వైవల్ ఎమర్జింగ్ డైమెన్షన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఆఫ్ ద ట్రాక్, సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్, ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్ అనే పుస్తకాలను రచించారు.

 

ఉపరాష్ట్రపతులు

ఉపరాష్ట్రపతి ప్రత్యర్థి పదవీ కాలం
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ - 1952 - 57
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్   1957 - 62
డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్.సామంత్ సింగ్ 1962 - 67
డాక్టర్ వరాహగిరి వెంకటగిరి డాక్టర్ హబీబ్ 1967 - 69
గోపాల్ స్వరూప్ పాఠక్ హెచ్.వి.కామత్ 1969 - 74
బి.డి.జెట్టి ఎన్.ఇ.హోరో 1974 - 79
ఎం.హిదయతుల్లా - 1979 - 84
ఆర్.వెంకటరామన్ బి.సి.కాంబ్లే 1984 - 87
డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ - 1987 - 92
కె.ఆర్.నారాయణన్ కాకా జోగీందర్ సింగ్ 1992 - 97
కృష్ణకాంత్ సుర్జీత్‌సింగ్ బర్నాలా 1992 - 97
బి.ఎస్.షెకావత్ సుశీల్‌కుమార్ షిండే 2002 - 2007
మహమ్మద్ హమీద్ అన్సారీ నజ్మాహెప్తుల్లా 2007 - 2012
మహమ్మద్ హమీద్ అన్సారీ జస్వంత్‌సింగ్ 2012 -


ఉపరాష్ట్రపతులుగా పనిచేసి, తర్వాత రాష్ట్రపతులు అయినవారు ఆరుగురు.
      (i) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
      (ii) డాక్టర్ జాకీర్ హుస్సేన్
      (iii) వి.వి.గిరి
      (iv) ఆర్.వెంకట్రామన్
      (v) డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ
      (vi) కె.ఆర్.నారాయణన్

 

మరిన్ని ముఖ్యాంశాలు
* ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతులు ముగ్గురు.
      (i) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
      (ii) ఎం.హిదయతుల్లా
      (iii) డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ
* రెండుసార్లు ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించినవారు ఇద్దరు.
      (i) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
      (ii) మహమ్మద్ హమీద్ అన్సారీ.
* ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్లుగా పనిచేసిన ఉపరాష్ట్రపతులు ఇద్దరు.
      (i) శంకర్‌దయాళ్ శర్మ
      (ii) కృష్ణకాంత్
* పదవిలో ఉండగా మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్.
* తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్.
* అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా వ్యవహరించినవారు వి.వి.గిరి.
* తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి ఉపరాష్ట్రపతి వి.వి.గిరి.
* పెద్ద వయసులో ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి ఆర్.వెంకట్రామన్.
* మొదటి దళిత ఉపరాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్.
* ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.